ఈమెయిల్ సృష్టికర్త ఇకలేరు

Written By:

ఈమెయిల్ సృష్టికర్త రే టామ్లిన్సన్ (74) శనివారం కన్నుమూశారు. అమెరికాకు చెందిన ఈ కంప్యూటింగ్ లిజెండ్ ఛాతినొప్పి కారణంగా మరణించినట్లు తెలుస్తోంది. ఒక నెట్ వర్క్ నుంచి మరో నెట్ వర్క్‌కు సందేశాన్ని ఏ విధంగా బట్వాడా చేయవచ్చనే సాధ్యాసాధ్యాలపై రే టామ్లిన్సన్ అనేక పరిశోధనలు జరిపారు. 1971లో బోస్టన్‌లో తాను పని చేస్తున్న సంస్ధలోని తన తోటి సహోద్యోగికి మొట్టమొదటి మెయిల్‌ను విజయవంతంగా పంపగలిగారు.

ఈమెయిల్ సృష్టికర్త ఇకలేరు

ఈమెయిల్ వ్యవస్థలో.. యూజర్, హోస్ట్‌లు మధ్య స్ఫష్టమైన తేడాను గుర్తించేందుకు‌గాను '@'గుర్తను కూడా ఈయనే మొదటగా ఉపయోగించారు. అమెరికా ప్రభుత్వ కంప్యూటర్ వ్యవస్థ ఆర్పానెట్ ద్వారా పక్కపక్కనే ఉన్న రెండు కంప్యూటర్ల మధ్య తొలి సందేశాన్ని పంపినట్లు ఆయన గతంలోనే తన బ్లాగు ద్వారా వెల్లడించారు. ఈ కంప్యూటింగ్ లిజెండ్ మృతిపట్ల నెటిజనులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈమెయిల్ గురించి పలు ఆసక్తికర విషయాలు...

Read More : మీ ల్యాప్‌టాప్ వేడెక్కటానికి 5 కారణలు..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈమెయిల్ అంటే ఏంటి..?

ఇంటర్నెట్ పరిభాషలో ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ (Electronic Mail) అని అర్థం. ఇంటర్నెట్ అందుబాటులోని కాలంలో సమాచారాన్ని సాంప్రాదాయ పోస్టల్ పద్ధతి ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసేవారు.

ఈమెయిల్ అంటే ఏంటి..?

కమ్యూనికేషన్ ప్రపంచంలో చోటు చేసుకున్న విప్లవాత్మక కారణాలతో సమాచారాన్సి స్టేషనరీ పద్ధితిలో కాకుండా డిజిటల్ కమ్యూనికేషన్ పద్ధతిలో క్షణాల్లో ట్రాన్స్‌ఫర్ చేయగలుతున్నాం.

ఈమెయిల్ అంటే ఏంటి..?

ఈమెయిల్‌ను ఒక కంప్యూటర్ నుంచి మరొక కంప్యూటర్‌కు ఇంటర్నెట్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.

ఈమెయిల్ అంటే ఏంటి..?

మీరు పంపే ఈమెయిల్‌కు సంబంధించి నిర్ణీత వ్యక్తి లేదా సంస్థకు చెందిన ఈమెయిల్ ఐడీ ఖచ్చితంగా ఉండాలి.

ఈమెయిల్ అంటే ఏంటి..?

ఈమెయిల్ ద్వారా కేవలం అక్షరాలతో కూడిన సందేశాలే కాదు కార్టూన్స్, వాల్ పేపర్స్, వీడియో ఫైల్స్, ట్యూన్స్ ఇలా అనేక రకాలైన డేటాను పంపవచ్చు.

ఈమెయిల్ అంటే ఏంటి..?

పురాతన పోస్టల్ విధానలతో పోలిస్తే ఈమెయిల్ సమాచార చేరవేతను మరింత సులభతరం చేసింది.

ఈమెయిల్ అంటే ఏంటి..?

పోస్టల్ పద్ధతి ద్వారా సమాచారాన్ని వేరొక వ్యక్తికి చేరవేయాలంటే చాలా సమయం అమయసరమైతే , ఈమెయిల్ ద్వారా ఆ పని క్షణాల్లో పూర్తి అవుతుంది.

ఈమెయిల్ అంటే ఏంటి..?

ప్రపంచంలో ఏ ప్రదేశానికైనా ఈమెయిల్‌ను పంపవచ్చు. ఇందుకు అయ్యే ఖర్చుకూడా నామమాత్రమే.

ఈమెయిల్ అంటే ఏంటి..?

పోస్టల్ పద్ధతి ద్వారా సమాచారాన్ని మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేయగలం. కాని, ఈమెయిల్ ద్వారా అక్షరాలతో కూడిన సందేశాలే కాదు కార్టూన్స్, వాల్ పేపర్స్, వీడియో ఫైల్స్, ట్యూన్స్ ఇలా అనేక రకాలైన డేటాను పంపవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Inventor of email and savior of the @ sign, Ray Tomlinson dead at 74. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot