మార్కెట్ లోకి విడుదల కానున్న ఐప్యాడ్ 2, దాని గురించిన సమాచారం

By Super
|
మార్కెట్ లోకి విడుదల కానున్న ఐప్యాడ్ 2, దాని గురించిన సమాచారం
సాధారణంగా కొంత మందికి ఫోన్ల పిచ్చి. మరికోంత మందికి కార్ల పిచ్చి. మరికోంత మందికి బైకుల పిచ్చి. ఇలాంటి వారి కోసం ఆపిల్ కంపెనీ కొత్త కొత్త మోడళ్శను విడుదల చేస్తూ ఉంటుంది. ఐతే ఈసారి మాత్రం ఆపిల్ కంపెనీ ఓ సరిక్రొత్త ఆపిల్ ఐప్యాడ్‌ని మార్కెట్ లోకి విడుదల చేసింది. చాలా మందికి దీని గురించి తెలుసుకోవాలి అని ఆసక్తి ఉంటుంది. అలాంటి ఆసక్తి కలవారికోసం ప్రత్యేకంగా దానికి సంబంధించినటువంటి అన్ని ఫీచర్స్ తెలియజేయస్తున్నాం.

సాప్ట్‌వేర్ మార్కెట్‌లో ప్రభంజనాన్ని సృష్టించినటువంటి ఆపిల్ ఐప్యాడ్ ఇప్పుడు మరింత అందంగా తయారయింది. రెండో జనరేషన్ టాబ్లెట్ కంప్యూటర్‌గా మన ముందుకి వచ్చింది. డబ్బు విషయంలో ఏమాత్రం మార్పు లేకుండా మార్కెట్ లోకి విడుదలైనటువంటి ఆపిల్ ఐప్యాడ్ 2 మార్కెట్‌లో ఉన్నటువంటి ఇతర కంపెనీలతోటి పోటీకి సిద్దమైంది. కొత్త ఆపిల్ ఐప్యాడ్‌లో ఉన్నటువంటి ఫీచర్స్.....

 

డిజైన్: ఐప్యాడ్ కంటే 33శాతం తక్కువ మందం, 15 శాతం తక్కువ బరువుతో రూపోందించడం జరిగింది.

కవర్: దీనికి ఓ ప్రత్యేక కవర్ అంటిపెట్టుకోని ఉంటుంది. టైపింగ్, బ్రౌజింగ్, వీడియో వీక్షించేందుకు అనువుగా ఐప్యాడ్‌ను మనం సెట్ చేసుకోవడానికి వీలు ఉంది.

కెమెరాలు: ఐప్యాడ్‌కు ముందు భాగంలో VGA కెమెరా. Face Time Chating లాంటివి చేయడానికి వీలుగా రూపోందించడం జరిగింది. ఐప్యాడ్ వెనుక భాగాన ఉన్నటువంటి Cameraతో ఎక్కువ క్వాలిటీ వచ్చే విధంగా వీడియో, ఫోటోలు తీసుకోవచ్చు.

ప్రాసెసర్: కొత్తగా రూపోందించినటువంటి ఈఐప్యాడ్‌లో Dual Core Processor వాడడం జరిగింది. ఈ కోత్త ప్రాసెసర్ ఐప్యాడ్ ప్రాసెసర్ కంటే రెండు రెట్లు వేగంతో పని చేస్తుంది

HDMI Port: ప్రత్యేక పోర్ట్‌తో రూపోందించిన ఈ ఐప్యాడ్ 2, టివిలకు అనుసంధానం చేసి వీడియోలు, సినిమాలు చూడడానికి వీలుగా ఉంటుంది.

వీటితో పాటు మరికోన్ని ప్రత్యేకమైనటువంటి ఫీచర్స్ మీకోసం.....

iMovie వీడియో ఎడిటింగ్ సాప్ట్‌వేర్‌ను In Build Application గా అందిస్తున్నారు. మ్యాజిక్ ప్రియుల కోసం GarageBand సాప్ట్ వేర్ ని కూడా ఇందులో పోందుపరచడం జరిగింది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 10 గంటలు నిర్విరామంగా బ్యాటరీ ఛార్జింగ్. LED BackLight Display తో వీడియోలను చూడోచ్చు. సాధారణంగా కొన్ని లాప్‌ట్యాప్స్ సూర్యకాంతిలో స్పష్టంగా కనపడవు. కానీ ఇది మాత్రం సూర్యకాంతిలో కూడా వీడియోలు, సినిమాలు చాలా స్పష్టంగా చూడవచ్చు.

మరిన్ని వివరాలకోసం మీకోసం www.apple.com/ipad లో చూడోచ్చు.

Screen: 9.7 Inches, 1024*768 Pixles

System: IOS 4.3

Storage: 16 Gb To 64 Gb

Weight: 590 Gr

Width: 8.8 mm

Introduce in Market: March 11(America), March 25(Europe)

Cost: Rs 22,450(16 Gb)

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X