జియో దెబ్బకు విలవిల, భారీగా నష్టపోయిన దేశీయ కంపెనీ

Written By:

వచ్చి రావడంతోనే రిలయన్స్ జియో దేశంలో ఓ పెను విప్లవాన్ని సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే జియో దెబ్బకు టెలికం కంపెనీలే కాదు. కొన్ని దేశీయ మొబైల్ కంపెనీలు కూడా భారీ నష్టాలను చవి చూశాయి. వాటిలో దేశంలో నంబర్ టూ స్థానంలో ఉన్న ఇంటెక్స్ కూడా ఉంది.

ప్రమాదంలో స్మార్ట్‌ఫోన్లు, ఈ నకిలీ యాప్స్ డౌన్‌లోడ్ చేశారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటెక్స్‌ టెక్నాలజీస్‌కు రిలయన్స్‌ జియో దెబ్బ

దేశంలోనే రెండో అతిపెద్ద హ్యాండ్‌సెట్‌ తయారీదారిగా ఉన్న ఇంటెక్స్‌ టెక్నాలజీస్‌కు రిలయన్స్‌ జియో భారీగా దెబ్బకొట్టింది.

విక్రయాలు 30 శాతం మేర ..

2016-17లో ఇంటెక్స్‌ టెక్నాలజీస్‌ విక్రయాలు 30 శాతం మేర క్షీణించాయి. దీనికంతటికీ కారణం రిలయన్స్‌ జియో ఎంట్రీ, డిమానిటైజేషన్‌ ప్రభావమేనని తెలిపింది.

రిలయన్స్‌ జియో రాకతో...

తమ రెవెన్యూలు కిందకి దిగజారాయని, రిలయన్స్‌ జియో రాకతో ఇండస్ట్రి హఠాత్తుగా 2జీ, 3జీ నుంచి 4జీకి మారిపోయిందని ఇంటెక్స్‌ టెక్నాలజీస్‌ రెగ్యులేటరీ ఫైలింగ్‌లోపేర్కొంది..

కొత్త 4జీ హ్యాండ్‌సెట్‌ మోడళ్లను..

కొత్త 4జీ హ్యాండ్‌సెట్‌ మోడళ్లను అందుబాటులోకి తీసుకురావడానికి కొంత సమయం పట్టిందని, అంతేకాక డిమానిటైజేషన్‌ ప్రభావంతో తమకు ఎక్కువగా విక్రయాలు నమోదయ్యే గ్రామీణ ప్రాంతాల్లో నవంబర్‌ నుంచి మార్చి కాలంలో విక్రయాలు ఢమాలమన్నట్టు పేర్కొంది.

గతేడాది ఇంటెక్స్‌ రెవెన్యూలు

కాగా గతేడాది ఇంటెక్స్‌ రెవెన్యూలు రూ.6,223.42 కోట్లగా ఉండగా... 2017 మార్చి వరకు ఇవి రూ.4,364.08 కోట్లగా నమోదయ్యాయి. అదేవిధంగా నికర లాభాలు 17 శాతం క్షీణించి రూ.127.3 కోట్లగా నమోదయ్యాయి.

అటు టెలికాం కంపెనీలకే కాక..

రిలయన్స్ జియో అటు టెలికాం కంపెనీలకే కాక, ఇటు మొబైల్‌ కంపెనీలకు తీవ్ర సంకటంగా నిలుస్తోంది. ముందు ముందు ఇంకెన్ని కంపెనీలకు దెబ్బ తగులుతుందోనని కంపెనీలు ఆందోళనలో పడపోయాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Intex says sales plunge 30%, the company 'blames' Reliance Jio More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot