ఇండియా ఇంటర్నెట్ యూజర్స్‌ 100 మిలియన్లు..!

Posted By: Super

ఇండియా ఇంటర్నెట్ యూజర్స్‌ 100 మిలియన్లు..!

ఇటీవల ఇంటర్నెట్ అండ్ మొబైల్ ఆసోషియేషన్ ఆఫ్ ఇండియా(IAMAI) విడుదల చేసిన స్టాటస్టిక్స్ ప్రకారం భారతదేశంలో ఇంటర్నెట్ వాడేటటువంటి వారి సంఖ్య 100 మిలియన్లకు చేరుకుందని తెలిపింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఇండియాలో ఉన్న ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య 112 మిలియన్లకు చేరుకుందని, దేశం మొత్తం మీద గనుక చూసినట్లైతే 88 మిలియన్లు పెద్ద పట్టణాలు, రాజధానులు నుండి వాడుతుండగా, అదే 24మిలియన్లు చిన్నచిన్న పట్టణాల నుండి వాడుతున్నారని సర్వేలో తెలిసింది.

గత సంవత్సరం ఇంటర్నెట్ వాడే వారి సంఖ్యతో పొల్చుకుంటే ఈ సంవత్సరం 13శాతం పెరిగినట్లు తెలిపింది. అంతేకాకుండా ఈ సంవత్సరం చివరికల్లా 11మిలియన్ యూజర్స్ చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. 112 మిలియన్ యూజర్స్ అంటే చూడడానికి చాలా సంతోషంగా ఉన్నప్పటికీ, భారత దేశ మొత్తం జనాభా(1.2బిలియన్)తో పొల్చుకుంటే ఇది మాత్రం కేవలం 10శాతం మాత్రమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. 90 మిలియన్ జనాభా మాత్రం నెలకొకసారి ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారని రీసెర్చ్ ఆర్గనైజేషన్ తెలిపింది.

దేశం మొత్తం మీద 58.6 మిలియన్ జనాభా తమయొక్క పర్సనల్ కంప్యూటర్ల ద్వారా ఇంటర్నెట్ వాడుతుండగా, 14.7 మిలియన్ జనాభా మాత్రం ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా వాడుతుండగా, మిగిలిన 11.9 మిలియన్ జనాభా బ్రాడ్ బ్యాండ్ ద్వారా ఇంటర్నెట్‌కి కనెక్ట్ అవ్వడం జరుగుతుందని తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot