మన జీవితాల్లోకి.. ఇంటర్నెట్ ఇలా!!

Posted By:

మనిషి జీవన శైలిని పూర్తిగా మార్చేసిన ఆధునిక శక్తి ఇంటర్నెట్. కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు కంకణం చుట్టిన అంతర్జాలం విశ్వాన్ని మన ముంగిట ఉంచుతోంది. ఇంటర్నెట్ మానవ జీవితాల్లోకి చొచ్చువస్తోన్న తీరును ఇప్పుడు చూద్దాం...

ప్రపంచపు మొట్టమొదటి టాబ్లెట్ కేఫ్‌ను ఎక్కడ ప్రారంభించారు..?

సాధారణంగా ఇంటర్నెట్ కేఫ్ అంటే వివిధ క్యాబిన్‌లు కలిగి డెస్క్‌టాప్ కంప్యూటర్లను కలిగి ఉంటుంది. ఇంటర్నెట్ కేఫ్‌లలో గంటకు కొద్ది మొత్తంలో అద్దె చెల్లించి ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవచ్చు. అయితే కాస్త వినూత్నంగా ఆలోచించిన సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ప్రపంచంలో మొట్టమొదటి ట్యాబ్లెట్ కేఫ్‌ను సబ్ సహారన్ ఆఫ్రికాలోని సెనగల్ ప్రాంతంలో ఏర్పాటు చేసింది. ఈ ఇంటర్నెట్ కేఫ్‌లో కేవలం ట్యాబ్లెట్ పీసీలు మాత్రమే ఉంటాయి. ఆఫ్రికా ప్రాంతంలో ఇంటర్నెట్ వినియోగం మరింతగా వ్యాప్తి చెందిన నేపధ్యంలో ఈ కేఫ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేఫ్‌లో మొత్తం 15 ట్యాబ్లెట్స్ ఉంటాయి. నెటిజనులు వీటి ద్వారానే ఇంటర్నెట్ సేవలను పొందాల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మన జీవితాల్లోకి.. ఇంటర్నెట్ ఇలా!!

ఇంటర్నెట్ ఆధారంగా స్పందించే కార్లు త్వరలో సాకారంకానున్నాయి. ఈ స్మార్ట్ కార్లు తమ భాగోగులను తామే చూసుకుంటాయి. అంటే, క్యాలెండర్ ప్రకారం మెకానిక్ దగ్గరకు వెళ్లవల్సిన సమయాన్ని యూజర్ కు గుర్తు చేయటం, ఇంజిన్ ఆయిల్ మార్చవల్సి వచినప్పుడు అలర్ట్ చేయటం.

మన జీవితాల్లోకి.. ఇంటర్నెట్ ఇలా!!

మనిషి ఆరోగ్యాన్ని మానిటర్ చేస్తున్న ఇంటర్నెట్:

మార్కెట్లో ఇప్పటికే లభ్యమవుతోన్న వివిధ స్మార్ట్ ఫోన్ యాప్స్ మనిషి ఆరోగ్యాన్ని మానిటర్ చేయటంలో క్రీయాశీలక పాత్రోపోషిస్తున్నాయి.

సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లలో లభ్యమవుతోన్న హార్ట్‌రేట్ మానిటర్ గుండె వేగాన్ని కొలవటంతో కీలక పాత్ర పోషిస్తోంది. ఇంటర్నెట్ ద్వారా
రక్తపోటు ఇంకా చక్కెర స్థాయిలను మానిటర్ చేయకోగలిగే వ్యవస్థను నిపుణులు అభివృద్థి చేసారు.

 

మన జీవితాల్లోకి.. ఇంటర్నెట్ ఇలా!!

విద్యుత్ వాడకాన్ని ఆదా చేసే అత్యాధునిక ఇంటర్నెట్ మానిటరింగ్ పరిజ్ఞానం ఇప్పటికే అభివృద్థి చెందిన దేశాల్లో అందుబాటులో ఉంది. ఈ ఇంటర్నెట్ ఆధారిత సెన్సార్ గాడ్జెట్‌లు విద్యుత్ ను అవసరనాకి అనుగుణంగా ఖర్చు చేసుకునేలా చూస్తాయి.

మన జీవితాల్లోకి.. ఇంటర్నెట్ ఇలా!!

తల్లితండ్రులు తమ ఆఫీసుల్లో కూర్చోని స్మార్ట్‌ఫోన్ సహాయంతో ఇంటి వద్ద ఉన్న తమ పిల్లల భాగోగులను మానిటర్ చేయగలుగుతున్నారు. అలానే పెట్ మానిటరింగ్ సిస్టంలు అందుబాటులోకి వచ్చేసాయి. ఇదంతా ఇంటర్నెట్ పుణ్యుమే.

మన జీవితాల్లోకి.. ఇంటర్నెట్ ఇలా!!


వేరబుల్ టెక్ పుణ్యమా అంటూ స్మార్ట్‌వాచ్‌లు, రిస్ట్ బ్యాండ్‌లు, హెల్త్ బ్యాండ్‌లు అందుబాటులోకి వచ్చేసాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
'Internet of Things' Will Impact Your Everyday Life. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot