iPhone యూజ‌ర్లు అవాక్క‌య్యేలా iOS 16 బీటాలో స‌రికొత్త ఫీచ‌ర్‌!

|

Apple కంపెనీ తాజా iOS 16 బీటా 5 అప్‌డేట్‌తో ఒక ప్రముఖ ఫీచర్‌ని యూజ‌ర్లకు ప‌రిచ‌యం చేసింది. మీరు ఐఫోన్ 13 లేదా, ఐఫోన్ 12 యూజ‌ర్ అయితే ఆ ఫీచ‌ర్‌ను ఎక్స్‌పీరియ‌న్స్ చేయ‌వ‌చ్చు.

 
iPhone యూజ‌ర్లు అవాక్క‌య్యేలా iOS 16 బీటాలో స‌రికొత్త ఫీచ‌ర్‌!

అస‌లు ఆ ఫీచ‌ర్ ఏంటంటే.. చాలా సంవత్సరాల తర్వాత, యాపిల్ ఎట్టకేలకు బ్యాటరీ శాతాన్ని బ్యాటరీ ఐకాన్‌లోనే చూపించే స‌దుపాయాన్ని ఎట్ట‌కేల‌కు తీసుకువ‌చ్చింది. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం పెద్ద స్క్రీన్ క‌లిగిన ఐఫోన్‌లకు మాత్రమే పరిమితం చేయబ‌డిన‌ట్లు తెలుస్తోంది.

బ్యాట‌రీ శాతాన్ని చూడొచ్చు!

బ్యాట‌రీ శాతాన్ని చూడొచ్చు!

iOS 16 బీటా 5 అప్‌డేట్‌తో, వినియోగదారులు ఇప్పుడు సెట్టింగ్స్‌లోని మెనూ సెక్ష‌న్‌ నుండి బ్యాటరీ శాతాన్ని చూపించే ఫీచ‌ర్‌ను ప్రారంభించగలరు. ప్రస్తుతానికి, ఈ ఫీచర్ iPhone 12, iPhone 12 Pro, iPhone 12 Pro Max, iPhone 13, iPhone 13 Pro మరియు iPhone 13 Pro Max వంటి అర్హత కలిగిన iPhone మోడల్‌లకు అందుబాటులో ఉంది. కానీ, అదే హార్డ్‌వేర్ చిన్న స్క్రీన్ క‌లిగిన ఐఫోన్ 12 మినీ మరియు ఐఫోన్ 13 మినీ వంటి ఐఫోన్ మోడల్‌లు ఈ ఫీచర్‌ను పొంద‌డం లేదు. భవిష్యత్తులో iOS 16 వెర్షన్‌లో Apple దీన్ని ప్రారంభిస్తుందా? లేదా అనే విష‌యాన్ని మిశ్ర‌మ స్పంద‌న‌లు వినిపిస్తున్నాయి.

iOS 16 లో ఉండే ఫీచ‌ర్లు:

iOS 16 లో ఉండే ఫీచ‌ర్లు:

Apple కంపెనీ iOS 16 తో అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా యూజ‌ర్లు క‌స్ట‌మైజ్‌డ్‌ లాక్ స్క్రీన్ ను పొంద‌డానికి అవ‌కాశం ఉంటుంది. త‌ద్వారా, వినియోగదారులు థ‌ర్డ్ పార్టీ, ఫ‌స్ట్ పార్టీ విడ్జెట్‌లను నేరుగా లాక్ స్క్రీన్‌పై ఉంచడానికి అనుమతిస్తుంది. అదేవిధంగా, ఇది డైనమిక్ వాల్‌పేపర్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఇలా అనేక ఫీచ‌ర్లు అందుబాటులోకి రానున్నాయి. దాంతో పాటుగా ఐమెసేజెస్ ఉప‌యోగించే iOS 16 యూజ‌ర్లు నిర్దిష్ట స‌మ‌యంలో ఒక‌సారి సెండ్ చేసిన మెసేజెస్‌ను అన్‌సెండ్ లేదా ఎడిట్ చేసే సౌక‌ర్యం వ‌స్తుంది.

