Home
News

ఆపిల్ ఈవెంట్లో లాంచ్ కాబోతున్న కొత్త ఉత్పత్తులు ఇవే

By Gizbot Bureau

ఐఫోన్ ప్రేమికులకు ఆపిల్ కంపెనీ శుభవార్తను అందించింది. ఈ ఏడాది ఆపిల్ నూతన ఐఫోన్లను ఎప్పుడు విడుదల చేస్తుందా.. అని ఎదురు చూస్తున్న ఐఫోన్ ప్రియులకు ఎట్టకేలకు విడుదల తేదీని అందించింది. సెప్టెంబర్ 10వ తేదీన నిర్వహించననున్న ఆపిల్ ఈవెంట్‌లో తన నూతన ఐఫోన్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మీడియా ప్రతినిధులకు ఆపిల్ ఆహ్వానాలను కూడా పంపింది. సెప్టెంబర్ 10వ తేదీన భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు కాలిఫోర్నియాలోని కుపర్‌టినోలో ఉన్న ఆపిల్ కార్యాలయంలోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో ఆ సంస్థ తన నూతన ఐఫోన్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది.

 ఐఫోన్ 11 సిరీస్‌

ఈవెంట్‌లో ఆపిల్ కంపెనీ .. ఐఫోన్ 11 సిరీస్‌లో ఐఫోన్ 11, 11మ్యాక్స్/11ప్రొ, 11ఆర్ పేరిట మూడు కొత్త ఐఫోన్లను విడుదల చేస్తుందని సమాచారం. ఇక ఈ ఫోన్లలో వెనుక భాగంలో చతురస్రాకారంలో సెటప్ కలిగిన మూడు కెమెరా సెన్సార్లు, మల్టీ యాంగిల్ ఫేస్ ఐడీ సెన్సార్, రివర్స్ వైర్‌లెస్ చార్జింగ్, ఏ13 ప్రాసెసర్ తదితర అధునాతన ఫీచర్లను అందివ్వనున్నట్లు తెలిసింది.ఇదిలా ఉంటే రిలీజ్‌కు ముందే ఆ ఫోన్ ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. చైనాకు చెందిన MyDrivers వెబ్‌సైట్ ఆపిల్ ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్ల ధరలు, స్పెసిఫికేషన్స్‌ని లీక్ చేశాయి. ఆపిల్ ఐఫోన్ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ఫోటోలను పోస్ట్ చేశాయి. లీకయిన వివరాల ప్రకారం..

 ఐఫోన్ 11

6.1 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, 3డీ టచ్ ఫార్మాట్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ , ఏ13 ప్రాసెసర్ 12+12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3,110 ఎంఏహెచ్ బ్యాటరీ,Wi-Fi 6 స్టాండర్డ్ కంపాటబిలిటీ, ఆపిల్ పెన్సిల్ సపోర్ట్ ఉండనున్నాయి. దీని ధర సుమారుగా రూ.53,700 ఉంటుందని అంచనా..

ఐఫోన్ 11 ప్రో స్పెసిఫికేషన్స్

5.8 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లే, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఏ13 ప్రాసెసర్, 12+12+12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3,190 ఎంఏహెచ్ బ్యాటరీ, Wi-Fi 6 స్టాండర్డ్ కంపాటబిలిటీ, ఆపిల్ పెన్సిల్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. దీని ధర సుమారుగా రూ.71,000 ఉంటుందని అంచనా..

ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ స్పెసిఫికేషన్స్

6.5 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లే, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఏ13 ప్రాసెసర్, 12+12+12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3,500ఎంఏహెచ్ బ్యాటరీ, Wi-Fi 6 స్టాండర్డ్ కంపాటబిలిటీ, ఆపిల్ పెన్సిల్ సపోర్ట్. ధర సుమారు రూ.78,800. 

ఆపిల్ కొత్త ఐఫోన్లు సెప్టెంబ‌ర్ 20వ తేదీ నుంచి వినియోగ‌దారుల‌కు ల‌భ్య‌మ‌వుతాయ‌ని తెలుస్తోంది. గ‌తంలో ఆపిల్ ఎప్పుడు ఐఫోన్ల‌ను విడుద‌ల చేసినా హై ఎండ్ వేరియెంట్ల‌ను ముందుగా విక్ర‌యిస్తుంది. కానీ ఈ సారి మాత్రం అలా కాకుండా లో ఎండ్ వేరియెంట్‌ను కూడా ముందు నుంచే విక్ర‌యించాల‌ని ఆపిల్ ఆలోచిస్తున్న‌ట్లు తెలిసింది.

Best Mobiles in India

English summary
iphone 11 release date price specs, iphone 11 pro name confirmed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X