కళ్శు లేని వారికోసం ప్రత్యేకంగా బ్రెయిలీ మొబైల్‌ ఫోన్‌, రూ2,600 మాత్రమే

Posted By: Super

కళ్శు లేని వారికోసం ప్రత్యేకంగా బ్రెయిలీ మొబైల్‌ ఫోన్‌, రూ2,600 మాత్రమే

న్యూఢిల్లీ: దృశ్య జ్ఞానం లోపించిన వారు ఉపయోగించుకొనేందుకు ప్రత్యేకంగా 'ఇంటెక్స్‌ విజన్‌' పేరుతో ఒక మొబైల్‌ ఫోనును భారత మార్కెట్‌లో మొట్టమొదటి సారిగా ప్రవేశపెట్టినట్లు ఇంటెక్స్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. రూ.2,600 ధరకు లభించే ఇంటెక్స్‌ విజన్‌ ప్రత్యేకతలను కంపెనీ డైరెక్టర్‌ జనరల్‌ మేనేజర్‌ శైలేంద్ర ఝా విలేకరులకు వివరించారు. ఇందులో రెండు సిమ్‌ కార్డులు (జీఎస్‌ఎమ్‌- జీఎస్‌ఎమ్‌) ఉంచుకోవచ్చు; పెద్ద సైజు అంకెలతో కూడిన బ్రెయిలీ కీప్యాడ్‌తో పాటు మాట్లాడే కీప్యాడ్‌ ఫీచర్‌ ఇందులో ఉంటుంది. ఈ కీప్యాడ్‌ పైన నంబర్‌లను ఒత్తడంతోనే ఆ అంకె ఎంతనేది ఇంగ్లిషులో వినిపిస్తుంది.

నాలుగు ఎమర్జెన్సీ నంబర్‌లను సేవ్‌ చేసుకోవడానికి వీలుగా ఎస్‌ఓఎస్‌ బటన్‌ను అమర్చారు. చిన్న కీప్యాడ్‌ను ఉపయోగించుకోవడంలో ఇబ్బంది పడే వయోవృద్ధులను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రకం హ్యాండ్‌సెట్‌ను తీర్చిదిద్దామని ఝా గుర్తు చేశారు. తంత్రీరహిత (వైర్‌లెస్‌) ఎఫ్‌ఎమ్‌ రేడియో, ఆడియో ప్లేయర్‌, 2జీబీ వరకు విస్తరించే మెమరీ, టార్చి లైటు, ఆటోకాల్‌ రికార్డ్‌, మొబైల్‌ ట్రాకర్‌, కీప్యాడ్‌ను లాక్‌ చేయడానికి వన్‌-టచ్‌ కీ, 1000 కాంటాక్ట్‌ల ఫోన్‌ మెమరీ, అలాగే 250 సంక్షిప్త సందేశ సేవల (ఎస్‌ఎంఎస్‌)ను నిక్షిప్తం చేసుకొనే వీలు ఈ హ్యాండ్‌సెట్‌లోని ఇతర ప్రత్యేకతలు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot