iOS 16 వ‌ర్ష‌న్‌లో రాబోయే కొత్త ఫీచ‌ర్లు ఇవే.. మార్పుల‌పై మీరూ ఓ లుక్కేయండి!

|

Apple కంపెనీ జూన్‌లో నిర్వ‌హించిన‌ WWDC22 ఈవెంట్‌లో ఐఫోన్‌ల కోసం iOS 16 సాఫ్ట్‌వేర్ తాజా వెర్షన్‌ను పరిచయం చేసిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత ఈ నెల ప్రారంభంలో కంపెనీ తొలి ప‌బ్లిక్ బీటా వ‌ర్ష‌న్‌ను విడుద‌ల చేసింది. ఇప్పుడు, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న డెవ‌ల‌పర్లు, బీటా టెస్టర్‌ల కోసం iOS 16 బీటా 4 వెర్షన్‌ను ప్రారంభించింది.

iOS 16 Beta 4 Versio

తాజా iOS 16 బీటా 4 వెర్షన్.. లాక్ స్క్రీన్, iMessage, లైవ్ యాక్టివిటీస్ API, హోమ్ యాప్, మెయిల్ యాప్, లాక్ స్క్రీన్ నోటిఫికేషన్‌ సెట్టింగ్ యాప్‌ల‌కు కొత్త ఫీచర్‌లను అందిస్తుంది. ఇప్పుడు ఆ యాప్‌ల‌కు iOS 16 beta 4వ‌ర్ష‌న్ అందిస్తున్న మార్పులు, ఫీచ‌ర్ల గురించి వివ‌రంగా తెలుసుకుందాం.

iMessage లో మార్పులు, మెయిల్స్ యాప్‌లో అప్‌డేట్స్‌:
* iOS 16 బీటా 4 వెర్షన్‌లోని iMessage యాప్ లో ప‌లు మార్పుల‌ను అందిస్తున్నారు. ఈ యాప్‌లో ఒక‌సారి మీరు ఇత‌రుల‌కు మెసేజ్ పంపిన త‌ర్వాత దాన్ని ఎడిట్ చేసే ఆప్ష‌న్‌ను క‌ల్పిస్తున్నారు. అంతేకాకుండా, మీకు ఆ మెసేజ్‌ను డిలీట్ చేసే వెసులుబాటును కూడా క‌ల్పిస్తున్నారు. మెసేజ్ కింద భాగం ఎడిట్ ఆప్ష‌న్ ఉంటుంది.. దాని ద్వారా యూజ‌ర్లు 5 సార్లు ఎడిట్ చేయ‌డానికి అవ‌కాశం ఉంటుంది. ఐదు సార్లు ఎడిట్ చేయ‌డం పూర్తి అయిన త‌ర్వాత ఎడిట్ ఆప్ష‌న్ డిస‌ప్పియ‌ర్ అవుతుంది.

* మెయిల్ యాప్‌లో ఇదువ‌ర‌కు ఒక‌సారి మెసేజ్ పంపిన త‌ర్వాత దాన్ని అన్‌సెండ్ చేయాల‌నుకుంటే.. 10 సెక‌న్ల స‌మ‌యం ఉండేది. అది కాస్తా ఇప్పుడు iOS 16 బీటా 4 వెర్షన్ యూజ‌ర్ల‌కు 30 సెక‌న్ల వ‌ర‌కు ప‌రిమితి ల‌భిస్తుంది. ఈ విభాగంలో ఇంక ఇత‌ర మార్పులు తీసుకురాలేదు.

