ప్రొజెక్టర్ మొబైల్ 8809ను విడుదల చేసిన ఇంటెక్స్

Posted By: Staff

ప్రొజెక్టర్ మొబైల్ 8809ను విడుదల చేసిన ఇంటెక్స్

ప్రొజెక్టర్ సదుపాయం కలిగిన మొబైల్ ఫోన్‌ను ఇంటెక్స్ మార్కెట్లోకి విడుదల చేసింది. వీ-షోగా పిలువబడే మినీ థియేటర్ 8809 ప్రొజెక్టర్ ఫోన్ 2.4" 262కె కలర్ క్యూవీజీఏ స్క్రీన్‌, మోషన్ సెన్సార్ ఫీచర్లతో ఇది లభిస్తుంది. ఈ మొబైల్ ప్రత్యేకత ఏంటంటే.. 3జిపి, ఎమ్‌పి4, ఏవీఐ ఫార్మాట్ వీడియోలను 25 ఎఫ్‌పిఎస్ (ఫ్రేమ్స్ పర్ సెకండ్) వద్ద తెల్లటి తెరపై కానీ లేదా గోడలపై కానీ ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. కేవలం వీడియోలను మాత్రమే కాకుండా.. ఫోటోలు, వెబ్‌పేజ్‌లు, ఆఫీస్ డాక్యుమెంట్లను కూడా పెద్ద స్క్రీన్‌పై చూడవచ్చు.

ఇంకా ఇది 2 మెగా పిక్సెల్ కెమెరాతో పాటు డ్యూయెల్ సిమ్ (జిఎస్ఎమ్ + జిఎస్ఎమ్), ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్, బ్లూటూత్ విత్ ఏ2డిపి, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, వెబ్ కెమెరాలతో ఇంటెక్స్ 8809 ప్రొజెక్టర్ ఫోన్ లభిస్తుంది. 87 ఎంబి ఇంటర్నల్ మెమరీతో లభ్యమయ్యే ఈ ప్రొజెక్టర్ ఫోన్ మెమరీ సామర్థ్యాన్ని మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా 16 జిబి వరకూ పెంచుకోవచ్చు. దీని బ్యాటరీ, 3.5 గంటల టాక్‌టైమ్‌ను, 168 గంటల స్టాండ్‌బైను కలిగి ఉండే దీని ధర భారత్‌లో రూ. 6,300గా ఉంది. ఇంటెక్స్ 8809 ప్రొజెక్టర్ ఫోన్ గురించి మరింత సాంకేతిక సమాచారం మీ కోసం..

ఇంటెక్స్ మినీ థియేటర్ 8809 ఫీచర్స్:
* 2.4 inch QVGA 262K Display
* Dual SIM
* 2MP camera
* Bluetooth with A2DP
* Projector
* 87MB internal memory (16 GB expandable)
* Webcam
* Dimension - 118x51x17.5 mm
* 1000 mAh Battery

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot