లైంగిక దాడుల నుంచి రక్షించే ‘జీపీఎస్ లోదుస్తు’

Posted By:

ఇటీవల కాలంలో మహిళల పై పెరుగుతున్న లైంగిక దాడుల పై స్పందించిన చెన్నైకి చెందిన ముగ్గురు ఆటోమొబైల్ ఇంజనీర్లు మహిళలను లైంగిక దాడుల నుంచి రక్షించే ప్రత్యేకమైన లోదుస్తులను రూపొందించారు. జీపీఎస్ మాడ్యుల్స్‌తో రూపుదద్దుకున్న ఈ లోదుస్తులను మహిళలు ధరించినట్లయితే విపత్కర పరిస్థితులలో సంబంధిత హెచ్చరికా సంకేతాలు బాధితురాలి తల్లిదండ్రులు ఇంకా పోలీసులకు పంపబడుతాయని రూపకర్తలు అంటున్నారు.

గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్), గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ (జీఎస్ఎం) సాంకేతిక వ్యవస్థలకు సంబంధించిన ఉపకరణాలతో పాటు, షాక్ తరంగాలను విడుదల చేసే ప్రెజర్ సెన్సర్లను ఈ దుస్తులో అమర్చారు. ఈ ప్రాజెక్ట్‌ను ‘షి' (సొసైటీ హార్నెసింగ్ ఎక్విప్‌మెంట్ - ఎస్‌హెచ్‌ఈ) గా పిలుస్తున్నారు.

బస్సులు, బహిరంగా ప్రదేశాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే మహిళలకు ఇదెంతో ఉపయుక్తమని ఈ పరికరాన్ని రూపొందించిన మనీషా మోహన్ తెలిపారు. ఒక బాలిక పై లైంగిక దాడి పాల్పడటానికి యత్నించినపుడు ప్రెజర్ సెన్సర్ అప్రమత్తమై సదరు వ్యక్తికి వెంటనేన షాక్ కొట్టేలా చేస్తుందని మనీషా తెలిపారు. అమర్చిన జీపీఎస్, జీఎస్ఎం వ్యవస్థలు ప్రమాద సంకేతాలను పోలీసుల అత్యవసర నెంబరు 100కు ఇంకా తల్లిదండ్రుల మొబైల్ ఫోన్‌లకు సందేశాల రూపంలో చేరవేస్తాయి.

లైంగిక దాడుల నుంచి రక్షించే ‘జీపీఎస్ లోదుస్తు’

చెన్నైలోని శ్రీ రామస్వామి స్మారక విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదువుతున్న మనీషా తన సహవిద్యార్థులైన రింపి త్రిపాఠి, నీలాద్రి బసుపాల్‌తో కలిసి ‘షి' పరికారాన్ని డిజైన్ చేసారు.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot