iPhoneను మరింత మెరుగుపరచడానికి iOS 14 అందిస్తున్నకొత్త ఫీచర్లు ఇవే...

|

ప్రముఖ ఆపిల్ సంస్థ తన ఐఫోన్‌ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త సాఫ్ట్‌వేర్ అప్ డేట్ లను తీసుకువస్తున్నది. ఇప్పుడు కూడా కొత్తగా iOS14 ను ప్రపంచం మొత్తం మీద విడుదల చేసింది. ఈ తాజా సాఫ్ట్‌వేర్ అప్ డేట్ ఐఫోన్ యొక్క అనుభవాన్ని మునుపటి కంటే మెరుగ్గా అందించనున్నది అలాగే కొత్త ఫీచర్లను కూడా తీసుకువస్తున్నది. మెసేజ్ల నుండి ప్రైవసీ వరకు ప్రతిదానిని ప్రజలు తమ ఐఫోన్‌లో ఉపయోగించడంలో ఆపిల్ గణనీయమైన మరియు అద్బుతమైన సౌందర్య మార్పులను చేసింది. ఐఫోన్‌ను మెరుగుపరిచే ఈ ఫీచర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఐఫోన్ హోమ్ స్క్రీన్‌ను మార్చే విడ్జెట్‌లు

ఐఫోన్ హోమ్ స్క్రీన్‌ను మార్చే విడ్జెట్‌లు

ఆపిల్ చివరకు విడ్జెట్ యొక్క ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనితో పాటుగా ఆండ్రాయిడ్‌లో అందుబాటులో ఉన్న ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఐఫోన్‌లోని విడ్జెట్‌లు గతంలో కంటే భిన్నమైన రూపాన్ని ఇస్తాయి. మీరు మీకు కావలసినదాన్ని దృష్టిలో ఉంచుకొని బ్యాటరీలు, ఫోటోలు, వాతావరణం కోసం విడ్జెట్‌ను జోడించవచ్చు.

 

Also Read: Amazon Great Indian Festival Sale: OnePlus స్మార్ట్‌ఫోన్‌ల మీద రూ.5000 వరకు తగ్గింపు!మిస్ అవ్వకండి..Also Read: Amazon Great Indian Festival Sale: OnePlus స్మార్ట్‌ఫోన్‌ల మీద రూ.5000 వరకు తగ్గింపు!మిస్ అవ్వకండి..

ఐఫోన్‌లో ఫోటోలను మరింత మెరుగైన రీతిలో హైడ్ చేయడం

ఐఫోన్‌లో ఫోటోలను మరింత మెరుగైన రీతిలో హైడ్ చేయడం

హిడెన్ ఫోటోల ఫీచర్ అనేది ఇప్పటికే ఐఫోన్‌లో అందుబాటులో ఉంది. కాని iOS 14 దీన్ని మరింత మెరుగ్గా అందిస్తున్నది. మీరు దాన్ని తిరిగి ప్రారంభించే వరకు హైడ్ చేసిన ఆల్బమ్‌లను పూర్తిగా దాచగలిగే సెట్టింగ్ ఇప్పుడు అందుబాటులో ఉంది.

సరికొత్త ఆల్-యాప్ లైబ్రరీ & మెమోజీ ఎంపికలు
 

సరికొత్త ఆల్-యాప్ లైబ్రరీ & మెమోజీ ఎంపికలు

ఆపిల్ సంస్థ iOS 14 తో సరికొత్త ఆల్-యాప్ లైబ్రరీని కూడా తీసుకువచ్చింది. ఇది అన్ని రకాల యాప్ లను ఒకే దానిలో అమర్చడానికి చక్కని మార్గంగా ఉంటుంది. మీకు అవసరం లేని యాప్ ను తొలగించకూడదనుకున్నా మీరు హోమ్ స్క్రీన్ నుండి తీసివేసి యాప్ లైబ్రరీలో స్టోర్ చేసుకోవచ్చు. దీనితో పాటుగా ఆపిల్ కొత్త హెయిర్ స్టయిల్, హెడ్‌వేర్ మరియు ఫేస్ కవరింగ్ వంటి మెమోజీ ఎంపికలను IOS 14 లో కొత్తగా అందిస్తున్నాయి.

Gmail, Google ని డిఫాల్ట్ మెయిల్ మరియు బ్రౌజర్ యాప్ లుగా ఉపయోగించడం

Gmail, Google ని డిఫాల్ట్ మెయిల్ మరియు బ్రౌజర్ యాప్ లుగా ఉపయోగించడం

iOS 14 తో ఆపిల్ మూడవ పార్టీ యాప్ లకు గతంలో కంటే ఎక్కువ యాక్సిస్ ను ఇచ్చింది. దీని అర్థం ఒకరు Gmail - లేదా మరేదైనా మెయిల్ సేవను డిఫాల్ట్ మెయిల్ యాప్ గా సెట్ చేయవచ్చు. బ్రౌజర్‌కు కూడా అదే జరుగుతుంది.

యూట్యూబ్‌లో పిక్చర్-ఇన్-పిక్చర్ ఫీచర్

యూట్యూబ్‌లో పిక్చర్-ఇన్-పిక్చర్ ఫీచర్

ఆపిల్ ఐఫోన్‌లో మీరు ఒక నిర్దిష్ట యాప్ లో ఉంటే మరియు YouTube వీడియో పాపప్ అయితే కనుక iOS 14 తో పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్ యాక్టీవేట్ చేయవచ్చు. ఇది ప్రస్తుతం YouTube యాప్ లో అందుబాటులో లేదు కానీ సఫారి మరియు వాట్సాప్‌లో ఇది బాగా పనిచేస్తుంది.

Best Mobiles in India

English summary
iOS 14 New Features Brings to Improve The iPhone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X