iOS 16 Beta 4 Versio

లాక్ స్క్రీన్ నోటిఫికేష‌న్‌, హోం యాప్ లో మార్పులు:
iOS 16 యొక్క బీటా 4 వెర్షన్ ఇప్పుడు హోమ్ యాప్‌లో కొత్త వాల్ పేప‌ర్‌ల‌ను ఆఫ‌ర్ చేస్తుంది. లాక్ స్క్రీన్ లే అవుట్ విషయానికొస్తే, ఇప్పుడు విభిన్నమైన‌ డిస్‌ప్లే డిజైన్‌ల‌లో భాగంగా కౌంట్, స్టాక్ మరియు లిస్ట్‌తో సహా మూడు ఆప్ష‌న్‌ల‌ను ఆఫ‌ర్ చేస్తుంది. అదనంగా, లాక్ స్క్రీన్ లో కొత్త రంగులు, గ్రేడియంట్లు, ఫోటోలు మరియు మరిన్నింటిని మార్చడానికి ప‌లు ఆప్ష‌న్ల‌తో వ‌స్తోంది.

లైవ్ యాక్టివిటీస్ ఏపీఐ లో మార్పులు:
Apple తన లైవ్ యాక్టివిటీస్ APIకి మార్పులు చేసింది. వివిధ యాప్‌ల నుండి లాక్ స్క్రీన్‌పై రియల్ టైమ్ గ్లాన్సబుల్ వివరాలను యూజ‌ర్లు చూసుకోవ‌చ్చు. iOS 16 వినియోగదారులను ఏదైనా యాప్ నుండి లైవ్ యాక్టివిటీని ప్రారంభించడానికి అనుమతిస్తుంది, ఇది యాక్టివిటీ కొనసాగుతున్నంత వ‌ర‌కు వారి లాక్ స్క్రీన్‌లో అప్‌డేట్ చేయబడుతుంది.

బోల్డ‌ర్ మ్యూజిక్ ప్లేయ‌ర్‌, కార్ ప్లే కోసం న్యూ వాల్ పేప‌ర్స్:
లాక్ స్క్రీన్‌పై క‌నిపించే మ్యూజిక్ ప్లేయ‌ర్‌ను బోల్డ‌ర్ ఎలిమెంట్స్‌తో యాపిల్ అప్‌డేట్ చేసింది. అంతేకాకుండా, కార్ ప్లే కోసం కొత్త వాల్ పేప‌ర్ల‌ను ఆఫ‌ర్ చేసింది. పైన పేర్కొన్న అప్‌డేట్‌లు కాకుండా, వినియోగదారులు iOS యొక్క తాజా వెర్షన్‌తో వివిధ బగ్ పరిష్కారాలు మరియు మెరుగైన ప‌నితీరును కూడా ఆశించ‌వ‌చ్చు.

iOS 16 Beta 4 Versio

iOS 16 డెవలపర్ బీటా 4 వెర్షన్ యొక్క పరిమాణం(సైజ్‌) దాదాపు 1.53GB ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ విభాగాల‌ వినియోగదారులకు క్రమంగా విడుదల చేయబడుతోంది. iOS 16 వెర్షన్ యొక్క స్థిరమైన(స్టేబుల్) వెర్షన్‌ను ఆపిల్ కంపెనీ సెప్టెంబర్‌లో విడుదల చేస్తుందని అంతా భావిస్తున్నారు. యాపిల్ కంపెనీ నుంచి iPhone 14 సిరీస్ కూడా సెప్టెంబ‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు కంపెనీ ఇదువ‌ర‌కే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

iPhone 14 విడుద‌ల‌లో జాప్యం జ‌రుగుతుందా!
ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్ల ఉత్ప‌త్తిలో యాపిల్ కంపెనీ కెమెరా లెన్స్ స‌ర‌ఫ‌రాలో స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొంటున్న‌ట్లు స‌మాచారం. సెప్టెంబ‌ర్‌లో ఆ స్మార్ట్‌ఫోన్‌ విడుద‌ల చేయాల్సి ఉండ‌గా.. ఉత్ప‌త్తిలో భాగంగా కంపెనీ కొన్ని స‌ర‌ఫ‌రా స‌మ‌స్య‌లను ఎందుర్కొంటున్న‌ట్లు తెలుస్తోంది. iPhone 14 స్మార్ట్‌ఫోన్ల ఉత్ప‌త్తికి కావాల్సిన కెమెరాల లెన్స్ సంబంధించిన స‌ర‌ఫ‌రా స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు చైనాకు చెందిన ప్ర‌ముఖ Apple విశ్లేష‌కుడు మింగ్ కువో వెల్ల‌డించారు.

