ఆపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ ను 6 నెలలు ఉచితంగా పొందవచ్చు!! అయితే??

|

ఆపిల్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ మరియు ఐప్యాడ్ వినియోగదారుల కోసం iOS 15 మరియు iPadOS15 లను విడుదల చేయడం ప్రారంభించింది. ఈ రెండు అప్ డేట్ లు వినియోగదారులకు ఆరు నెలలపాటు ఆపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తున్నాయి. కానీ ప్రతి ఒక్కరూ దానిని పొందడానికి అర్హులు కాదు. ఎంచుకున్న ఉత్పత్తుల యజమానులు మాత్రమే ఈ ఆఫర్ పొందడానికి అర్హులు అవుతారు. ఇంకా ఈ ఆరు నెలల ఉచిత ఆపిల్ మ్యూజిక్ ఆఫర్ ను వినియోగదారులు iOS 15 లేదా iPadOS 15 కి అప్‌డేట్ చేసినప్పుడు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఉచిత సర్వీస్‌ని క్లెయిమ్ చేయడానికి వినియోగదారులు 90 రోజుల సమయం ఉంటుంది. కాబట్టి ఆరు నెలల ఉచిత ఆపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ ను పొందడానికి ఎవరు అర్హులు? వంటి వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ఆపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ ఉచిత ఆఫర్

ఆపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ ఉచిత ఆఫర్

ఆరు నెలల ఆపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా పొందడానికి వినియోగదారులు తప్పనిసరిగా ఆపిల్ విక్రయించే ఆడియో ఉత్పత్తులను కలిగి ఉండాలి. ప్రస్తుత మరియు పాత వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎయిర్‌పాడ్స్ మరియు బీట్స్ యూజర్లు ఈ ఆఫర్‌ను ఆపిల్ ద్వారా అందిస్తున్నట్లు క్లెయిమ్ చేయవచ్చు.

OnePlus Buds Pro అత్యంత సిఫార్సు చేయబడిన బెస్ట్ వైర్లెస్ ఇయర్ బడ్స్OnePlus Buds Pro అత్యంత సిఫార్సు చేయబడిన బెస్ట్ వైర్లెస్ ఇయర్ బడ్స్

ఎయిర్‌పాడ్స్

కొత్త వినియోగదారులు కొత్త ఎయిర్‌పాడ్స్ లేదా బీట్స్ వంటి ఉత్పతులను వారి ఐఫోన్ లేదా ఐప్యాడ్‌తో జత చేసి కొనుగోలు చేసిన తరువాతనే ఈ ఉచిత ఆఫర్ లభిస్తుంది. ఎయిర్‌పాడ్స్, ఎయిర్‌పాడ్స్ ప్రో, ఎయిర్‌పాడ్స్ మాక్స్, పవర్‌బీట్స్ ప్రో, పవర్‌బీట్స్, బీట్స్ స్టూడియో బడ్స్ మరియు బీట్స్ సోలో ప్రో వంటివి కొనుగోలు చేయడంతో వినియోగదారులు ఈ ఆఫర్‌ని సద్వినియోగం చేసుకోవడానికి అర్హత లభిస్తుంది.

ఆపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్
 

మీరు ఆపిల్ నుండి ఈ ఆడియో ఉత్పత్తులలో ఒకదానికి యజమాని అయితే మరియు ఐఫోన్ లేదా ఐప్యాడ్ కూడా కలిగి ఉంటే, ఆరు నెలల ఉచిత ఆపిల్ మ్యూజిక్ కోసం మీ ఆఫర్‌ను క్లెయిమ్ చేయడానికి సాధ్యమైనంత వేగంగా iOS 15 కి అప్‌గ్రేడ్ చేయండి. కానీ మీరు ఇప్పటికే ఆపిల్ మ్యూజిక్‌కు సబ్‌స్క్రైబ్ అయి ఉంటే ఇది మీకు పని చేయదని కూడా గమనించండి. ఆపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ కొత్త వినియోగదారులకు మాత్రమే అందించబడుతుంది. ఉత్పత్తుల విషయానికొస్తే కొత్తవి లేదా పాతవి అనే తేడా లేకుండా వారు ఆఫర్‌ను స్వీకరించడానికి అర్హులు. కాబట్టి మీరు ఆపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ని కొనుగోలు చేయకపోతే ఇది ఎలా అనిపిస్తుందో అన్వేషించడానికి మరియు అనుభవించడానికి మీకు ఇది ఒక అవకాశం.

Most Read Articles
Best Mobiles in India

English summary
iOS 15, iPadOS 15 New Update Comes With 6 Months Free Apple Music Subscription

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X