ఇంటర్నెట్ ‘కట్’,జూలై 9 నుంచి అమల్లోకి..?

Posted By: Super

ఇంటర్నెట్ ‘కట్’,జూలై 9 నుంచి అమల్లోకి..?

 

వైరస్ బారిన పడ్డ 3.50లక్షల కంప్యూటర్లకు ఇంటర్నెట్ సేవలను నిలుపుదల చేసేందుకు అమెరికా సంస్థ, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) సమాయుత్తమవుతోంది. తొలగించనున్న వాటిలో అమెరికాకు చెందన 80 వేలు, బ్రిటన్‌కు చెందిన 20 వేల కంప్యూటర్లు ఉన్నాయి. ఈ కంప్యూటర్లకు ‘డీఎన్ఎస్ చేంజర్’ వైరస్ సోకిందని నిర్థారించటంతో జూలై 9 నుంచి వీటికి ఇంటర్నెట్ సేవలు నిలుపుదల చేస్తున్నట్లు డైలీమెయిల్ వెల్లడించింది. ఈ వైరస్‌ను ముందుగానే గుర్తించిన ఎఫ్‌బీఐ, వైరస్ సోకిన సంబంధిత కంప్యూటర్లు పనిచేసేందుకు వీలుగా తాత్కాలిక సర్వర్లును ఏర్పాటుచేసింది. ఈ ప్రకిృయ చాలా వ్యయంతో కూడుకుని ఉండటంతో గత్యంతరం లేక కనెక్షన్‌లను తొలగించనున్నారు.

అంతానికి కౌంట్‌డౌన్ స్టార్ట్..?

గత కొద్ది సంవత్సరాల కాలంగా కంప్యూటింగ్ ప్రపంచానికి విశిష్టసేవలందిస్తున్న అత్యుత్తమ ఆపరేటింగ్ సిస్టం విండోస్ ఎక్స్‌పీ మరికొద్ది రోజుల్లో కనుమరుగు కానుంది. నివ్వెరపాటకు‌లోను చేసే ఈ వార్తను యూఎస్‌కు చెందిన ఓ ప్రముఖ బ్లాగ్ ప్రచురించింది. నవీకరణ నేపధ్యంలో ఈ నిర్ణయం అనివార్యమైనట్లు తెలుస్తోంది. ఎక్స్‌పీకి అప్‌డేటెడ్ వర్షన్‌లుగా విండోస్ 7, విండోస్ విస్టాలు వినియోగంలోకి వచ్చిన విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్ తాజా నిర్ణయంతో ఏప్రిల్ 8, 2014, నాటికి విండోస్ ఎక్స్‌పీ అదేవిధంగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2003ల సేవలు పూర్తిగా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశం పై మైక్రోసాఫ్ట్ మార్కెటింగ్ డైరెక్టర్ స్టెల్లా చెర్నాయక్ స్పందిస్తూ ఎక్స్‌పీ యూజర్లు నిర్ణీత సమయంలోపే విండోస్ 7 లేదా విస్టాకు మైగ్రేట్ కావాలని సూచించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot