Home
News

iOS 18 లో సూపర్‌ ఛార్జింగ్ ఫీచర్‌... స్లో ఛార్జింగ్‌ సమయంలో యూజర్‌ను అప్రమత్తం చేస్తుంది..!!

ఆపిల్‌ WWDC 2024 ఈవెంట్‌లో iOS 18 ను ఆవిష్కరించింది. ఇందులో అనేక ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు ఐఫోన్ బ్యాటరీని పనితీరును మెరుగుపరిచే విధంగా మరియు ఛార్జింగ్‌ సెట్టింగ్స్‌ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐఫోన్ 15 సిరీస్‌ ఈ తరహా సెట్టింగ్స్‌ను కలిగి ఉంది. దీంతోపాటు స్లో ఛార్జర్‌ను వినియోగించినా వినియోగదారుడికి సమాచారం అందిస్తుంది. బ్యాటరీ పనితీరును మెరుగుపరిచే iOS 18 ఫీచర్‌.. కేవలం ఐఫోన్‌ 15 సిరీస్‌ మరియు అంతేకంటే తర్వాత సిరీస్‌లు మాత్రమే ఈ ఫీచర్‌ను అందుబాటులో ఉంటుందని తెలిసింది.

iOS 18 లో బ్యాటరీ టెక్నాలజీ :
ప్రస్తుతం ఐఫోన్ 15 సిరీస్‌లో ఛార్జింగ్‌పై పరిమితి విధించేందుకు మరియు బ్యాటరీ పనితీరును మెరుగుపరిచేందుకు అనేక ఆప్షన్‌లు ఉన్నాయి. అయితే 80 శాతం వరకు మాత్రమే ఛార్జింగ్‌ పరిమితులు విధించే అవకాశం ఉంది. అదే మరింత మెరుగైన ఆప్షన్‌లను కలిగి ఉంది. ఛార్జింగ్‌ను 85 శాతం, 90 శాతం, 95 శాతం వద్ద పరిమితిని విధించుకొనే అవకాశం ఉంది.

iOS 18 will improve battery options

దీంతోపాటు iOS 18 గత OS వెర్షన్‌ల కంటే మెరుగ్గా పనిచేస్తుంది. ఐఫోన్ యూజర్‌లు స్లో ఛార్జర్‌లను వినియోగిస్తున్న సమయంలో వారిని అప్రమత్తం చేస్తుంది. బ్యాటరీ మెనూలోని సెట్టింగ్స్‌ వద్ద ఈ ఫీచర్‌ను గుర్తించవచ్చు. గ్రాఫ్‌లో స్లో ఛార్జర్‌ వినియోగం గురించి తెలియజేస్తుంది. దీనిపై iOS 18 పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన సమయంలో మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఐఫోన్‌ 15 స్మార్ట్‌ఫోన్లు బ్యాటరీ లైఫ్‌ ఎక్కువ కాలం వచ్చే విధంగా ఈ ఫోన్లలో అద్భుతమైన ఫీచర్‌ ఉంది. ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్లు 80 శాతానికి మించి ఛార్జింగ్‌ కాకుండా నిరోధించే వ్యవస్థ కలిగి ఉంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసినప్పుడు 80 శాతం వద్ద ఛార్జింగ్‌ నిలిచిపోతుంది. ఫలితంగా బ్యాటరీ జీవిత కాలం మెరుగుపడుతుంది.

ఇప్పటికే ఆపిల్‌... ఆప్టిమైజ్‌ బ్యాటరీ ఛార్జింగ్‌ అనే సెట్టింగ్స్‌ ను కలిగి ఉంటుంది. ఇది బ్యాటరీని 80 శాతం వరకే ఛార్జింగ్‌ అయ్యేలా చూస్తుంది. ఐఫోన్‌ 15 లో ఈ ఫీచర్‌ కొంచెం భిన్నంగా ఉంది. ఐఫోన్‌ 15 సిరీస్‌లోని సెట్టింగ్‌ ల కింద బ్యాటరీ, బ్యాటరీ ఆరోగ్యం, ఛార్జింగ్‌, ఛార్జింగ్‌ ఆప్టిమైజేషన్‌ అనే మరో ఆప్షన్లు ఉంటాయి. ఇటీవల ఆవిష్కరించిన iOS 18 లో దీని కంటే మరింత స్మార్ట్‌ ఫీచర్‌ను కలిగి ఉంది.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్ల కు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
iOS 18 features enhanced battery options to improved battery life here are the details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X