ఐఫోన్‌లో బ్యాట‌రీ శాతాన్ని చూపించే ఫీచ‌ర్ ను ఎనేబుల్ చేయ‌డం ఎలా:
 

ఐఫోన్‌లో బ్యాట‌రీ శాతాన్ని చూపించే ఫీచ‌ర్ ను ఎనేబుల్ చేయ‌డం ఎలా:

ప్రస్తుతానికి, ఈ ఫీచర్ iOS 16 యొక్క 5వ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది.
* ఈ ఫీచ‌ర్‌ను అప్‌డేట్ చేసుకోవాల‌నుకునే ఐఫోన్ యూజ‌ర్లు ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
* ఆ త‌ర్వాత బ్యాట‌రీ సెక్ష‌న్‌ను ఎంపిక చేసుకోవాలి. అనంత‌రం బ్యాట‌రీ ప‌ర్సెంటేజ్ ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకోవాలి.

ఏదేమైన‌ప్ప‌టికీ, iOS 16 బీటాను ఇన్‌స్టాల్ చేసుకోవాల‌ని మేము ఎవరికీ సూచించము, ఎందుకంటే ఇది స్మార్ట్‌ఫోన్ కార్యాచరణకు అంతరాయం కలిగించే అనేక బగ్‌లను కలిగి ఉంది. మీరు నాన్-ప్రైమరీగా భావించే డివైజ్‌లో మాత్ర‌మే iOS 16 బీటా 5ని ఇన్‌స్టాల్ చేయండి.

iPhone 14 విడుదల ఎప్పుడంటే!

iPhone 14 విడుదల ఎప్పుడంటే!

Apple కంపెనీ నుంచి iPhone 14 సిరీస్‌ విడుద‌ల కోసం టెక్ ప్రియులు ఎంతో ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు. అయితే, iPhone 14 విడుద‌ల కాస్త ఆల‌స్యం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఇప్ప‌టికే ప‌లు నివేదిక‌లు చెబుతుండ‌గా.. తాజాగా మ్యాక్స్ విన్‌బ్యాక్ అనే మ‌రో నివేదిక ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించింది. రాబోయే యాపిల్ ఉత్ప‌త్తులు అంచ‌నా గ‌డువు కంటే ముందే విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌ని ఆ నివేదిక‌ పేర్కొంది. Apple వాచ్ సిరీస్ 8 మరియు 10వ జెన‌రేష‌న్‌ ఐప్యాడ్‌తో పాటు iPhone14 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను సెప్టెంబర్ 6వ తేదీన ఆపిల్ విడుదల చేయనున్న‌ట్లు పేర్కొంది.

చైనా-తైవాన్-యుఎస్ మధ్య ఉద్రిక్తత కారణంగా iPhone 14 సిరీస్ మొబైల్స్ లాంచ్ ఆలస్యం కావచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. మ‌రోవైపు, భార‌త్‌లో iPhone 14, iPhone 14 మాక్స్ వంటి వివిధ ఆపిల్ iPhone 14 మోడల్‌ల స్థిరమైన లభ్యతను నిర్ధారించడానికి ఆ కంపెనీ దేశీయంగా ఉత్పత్తిని పెంచాలని యోచిస్తోందని కూడా నివేదిక‌లో చెప్పబడింది.

iPhone 14 సెప్టెంబర్ 16న అమ్మకానికి రానుంది!

iPhone 14 సెప్టెంబర్ 16న అమ్మకానికి రానుంది!

Apple ఒక‌వేళ అధికారికంగా iPhone 14 సిరీస్‌ను సెప్టెంబర్ 6వ తేదీన లాంచ్ చేస్తే, అధికారికంగా ప్రారంభించిన 10 రోజుల తర్వాత స్మార్ట్‌ఫోన్‌లు సెప్టెంబర్ 16 నుండి భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా విక్రయించబడతాయని తెలుస్తోంది. iPhone 14 సిరీస్‌తో పాటు, Apple Watch Series 8 మరియు 10th Gen Apple iPad వంటి పరికరాలు కూడా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.

ధ‌ర‌లు ఎలా ఉండ‌బోతున్నాయి!

ధ‌ర‌లు ఎలా ఉండ‌బోతున్నాయి!

ఇటీవలి ఊహాగానాల ప్రకారం, iPhone 14 ధర iPhone 13 మాదిరిగానే ఉంటుందని అంచనా వేయబడింది. కంపెనీ ఇప్పుడు iPhone 14ని భారతదేశంలో తయారు చేస్తున్నందున, ఐఫోన్ 13 లాంచ్ ధరతో పోల్చినప్పుడు.. iPhone 14 ను కొంచెం తక్కువ ధరకు లాంచ్ చేయవచ్చు అని అంతా భావిస్తున్నారు.

 

Best Mobiles in India

English summary
iOS 16 Beta 5 Update Made iPhone Users Go Crazy

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X