iOS 16 Beta 4 Versio

iPhone 14 ఉత్ప‌త్తిలో కెమెరా లెన్స్ కొర‌త‌:
ప్ర‌ముఖ విశ్లేష‌కుడు మింగ్ కువో వెల్ల‌డించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. Apple కంపెనీ ఇదువ‌ర‌కే క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా లాక్‌డౌన్‌తో గ‌తంలో స‌ప్లై చైన్ లో కొర‌త స‌మ‌స్య‌ను ఎదుర్కొంది. కాబ‌ట్టి ఈసారి అటువంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కోకుండా ఉండాల‌ని.. iPhone 14 విడుద‌లలో జాప్యం జ‌ర‌గ‌కుండా చేసేందుకు భారీ ఉత్ప‌త్తిలో భాగంగా స‌ర‌ఫ‌రా విభాగాల‌ను కూడా మెరుగుప‌రిచింది. కానీ, ఈ సారి యాపిల్‌కు కెమెరా లెన్స్ స‌ర‌ఫరా చేసే జీనియ‌స్‌, iPhone 14 కెమెరా లెన్స్‌లో క్వాలిటీ స‌మ‌స్య‌ను ఎదుర్కొంది. ఈ ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌కు సంబంధించిన విష‌యాల‌ను కువో ట్విట‌ర్ వేదిక‌గా అప్‌డేట్ చేశారు. జీనియస్ iPhone 14 బ్యాక్ కెమెరా లెన్స్‌ల విష‌యంలో కోటింగ్-క్రాక్ క్వాలిటీ స‌మ‌స్య‌లు ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

లాంచ్ విష‌యంలో జాప్యం ఉండ‌దు..
దీంతో, Apple మ‌రో కెమెరా లెన్స్ స‌ర‌ఫ‌రా విభాగం అయిన లార్గాన్‌కు 10 మిలియ‌న్ కెమెరా లెన్స్‌ల ఆర్డర్‌ను చేసింది. అదృష్ట‌వ‌శాత్తూ ఈ తైవానీస్ కంపెనీ స‌ప్లై చైన్‌లో ఏర్ప‌డిన ఈ అంత‌రాయాన్ని వీలైనంత త్వ‌ర‌గా క్లియ‌ర్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో iPhone 14 విడుద‌ల విష‌యంలో యాపిల్‌కు ఎలాంటి జాప్యం జ‌ర‌గ‌బోద‌ని స్ప‌ష్టం అయింది. ఇదిలా ఉండ‌గా.. జీనియ‌స్ కంపెనీ కెమెరా లెన్స్‌ల క్వాలిటీ స‌మ‌స్య‌ల‌పై స్పందించాల్సి ఉంద‌ని కువో పేర్కొన్నారు.

ఒక‌వేళ జీనియ‌స్ కంపెనీ iPhone 14 బ్యాక్ కెమెరా లెన్స్ సంబంధించిన స‌మ‌స్య‌ను పరిష్కరించకపోతే.. లార్గాన్ కంపెనీ ఆపిల్ నుండి మరింత భారీ ఆర్డర్‌ను పొందే అవకాశం ఉంది. ఐఫోన్ 14 సిరీస్ సరఫరా సమస్యలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. గ‌తంలో కూడా, ఐఫోన్ 14 డిస్‌ప్లే మరియు ర్యామ్‌కి సరఫరా ఆలస్యాన్ని కూడా కువో పేర్కొన్న విష‌యం తెలిసిందే.

Best Mobiles in India

English summary
iOS 16 Beta 4 Version Released; Here’s What’s New For Lock Screen, iMessage & More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X