Home
News

రూ.59,900 ధరకే 11 అంగుళాల ఐప్యాడ్ ఎయిర్ 7.. M3 చిప్‌తో గ్రాఫిక్స్ అదిరిపోతుంది భయ్యా..!!

iPad Air 7th Gen: యాపిల్ సంస్థ మనదేశంలో సరికొత్త ఐప్యాడ్ ఎయిర్ 7వ తరం టాబ్లెట్‌ను విడుదల చేసింది. ఇందులో శక్తివంతమైన M3 చిప్ ఉండటంతో స్పీడ్, గ్రాఫిక్స్ పరంగా ఇది శక్తివంతంగా ఉంటుంది. గతేడాది వచ్చిన M2 మోడల్ స్థానంలో ఈ కొత్త మోడల్ వచ్చేసింది. ఇది రెండు సైజుల్లో లభిస్తుంది. ఒకటి 11-అంగుళాలు, రెండోది 13-అంగుళాలు. అంతేకాదు, దీనికి వాడే యాక్సెసరీస్‌ను కూడా యాపిల్ మరింత అప్‌గ్రేడ్ చేసింది.

ఇప్పుడు యాపిల్ పెన్సిల్ (USB-C, ప్రో), పెద్ద టచ్‌ప్యాడ్‌తో కూడిన సరికొత్త మ్యాజిక్ కీబోర్డ్‌ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. దీని ప్రారంభ ధర రూ.59,900 నుండి మొదలవుతుంది. ఐప్యాడ్ ప్రో అంత ఖర్చు పెట్టకుండానే మంది ఫాస్ట్ పర్ఫార్మెన్స్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

iPad Air 7th Gen with M3 Chip Now in India  Prices Start at Rs 59 900

* M3 చిప్‌తో మరింత వేగవంతమైన పనితీరు

ఐప్యాడ్ ఎయిర్ 7వ తరంలో చేసిన అతిపెద్ద అప్‌గ్రేడ్ ఏంటంటే.. M3 చిప్. ఇందులో 8-కోర్ CPU, 9-కోర్ GPU ఉన్నాయి. దీనివల్ల M1 వెర్షన్‌తో పోలిస్తే CPU పనితీరు 35 శాతం వరకు మెరుగుపడుతుంది, గ్రాఫిక్స్ 40 శాతం వేగంగా పనిచేస్తాయి. కొత్త GPU రే ట్రేసింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

దీనివల్ల గేమ్స్‌లో, యాప్స్‌లో లైటింగ్, రిఫ్లెక్షన్స్, షాడోస్ అన్నీ చాలా రియలిస్టిక్‌గా కనిపిస్తాయి. పాత మోడల్స్‌తో పోలిస్తే గ్రాఫిక్స్ ఎక్కువగా వాడే పనుల్లో ఇది ఏకంగా నాలుగు రెట్లు వేగంగా పనిచేస్తుందని యాపిల్ చెబుతోంది. ప్రధానంగా గ్రాఫిక్స్ కోసం చూసే బడ్జెట్ యూజర్లకు ఇది మంచి ఛాయిస్ అవుతుంది.

* యాపిల్ ఇంటెలిజెన్స్ & AI ఫీచర్లు

కొత్త ఐప్యాడ్ ఎయిర్, యాపిల్ ఇంటెలిజెన్స్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇది యాపిల్ తీసుకొచ్చిన AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టూల్స్ ప్యాకేజీ. క్రియేటివిటీ, ప్రొడక్టివిటీని పెంచడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. M3 చిప్‌లోని న్యూరల్ ఇంజన్ మునుపటి వెర్షన్ కంటే 60 శాతం వేగంగా పనిచేస్తుంది.

ఇమేజ్ ఎడిటింగ్, రైటింగ్ అసిస్టెన్స్, స్మార్ట్ ఫోటో జనరేషన్ లాంటి AI పనులన్నీ చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. ఇమేజ్ ప్లేగ్రౌండ్, క్లీన్ అప్, ఇమేజ్ వాండ్, రైటింగ్ టూల్స్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లను కూడా మీరు వాడొచ్చు. టెక్నాలజీ ఏ స్థాయిలో పనితీరు కనబరుస్తుందో చూడాలి.

* మ్యాజిక్ కీబోర్డ్, ఇతర యాక్సెసరీలు

ఐప్యాడ్ ఎయిర్ కోసం కొత్తగా వచ్చిన మ్యాజిక్ కీబోర్డ్‌లో పెద్ద టచ్‌ప్యాడ్ ఇచ్చారు. దీనివల్ల కచ్చితత్వంతో పనిచేసుకోవచ్చు. అలాగే, బ్రైట్‌నెస్, వాల్యూమ్ వంటి సెట్టింగ్‌ల కోసం 14 ఫంక్షన్ కీస్‌ను కూడా యాడ్ చేశారు. ఈ కీబోర్డ్ అయస్కాంతంలా ఐప్యాడ్‌కు అతుక్కుంటుంది.

ఛార్జింగ్ కోసం USB-C పోర్ట్ కూడా ఉంది. అదనపు రక్షణ కోసం స్మార్ట్ ఫోలియో కవర్లను కూడా యాపిల్ రిలీజ్ చేసింది. ధరలు చూస్తే మ్యాజిక్ కీబోర్డ్ 11-అంగుళాల మోడల్ ధర రూ.26,900 కాగా, 13-అంగుళాల మోడల్ ధర రూ.29,900. స్మార్ట్ ఫోలియో 11-అంగుళాల మోడల్ ధరలు రూ.8,500, 13-అంగుళాల మోడల్ రూ.10,900గా ఉన్నాయి.

* డిస్‌ప్లే, స్టోరేజ్, కెమెరా ఫీచర్లు

ఐప్యాడ్ ఎయిర్ 7వ తరంలో లిక్విడ్ రెటినా డిస్‌ప్లే ఉంటుంది. ఇది ట్రూ టోన్, P3 కలర్ సపోర్ట్‌తో వస్తుంది. 11-అంగుళాల మోడల్‌లో 2360×1640 రిజల్యూషన్, 13-అంగుళాల మోడల్‌లో 2732×2048 పిక్సెల్స్ ఉంటాయి. రెండు స్క్రీన్‌లు 500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో క్లియర్ విజువల్స్‌ను అందిస్తాయి.

స్టోరేజ్ ఆప్షన్స్ 128GB నుంచి మొదలై 1TB వరకు ఉన్నాయి. టాబ్లెట్ వెనుకవైపు 12MP కెమెరా ఉంటుంది, ఇది స్మార్ట్ HDR4 సపోర్ట్‌తో వస్తుంది. వీడియో కాల్స్ కోసం ముందువైపు అల్ట్రావైడ్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. పిక్చర్స్, వీడియోలు అదిరిపోతాయి.

* కనెక్టివిటీ, బ్యాటరీ లైఫ్

కనెక్టివిటీ విషయానికొస్తే.. ఇందులో వై-ఫై 6E, బ్లూటూత్ 5.3, USB4, థండర్‌బోల్ట్ 3, 5G (cellular మోడల్స్‌లో) వంటి ఫీచర్లు ఉన్నాయి. ఐప్యాడ్ ఎయిర్ బరువు తక్కువగా, సన్నగా 6mm మందం కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 గంటల వరకు వస్తుందని యాపిల్ చెబుతోంది.

* ధర

ఐప్యాడ్ ఎయిర్ 7వ తరం భారతదేశంలో ముందస్తు ఆర్డర్‌ల కోసం ఇప్పుడు అందుబాటులో ఉంది. మార్చి 12వ తేదీ నుంచి యాపిల్ అధికారిక వెబ్‌సైట్, యాపిల్ స్టోర్ లొకేషన్లు, అధీకృత డీలర్ల వద్ద ఇది అమ్మకానికి ఉంటుంది. ఐప్యాడ్ ఎయిర్ (11") వై-ఫై (128GB) ధర రూ.59,900.

ఐప్యాడ్ ఎయిర్ (11") వై-ఫై + సెల్యులార్ (128GB) రూ.74,900, ఐప్యాడ్ ఎయిర్ (13") వై-ఫై (128GB) ధర రూ.79,900, ఐప్యాడ్ ఎయిర్ (13") వై-ఫై + సెల్యులార్ (128GB) ధర రూ.94,900 ఐప్యాడ్ ఎయిర్ 7వ తరం బ్లూ, పర్పుల్, స్టార్‌లైట్, స్పేస్ గ్రే రంగుల్లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple iPad Air 7th Gen boasts the M3 chip for superior speed and graphics, in 11" and 13" sizes. It features Apple Intelligence, and affordable high performance starting at Rs 59,900.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X