iOS యాజర్లే టార్గెట్‌గా సైబర్ నేరగాళ్ల దాడి.. బ్యాంకింగ్ సహా వ్యక్తిగత సమాచారం చోరీ..?
అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని కొందరు వ్యక్తులు ఇతరులను హాని చేసేందుకు వినియోగిస్తున్నారు. మాల్‌వేర్‌ను క్రియేట్ చేసి స్మార్ట్‌ఫోన్లపై దాడి చేస్తున్నారు. ఫోన్లలోని వ్యక్తిగత, సున్నితమైన సమాచారాన్ని దొంగలిస్తున్నారు. iOS యూజర్ల టార్గెట్‌గా ప్రత్యేకంగా తయారుచేసిన తొలి బ్యాంకింగ్ ట్రోజన్ సైబర్ సెక్యూరిటీ వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చివేస్తోంది. ఐఫోన్ సెక్యూరిటీ కి సవాల్ విసురుతోంది.
గతంలో ఈ మాల్వేర్‌ను గోల్డ్ డిగ్గర్‌గా పిలిచేవారు. ఆండ్రాయిడ్ ఫోన్ల యూజర్లను టార్గెట్ చేసింది. అనంతరం గోల్డ్‌పిక్ యాక్స్‌గా (Gold Pick axe) పేరు మార్చుకొని iOS యాజర్లను టార్గెట్‌గా పనిచేస్తోంది. అధునాతన ఫీచర్‌లతో ఐఫోన్‌లను కూడా దోపిడి చేయగల సామర్థ్యాలను కలిగి ఉందని తెలుస్తోంది.

ఈ ట్రోజన్‌ను తొలుత అక్టోబర్‌లో గుర్తించారు. ఈ హానికర సాఫ్ట్‌వేర్.. ఆండ్రాయిడ్, ఐఫోన్ల యూజర్లకు హానిచేసే సామర్థ్యాలను కలిగి ఉంది. అయితే ఐఫోన్ యూజర్లకు ఎక్కువగా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ గోల్డ్‌పిక్ యాక్స్ ట్రోజర్ ఒక్కసారి ఐఫోన్‌లోకి వస్తే సున్నితమైన డేటాను సేకరించడం ప్రారంభిస్తుంది.
ఐఫోన్ ఫేసియల్ రికజ్నైజేషన్ సమాచారం, ఇతర డాక్యుమెంట్లు, ఇతర టెక్ట్స్ మెసెజ్ మరియు బ్యాంకింగ్‌కు సంబంధించిన వివరాలను సేకరిస్తుంది. ఈ వివరాల ద్వారా బాధితుల బ్యాంకు ఖాతాలను సులభంగా ఖాళీచేసే అవకాశం ఉంది. దీంతోపాటు బయోమెట్రిక్ వివరాలను సేకరించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డీప్‌ఫేక్ లను తయారు చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతానికి గ్లోల్డ్‌పిక్ యాక్స్ ట్రోజన్ వియత్నాం, థాయ్‌లాండ్‌లో ఐఫోన్ యూజర్లను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అనంతరం ప్రధానంగా ఇంగ్లీష్ మాట్లాడే దేశాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ జాబితాలో అమెరికా, కెనెడా వంటి దేశాలు ఉన్నాయి. ఫలితంగా ఐఫోన్, ఆండ్రాయిడ్ యూజర్లు ప్రమాదంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ గోల్డ్‌పిక్ యాక్స్ ట్రోజర్ ఐఫోన్‌లో హానికర యాప్‌లు సహా ఇతర విధాలుగా దాడిచేస్తుంది. అయితే ఐఫోన్ కఠినమైన భద్రతా కారణంగా ఈ ప్రక్రియ అంత సులభం కాదు. అయితే ఆపిల్ మొబైల్ అప్లికేషన్ టెస్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను.. టెస్‌ప్లైట్‌ను ఉపయోగించి ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అనంతరం ఐఫోన్ యూజర్లను మభ్యపెట్టి పూర్తి ఫోన్ యాక్సెస్‌ను పొందుతున్నారు.
ఈ ట్రోజన్ నుంచి ఐఫోన్‌ను ఎలా సంరక్షించాలి.
టెస్ట్‌ఫ్లైట్ : ఐఫోన్‌లో యాప్‌లను ఇన్ స్టాల్ చేయడం కోసం టెస్ట్ ఫ్లైట్ వినియోగాన్ని తగ్గించాల్సి వచ్చే కొంచెం అప్రమత్తంగా ఉంటాలి. ఈ పద్దతి ద్వారా ఎక్కువ సెక్యూరిటీ ముప్పును గురిచేస్తుంది.
MDM ప్రొఫైల్ : మొబైల్ డివైస్ మేనేజ్‌మెంట్ ఫ్రొపైల్‌ను మాత్రమే ఇన్‌స్టాల్ చేయండి.
మాల్‌వేర్ స్కానింగ్ : iOS లో యాంటీ వైరస్ యాప్‌ల అవసరం తక్కువగా ఉంటుంది. అయితే USB కేబుల్ ద్వారా మ్యాక్‌బుక్‌కు కనెక్ట్ చేసినప్పుడు ఇంటిగో మ్యాక్ ఇంటర్నెట్ సెక్యురిటీ X9 లేదా ఇంటెగా మ్యాక్ ప్రీమియం బండిల్ X9 ఉపయోగించే అవకాశాలను పరిశీలించండి.
లాక్‌డౌన్ మోడ్ : ఎక్కువ సెక్యురిటీ సమస్యలు ఉన్నవారు సరైన భద్రతను కలిగి ఉన్నాగానీ లాక్‌డౌన్ మోడ్‌ను యాక్టివేట్ చేసే అవకాశాలను పరిశీలించండి.
దొంగిలించబడిన పరికరాల రక్షణ : దొంగిలించబడిన యాపిల్ పరికరాల రక్షణ కోసం 'స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్. ఫీచర్ మీ ఫోన్‌లో యాక్టివేట్ చేయబడి ఉందో లేదో నిర్ధారించుకోండి.


Click it and Unblock the Notifications