IOS యూజర్స్ నెట్‌ఫ్లిక్స్‌లో స్పటికల్ ఆడియోను ప్రారంభించడం ఎలా??

|

గ్లోబల్ స్ట్రీమింగ్ సర్వీస్ నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే iOS వినియోగదారుల కోసం తమ యాప్‌లో స్పటికల్ ఆడియో సపోర్ట్‌ను పరిచయం చేయబోతోంది. IOS లేదా iPadOS 14.6 రన్ అవుతున్న ఐఫోన్ మరియు ఐప్యాడ్ వినియోగదారులందరికీ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానున్నది. ప్రస్తుతానికి నెట్‌ఫ్లిక్స్ ఎయిర్‌పాడ్స్ ప్రో లేదా ఎయిర్‌పాడ్స్ మాక్స్ ద్వారా స్పటికల్ ఆడియోకు మద్దతును ఇస్తుంది. యాపిల్ మ్యూజిక్ మరియు యాపిల్ టీవీ వంటి ఇతర స్పటికల్ ఆడియో-అనుకూల యాప్‌ల వలె కాకుండా విస్తృత శ్రేణి ప్లేబ్యాక్ పరికరాలకు కూడా మద్దతును ఇస్తుంది. అమెరికన్ టెక్ దిగ్గజం భవిష్యత్తులో Mac మరియు Apple TV పరికరాలకు స్పటికల్ ఆడియో మద్దతును కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.

iOS Users How to Watch Netflix With Spatial Audio

ఏదేమైనా ఆపిల్ వినియోగదారులు iOS అప్‌డేట్ కోసం వేచి ఉండడం వలన వచ్చే నెలాఖరులోగా వినియోగదారులు స్పటికల్ ఆడియోని ఉపయోగించి నెట్‌ఫ్లిక్స్‌లో కంటెంట్‌ను ప్రసారం చేయడానికి అనుమతి లభిస్తుంది. మీ ఎయిర్‌పాడ్స్ ప్రో లేదా ఎయిర్‌పాడ్స్ మాక్స్ ద్వారా ఐఫోన్ మరియు ఐప్యాడ్‌లో 5.1 లేదా డాల్బీ అట్మోస్ సరౌండ్ సౌండ్‌తో నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌ను చూడటానికి ఈ దశలను అనుసరించండి:

స్టెప్ 1: మీ AirPods Pro లేదా AirPods Max ని మీ iPhone లేదా iPad కి కనెక్ట్ చేయండి.

స్టెప్ 2: మీ ఆపిల్ డివైస్ లో నెట్‌ఫ్లిక్స్ అప్లికేషన్‌ను ఓపెన్ చేసి 5.1 సరౌండ్ లేదా డాల్బీ అట్మోస్ వంటి సరౌండ్ సౌండ్ మిక్సింగ్‌తో కంటెంట్‌ను కనుగొనండి.

స్టెప్ 3: మీ డివైస్ స్క్రీన్ కుడివైపు ఎగువ మూలలో క్రిందికి స్వైప్ చేయడం ద్వారా కంట్రోల్ పానెల్ విభాగాన్ని ఓపెన్ చేయండి.

స్టెప్ 4: ఆడియో ఎంపికలను ఓపెన్ చేయడానికి వాల్యూమ్ స్లయిడర్‌ను ఎక్కువసేపు నొక్కండి.

స్టెప్ 5: మీ స్క్రీన్‌పై ఆడియో ఎంపికలు ఓపెన్ అయినప్పుడు ఫీచర్‌ను ప్రారంభించడానికి స్పటికల్ ఆడియో చిహ్నం మీద నొక్కండి.

iOS Users How to Watch Netflix With Spatial Audio

మీరు iOS/iPadOS సెట్టింగ్‌ల యాప్‌లోని స్పటికల్ ఆడియోని సెట్టింగ్‌ల ఎంపికను యాక్సెస్ చేయడం ద్వారా మరియు బ్లూటూత్ విభాగానికి వెళ్లడం ద్వారా టోగుల్ చేయవచ్చు. మీరు ఈ విభాగానికి చేరుకున్న తర్వాత బ్లూటూత్ జాబితాలో డివైస్ పేరు పక్కన ఉన్న "i" చిహ్నాన్ని నొక్కండి. ఆపై క్రిందికి స్క్రోల్ చేయండి మరియు "స్పటికల్ ఆడియో" స్లయిడర్‌పై నొక్కండి.

iOS Users How to Watch Netflix With Spatial Audio

అయితే మీ ఆపిల్ పరికరంలో ఈ ఫీచర్ ప్రారంభించిన తర్వాత కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న మొత్తం కంటెంట్ స్పటికల్ ఆడియో కోసం అందుబాటులో ఉండదని గమనించాలి. ఎందుకంటే ఈ ఫీచర్ సినిమాలు మరియు కొన్ని రకాల సరౌండ్ సౌండ్ మిక్సింగ్‌తో మాత్రమే పనిచేస్తుంది.

Best Mobiles in India

English summary
iOS Users How to Watch Netflix With Spatial Audio

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X