Home
News

ఆపిల్‌ Its Glowtime ఈవెంట్‌.. ఆపిల్ ఇంటెలిజెన్స్‌ సహా కొత్త OS వెర్షన్‌లు ఎప్పుడు విడుదల కానున్నాయి?

ప్రముఖ టెక్‌ దిగ్గజం ఆపిల్ నిన్న (సెప్టెంబర్ 9) its Glowtime ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో ఐఫోన్‌ 16 సిరీస్‌, ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ 10, ఎయిర్‌పాడ్స్‌ 4 విడుదల అయ్యాయి. ముందస్తు బుకింగ్‌, సేల్‌ వివరాలు కూడా ఆపిల్‌ వెల్లడించింది. వీటితోపాటు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లకు సంబంధించిన వివరాలను కూడా ఆపిల్‌ విడుదల చేసింది. ఆపిల్‌ ఈవెంట్‌లో ప్రకటన ఆధారంగా iOS 18, macOS 18, watchOS 11 మరియు iPadOS 18 వెర్షన్‌లు సెప్టెంబర్‌ 16 నుంచే అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

iOS 18 వెర్షన్‌కు అప్‌గ్రేడ్‌ కావడం ద్వారా ఐఫోన్ 16 మోడళ్లు, ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ సపోర్టును పొందనున్నాయి. వీటితోపాటు iPads మరియు మ్యాక్స్‌బుక్‌లు కూడా కొత్త OS వెర్షన్‌కు అప్‌గ్రేడ్‌ కావడం ద్వారా ఆపిల్ ఇంటెలిజెన్స్‌ సపోర్టును పొందవచ్చు. ప్రస్తుతం ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ బీటా వెర్షన్‌లో ఉంది. వచ్చే సంవత్సరం నాటికి పూర్తిస్థాయిలో వినియోగదారులు అందరికీ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.

iOS 18  WatchOS 11  macOS 15 rollout timeline

ప్రస్తుతం ఆపిల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌ల బీటా వెర్షన్‌లు iOS 18.1, iPadOS 18.1 మరియు macOS 15.1 టెస్టింగ్‌ దశలో ఉంది. పూర్తి స్థాయి వెర్షన్‌ వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ అధికారికంగా అందుబాటులోకి వచ్చాక.. కొన్ని స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే సపోర్టు చేయనుంది. ఐఫోన్ 15 ప్రో మోడళ్లు సహా ఐఫోన్‌ 16 మరియు ఐఫోన్ 16 ప్రో మోడళ్లు, M1, M2 లేదా M4 చిప్‌సెట్‌లు కలిగిన ఐప్యాడ్‌లు ఈ ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌ను సపోర్టు చేయనుంది.

ఆపిల్‌ ఇంటెలిజెన్స్ ద్వారా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఫీచర్‌లు ఆయా స్మార్ట్‌ఫోన్‌లకు అందుబాటులోకి రానున్నాయి. మెయిల్‌, నోట్స్‌, పేజీలల్లో అర్థవంతమైన విధంగా ఈ ఫీచర్లు ఉపయోగపడనున్నాయి. ప్రూఫ్‌ రీడ్‌ సహా ఇతర అవసరాలకు ఈ టూల్స్‌ను ఉపయోగించుకోవచ్చు. వాక్యాల్లో తప్పులను కూడా సరిదిద్దవచ్చు. దీంతోపాటు Priority Messages Feature ద్వారా ఈమెయిల్‌ మేనేజ్‌మెంట్‌ కూడా అప్‌గ్రేడ్‌ అయింది.

iOS 18  WatchOS 11  macOS 15 rollout timeline

ఈ ఫీచర్‌తో ముఖ్యమైన ఈమెయిల్‌లకు వేగంగా స్పందించేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఈమెయిల్‌లను సాధారణ వినియోగదారునికి అర్థమయ్యే విధంగా క్లుప్తంగా మారుస్తుంది. నోటిఫికేషన్‌ విధానంలోనూ మార్పులు చేస్తుంది. దీంతోపాటు ఫోన్‌ కాల్స్‌ సమయంలో వాటిని రికార్డు చేసి Text రూపంలోకి మారుస్తుంది. ఫలితంగా ఫోన్‌ కాల్‌లోని ముఖ్యమైన అంశాలను గుర్తుపెట్టుకొనేందుకు అవకాశం ఉంటుంది.

ఆపిల్ Its Glowtime ఈవెంట్‌లో ఐఫోన్ 16, ఐఫోన్‌ 16 ప్లస్‌, ఐఫోన్‌ 16 ప్రో, ఐఫోన్‌ 16 మ్యాక్స్ మోడళ్లు సహా ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ 10, ఎయిర్‌పాడ్స్‌ 4 ఉత్పత్తులను విడుదల చేసింది. ఐఫోన్‌ల సేల్‌ సెప్టెంబర్‌ 20 నుంచి ప్రారంభం కానుంది. మరియు ఆపిల్‌ ఉత్పత్తుల ముందస్తు బుకింగ్‌ తేదీలను కూడా వెల్లడించింది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
iOS 18, WatchOS 11, macOS rollout timeline announced in its glowtime event
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X