ఐప్యాడ్ దెబ్బకు విలవిలలాడుతున్న మిగతా కంపెనీల టాబ్లెట్ సేల్స్

Posted By: Staff

ఐప్యాడ్ దెబ్బకు విలవిలలాడుతున్న మిగతా కంపెనీల టాబ్లెట్ సేల్స్

ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసిన ఐప్యాడ్ 2 గురించే. ఐప్యాడ్ 2 విడుదలైన తర్వాత చాలా కంపెనీలకు చెందినటువంటి టాబ్లెట్స్ ప్రోడక్షన్స్ తగ్గించుకోవడం జరిగింది. పోయిన సంవత్సరం మార్చి నుండి గనుక మనం చూసుకున్నట్లైతే దాదాపు టాబ్లెట్ తయారీ దారులు వారియొక్క టాబ్లెట్ ప్రోడక్షన్‌ని 10శాతం తగ్గించుకున్నట్లు సమాచారం. ఇటీవలే జెపి మోర్గాన్ సంస్ద విడుదల చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం టాబ్లెట్ తయారీ సంస్దలు కొన్ని తక్కువ ఆర్డర్స్ ఉండడం వల్ల ఇబ్బందులు పడినట్లు సమాచారం. ఐప్యాడ్ 2 దెబ్బకు ప్రముఖ కంపెనీల ఉత్పత్తులు అయిన మోటరోలా జూమ్, రీసెర్చ్ ఇన్ మోషన్ వారి ప్లేబుక్, శ్యామ్ సంగ్ గెలాక్సీ టాబ్స్ గనుక చూసుకున్నట్లైతే పోయిన సంవత్సరం మార్చిలో 81మిలియన్ ఆర్డర్స్ రాగా, అదే ఈ సంవత్సరం ఆర్డర్స్ 73మలియన్స్ మాత్రమే రావడం జరిగిందని వెల్లడించారు.

శ్యాన్ ప్రాన్సికోకి చెందినటువంటి ఆపిల్ కంపెనీలో ఐప్యాడ్ 2 కోసం జనాభా బారులు తీరి ఉండడంతో ఐప్యాడ్ 2 ఎంత బాగా సక్సెస్ అయిందో ఇట్టే తెలిసిపోతుంది. ఆపిల్ కంపెనీకి వస్తున్నటువంటి జనాభా కోసం ఆపిల్ ఎంప్లాయస్ ఎవరు ముందు వస్తే వారికి వోచస్ ఇచ్చి 'ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్' పద్దతిని పాటిస్తున్నారు. ఇది ఇలా ఉంటే మే 28న ఆపిల్ కంపెనీ ఐప్యాడ్ 2ని ఆసియా దేశాలలో విడుదల చేయడం జరిగింది. అక్కడ కూడా ఆపిల్ ఐప్యాడ్ 2 మంచి సేల్స్‌ని నమోదు చేస్తుంది.

ఇక చైనాలోని అన్హూయి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఓ టీనేజర్ ఐప్యాడ్ 2 కొనుగోలు చేయడం కోసం తన కుడి కిడ్నీని అమ్మడం జరిగింది. పదహేడు సంవత్సరాలు వయసు కలిగినటువంటి 'జియా జింగ్' అనే టీనేజర్‌కి ఐప్యాడ్ 2 అంటే ప్రాణం. కానీ ఐప్యాడ్ 2 ధర మాత్రం తనకి అందనంత దూరంలో ఉండడంతో 'జియా జింగ్' తన కిడ్నీ అమ్మి ఆపిల్ ఐప్యాడ్ 2ని సోంతం చేసుకోవడం జరిగింది.

ఇక ఈ క్రింద ఫోటోలో మీకు కనిపిస్తుంది శ్యాన్ ప్రాన్సికోలో ఐప్యాడ్ 2 కోసం వేచిఉన్న కస్టమర్స్

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot