iOS 15.5, iPadOS 15.5 కొత్త అప్‌డేట్ ను డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

|

కుపెర్టినో టెక్ దిగ్గజం ఆపిల్ తన యొక్క ఐఫోన్ వినియోగదారుల కోసం తాజాగా iOS 15.5 సాఫ్ట్‌వేర్ అప్ డేట్ ని విడుదల చేసింది. ఇది WWDC 2022 లో iOS 16 లాంచ్ అవుతుంది అని భావిస్తున్న కొన్ని వారాల ముందు రావడం విశేషం. iOS 15.5 అప్‌డేట్ ఆపిల్ వాలెట్ మరియు పాడ్‌క్యాస్ట్‌లకు కొత్త అనుభవాలను అందించడమే కాకుండా సెక్యూరిటీ పరిష్కారాల జాబితాను కూడా కలిగి ఉంటుంది. అదనంగా ఇది యాప్‌లో కొనుగోళ్లపై నియంత్రణ ఒత్తిడిని పరిష్కరించడానికి సహాయపడుతుంది అని ఆపిల్ సంస్థ పేర్కొంది. iOS 15.5తో పాటు ఆపిల్ ఐప్యాడ్ OS 15.5ని కూడా అర్హత కలిగిన ఐప్యాడ్ వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

iOS 15.5లో కొత్త విషయాలు

iOS 15.5లో కొత్త విషయాలు

iOS 15.5 కొత్త అప్‌డేట్ లోని ముఖ్యమైన విషయాల విభాగానికి వస్తే ఆపిల్ వాలెట్ యాప్‌ని తీసుకువస్తుందని చూపిస్తుంది. ఇది వినియోగదారులను ఆపిల్ క్యాష్ కార్డ్ ద్వారా త్వరగా డబ్బును పంపడానికి మరియు అభ్యర్థించడానికి అనుమతిస్తుంది. మీ ఐఫోన్ లో స్టోర్ చేయబడిన ఎపిసోడ్‌లను పరిమితం చేయడంలో మరియు పాత వాటిని ఆటొమ్యాటిక్ గా తొలగించడంలో సహాయపడే కొత్త సెట్టింగ్‌తో ఆపిల్ పాడ్‌క్యాస్ట్‌లను కూడా కొత్త అప్‌డేట్ లో అందిస్తుంది. ఇవే కాకుండా iOS 15.5 అప్‌డేట్ లో అనేక సెక్యూరిటీ పరిష్కారాలను కూడా కలిగి ఉంటుంది.

గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్ ! రోడ్డుపై కార్లు, మనుషులను కూడా 3D చూపిస్తుంది.గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్ ! రోడ్డుపై కార్లు, మనుషులను కూడా 3D చూపిస్తుంది.

iOS అప్‌డేట్
 

iOS అప్‌డేట్ లలో ఆపిల్ యొక్క కమ్యూనికేషన్ సేఫ్టీని కూడా విస్తరింపజేస్తుంది. ఇది ప్రారంభంలో USలో ప్రారంభించబడింది. ఇది నగ్నత్వంతో ఉన్న ఫోటోలను చూడకుండా లేదా షేర్ చేయకుండా నిరోధించడానికి అనుమతిస్తుంది. ఇప్పుడు ఇది ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ మరియు UKకి విస్తరించబడింది. ఆపిల్ తన ఆధిపత్యాన్ని తగ్గించుకోవడానికి మరియు డెవలపర్‌లు సబ్‌స్క్రిప్షన్‌లను తీసుకోవడానికి మరియు కంపెనీకి 30 శాతం కమీషన్ చెల్లించకుండా యాప్‌లో కొనుగోళ్లను ప్రారంభించేందుకు యాప్‌ల కోసం బాహ్య కొనుగోలు వ్యవస్థలను అనుమతించడంపై నియంత్రణ ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

iPadOS 15.5లో కొత్త విషయాలు

iPadOS 15.5లో కొత్త విషయాలు

iOS 15.5 మాదిరిగానే ఐప్యాడ్OS 15.5 కొత్త అప్ డేట్ ని కూడా విడుదల చేసింది. ఇది ఆపిల్ పాడ్‌క్యాస్ట్‌ల యాప్‌లలో కలిగి ఉంటుంది. ఇందులో మీ ఐపాడ్ లో స్టోర్ చేయబడిన ఎపిసోడ్‌లను పరిమితం చేయడానికి మరియు ఇప్పటికే ఉన్న వాటిని ఆటొమ్యాటిక్ గా తొలగించడానికి సెట్టింగ్ ఎంపికలు ఉంటాయి. వీటితో పాటుగా తెలిసిన కొన్ని ప్రమాదాలను సరిచేసే సెక్యూరిటీ పరిష్కారాలు కూడా ఉన్నాయి.

iOS 15.5, iPadOS 15.5 డౌన్‌లోడ్ చేసే విధానం

iOS 15.5, iPadOS 15.5 డౌన్‌లోడ్ చేసే విధానం

ఆపిల్ సంస్థ యొక్క ఐఫోన్ మరియు ఐప్యాడ్ కోసం విడుదల చేసిన iOS 15.5, iPadOS 15.5 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను డౌన్‌లోడ్ చేయడం కోసం కింద ఉన్న పద్దతులను అనుసరించండి.

** ముందుగా మీ యొక్క ఐఫోన్ లేదా ఐప్యాడ్ లను ఓపెన్ చేసి అందులో సెట్టింగ్‌లు విభాగంకు వెళ్ళండి.
** తరువాత జనరల్ విభాగంకు వెళ్ళండి
** తరువాత సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ విభాగంకి వెళ్లడం ద్వారా మీ పరికరంలో iOS 15.5 లేదా iPadOS 15.5ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇటీవలి iOS 15 లేదా iPadOS 15 విడుదలలో రన్ అవుతున్న అన్ని పరికరాలకు అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నాయి.

 

Best Mobiles in India

English summary
iOS 15.5, iPadOS 15.5 New Update Released: Here are Download Process Step by Step

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X