యాడ్‌జీబ్రాను ఆవిష్కరించిన ఇనుక్సు: అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ విభాగాల్లో ప్రయోజనాలే లక్ష్యం

Posted By:

డిజిటల్ మీడియా టెక్నాలజీ విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రముఖ కంపెనీ ఇనుక్సు , యాడ్‌జీబ్రా (Adgebra)పేరుతో ఓ వేదికను ప్రకటించింది. అడ్వర్టైజింగ్ ఇంకా మార్కెంటింగ్ ప్రకటనలకు యాడ్‌జీబ్రా వేదికగా నిలవనుంది. ప్రకటనకర్తలు అలానే ప్రచరణకర్తలకు వారధిగా వ్యవహరించే యాడ్‌జీబ్రా సమగ్రమైన రీతిలో పారదర్శకమైన వాతావరణంలో తన సేవలను అందిస్తుంది. 

యాడ్‌జీబ్రాను ఆవిష్కరించిన ఇనుక్సు

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

వెబ్ మీడియాలో ఖచ్చితమైన పాఠకులకు చేరువయ్యేందుకు యాడ్‌జీబ్రా దోహదపడుతుంది. ముఖ్యంగా ప్రకటనకర్తలు వారి బ్రాండ్ ను నెటిజనులకు మరింత చేరువచేసుకునేలా స్లైడర్, ఇమేజ్, వీడియో వంటి సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు. మార్కెటర్ల స్వీయ సర్వే మోడల్ కోసం నిపుణులు ప్రచారాన్ని ఏ విధంగా నిర్వహిస్తారో తెలియజేయవచ్చు. పెరుగుతున్న ఆదాయం కోసం ప్రకటన జాబితాతో పాటుగా ప్రేక్షకులను వాణిజ్యానికి ప్రచురణకర్తలు ప్రోత్సహించేదే యాడ్‌జీబ్రా. యాడ్‌జీబ్రా సాయంతో పబ్లిషర్స్ నిజ సమయ ధర, ఫ్రీక్వెన్సీతో పాటు పూర్తి నియంత్రణను పొందొచ్చు.

యాడ్‌జీబ్రా గురించి కంపెనీ సీఈఓ రోహిత్ భాగద్ మాట్లాడుతూ డిజిటల్ మీడియా రంగంలో స్థిరంగా ప్రకటనల ప్రోగ్రాముల వేదిక యొక్క పూర్తి సామర్థ్యాన్ని అన్వేషించడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఇనుక్సు ప్రధాన కార్యాలయం పూణెలో ఉంది. భారతదేశపు నెం. 1 డిజిటల్ మీడియా కంపెనీ నెట్ కోర్ సోల్యూషన్స్, భారతదేశపు నెం.1 ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ వన్‌ఇండియాల వెంచరే ఈ ఇనుక్సు యాడ్‌జీబ్రా.

English summary
Inuxu Launches Adgebra For Advertising & Marketing Benefits. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot