జర్మన్ సైట్‌లో ఐప్యాడ్ మినీ ధర వివరాలు!

ఆపిల్ ఐప్యాడ్ మినీ విడుదల పై పుకార్లు షికార్లు చేస్తున్న నేపధ్యంలో జర్మనీకి చెందిన ఓ ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఐప్యాడ్ మినీ వేరియంట్స్ ఇంకా ధర వివరాలను ప్రస్తావిస్తూ కథనాన్ని ప్రచురించినట్లు మొబైల్ గీక్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. ఐప్యాడ్ మినీ వేరియంట్‌లతో పాటు ధరలను పేర్కొంటూ ఓ లిస్టింగ్‌ను జర్మనీ బ్లాగ్ విడుదల చేసింది వాటి వివరాలు...
ఈ రిపోర్ట్ ఆధారంగా ఐప్యాడ్ మినీ మొత్తం 4 మెమరీ వేరియంట్‌లలో రానుంది. 8జీబి, 16జీబి, 32జీబి, 64జీబి వేరియంట్‌లలో రూపుదిద్దుకున్న ఐప్యాడ్ మినీలు వై-పై ఇంకా 3జీ మోడళ్లలో లభ్యంకానున్నాయి. బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరింయట్‌లలోని ఐప్యాడ్ మినీలను యూజర్లు సొంతం చేసుకోవచ్చు.
ఐప్యాడ్ మినీ (8జీబి వై-ఫై మోడల్): $323 (రూ. 17,000),
ఐప్యాడ్ మినీ (8జీబి వై-ఫై+ 3జీ వేరియంట్): $452 (రూ. 21,000),
ఐప్యాడ్ మినీ (16జిబి వై-ఫై మోడల్): $452 (రూ. 21,000),
ఐప్యాడ్ మినీ (16జీబి వై-ఫై+ 3జీ వేరియంట్): $582 (రూ.27,000),
ఐప్యాడ్ మినీ (32జీబి వై-ఫై మోడల్): $582 (రూ.27,000),
ఐప్యాడ్ మినీ (32జీబి వై-ఫై+ 3జీ వేరియంట్): $711 (రూ.36, 000),
ఐప్యాడ్ మినీ (64జీబి వై-ఫై మోడల్): $711(రూ. 36,000),
ఐప్యాడ్ మినీ (64జీబి వై-ఫై+ 3జీ వేరియంట్): $841 (రూ. 41,000).


Click it and Unblock the Notifications








