ఐఓఎస్‌9 ఫీచర్లు ఆండ్రాయిడ్‌లో ఉన్నవే!

Posted By:

యాపిల్ తన తరువాతి వర్షన్ మొబల్ ఆపరేటింగ్ సిస్టం ఐఓఎస్ 6కు సంబంధించిన కీలక వివరాలను వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫిరెన్స్ (డబ్ల్యూడబ్ల్యూడీసీ)లో భాగంగా వెల్లడించింది. అయితే, తన కొత్త ఓఎస్‌కు సంబంధించి యాపిల్ పరిచయం చేసిన కొత్త ఫీచర్లు గత కొంత కాలంగా ఆండ్రాయిడ్ డివైజ్‌లలో అందుబాటులో ఉన్నవే కావటం విశేషం..

(చదవండి: ప్రపంచపు మొట్టమొదటి బైక్ ఎస్కలేటర్)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రోయాక్టివ్ అసిస్టెంట్

ఐఓఎస్‌9 ఫీచర్లు ఆండ్రాయిడ్‌లో ఉన్నవే!


ప్రోయాక్టివ్ అసిస్టెంట్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను యాపిల్ ఐఓఎస్ 9 ద్వారా అందిస్తోంది. అయితే, ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ గూగుల్ నౌ అసిస్టెంట్ ఈ ఫీచర్‌ను ఆఫర్ చేస్తోంది.

 

లో పవర్ మోడ్

ఐఓఎస్‌9 ఫీచర్లు ఆండ్రాయిడ్‌లో ఉన్నవే!

లో పవర్ మోడ్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను యాపిల్ ఐఓఎస్ 9 ద్వారా అందిస్తోంది. ఈ ఫీచర్ ఐఫోన్ బ్యాటరీ బ్యాకప్ ను మూడు గంటల పాటు పెంచగలదు. అయితే, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఈ తరహా ఫీచర్‌ను ఇప్పటికే స్టాక్ ఆండ్రాయిడ్ డివైస్ లకు అందిస్తోంది.

 

స్ఫ్లిట్ వ్యూ

ఐఓఎస్‌9 ఫీచర్లు ఆండ్రాయిడ్‌లో ఉన్నవే!

స్ఫ్లిట్ వ్యూ పేరుతో సరికొత్త ఫీచర్‌ను యాపిల్ ఐఓఎస్ 9 ద్వారా అందిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా స్ర్కీన్ పై ఏకకాలంలో రెండు అప్లికేషన్‌లను సైడ్ బై సైడ్ రన్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఇప్పటికే సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ అలానే సామ్‌సంగ్ ఫోన్‌లలో అందుబాటులో ఉంది. విండోస్ - 8 డివైస్‌లు సైతం ఈ తరహా ఫీచర్‌ను సపోర్ట్ చేస్తున్నాయి.

 

పిక్షర్ ఇన్ పిక్షర్

ఐఓఎస్‌9 ఫీచర్లు ఆండ్రాయిడ్‌లో ఉన్నవే!

పిక్షర్ ఇన్ పిక్షర్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను యాపిల్ ఐఓఎస్ 9 ద్వారా అందిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ఫోన్ పై ఇతర అప్లికేషన్ లను రన్ చేస్తున్నప్పటికి చిన్న విండోలో వీడియోలు రన్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ తరహా ఫీచర్ ను సామ్ సంగ్ పాప్-అప్-ప్లే పేరుతో అందిస్తోంది.

 

న్యూస్ యాప్

ఐఓఎస్‌9 ఫీచర్లు ఆండ్రాయిడ్‌లో ఉన్నవే!

న్యూస్ యాప్

న్యూస్ యాప్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను యాపిల్ ఐఓఎస్ 9 ద్వారా అందిస్తోంది. ఈ తరహా ఫీచర్‌ను గూగుల్ ఇప్పటికే న్యూస్ స్టాండ్ పేరుతో గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచింది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
iOS 9 features already available on Android. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting