iPhone 12 Miniపై భారీ డిస్కౌంట్.. రూ.20,999కే కొనుగోలు చేయవచ్చు..!
గత కొన్ని సంవత్సరాలుగా స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే సైజు పెరగడం మనం గమనిస్తూనే ఉన్నాం. 2011లో విడుదలైన యాపిల్ ప్లాగ్‌షిప్ మోడల్ iPhone 4S కేవలం 3.5 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉండేది. కానీ యాపిల్ తాజా ఐఫోన్ 14 Pro Max 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.
అయితే ప్రస్తుతం జేబులో సౌకర్యవంతంగా ఉండే ఫోన్లవైపు కొంతమంది వినియోగదారులు చూస్తున్నారు. వీరికి ఇటువంటి ఫోన‌్లు దొరకడం కొంచెం కష్టం. అయితే అలాంటి వారికి ఐఫోన్ 12 మిని ఓ మంచి ఎంపిక అయ్యే అవకాశం ఉంది.

యాపిల్ మిని స్మార్ట్‌ఫోన్లలో ఐఫోన్ 12 మిని చివరిది. ఇందులో యాపిల్ ఫోన్లలో వచ్చే అన్ని ఫీచర్లు ఉంటాయి. డిస్‌ప్లే మాత్రం 5.4 అంగుళాలు మాత్రమే ఉంటుంది. A14 బయోనిక్ చిప్‌సెట్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ Flipkartలో అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్ కలిపి సుమారు ఈ ఐఫోన్ 12 మిని ధర రూ.20,999కే రానుంది.
అయితే ఈ స్మార్ట్‌ఫోన్ 64 వేరియంట్ ధర ప్రస‌్తుతం రూ. 59,900 గా ఉంది. ప్లిప్‌కార్ట్ ఈ ఐఫోన్ 12 మిని ఫోన్‌పై తొలుత ప్లిప్‌కార్డ్ రూ.8,901 డిస్కౌంట్ ఇచ్చింది. అంటే 50,999కు ప్రస్తుతం అందుబాటులో ఉంది. దీంతోపాటు బ్యాంక్ ఆఫ్‌ర్ మరియు ఎక్స్చేంజ్ ఆఫర్‌తో ఈ ఫోన్ ధర భారీగా తగ్గనుంది
పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకొని ఐఫోన్ 12 మిని ఫోన్‌ను మరింత తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఇచ్చింది. పాత ఫోన్ ఎక్స్చేంజ్‌పై రూ.30,000 వరకు తగ్గింపు పొందవచ్చు. మీ పాతఫోన్‌పై గరిష్ఠంగా రూ.30,000 తగ్గింపు లభిస్తే.. ఐఫోన్ 12 మిని ఫోన్‌ను కేవలం రూ.20,999కే కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఎక్స్చేంజ్ ధర మీ పాత ఫోన్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. మరియు మీ ప్రాంతంలో ఈ ఎక్స్చేంజ్ సదుపాయం అందుబాటులో ఉందో లేదో తొలుత చెక్ చేసుకోండి.
ఐఫోన్ 12 మిని ఫోన్‌ను ప్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో కొనుగోలు చేసినట్లయితే 5% తగ్గింపును పొందవచ్చు. దాంతోపాటు సర్‌ప్రైజ్ క్యాష్‌బ్యాక్ కూపన్లు పొందే అవకాశం ఉంటుంది. ఈ కూపన్లకు 2023 నవంబర్ వరకు కాలపరిమితి ఉంటుంది. మీరు ఒకేసారి నగదు చెల్లించలేకపోయినట్లయితే.. ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా EMIలో నగదును చెల్లించవచ్చు.
iPhone 12 మాదిరిగా ఐఫోన్ 12 మిని వెనుకవైపు 12MP డ్యూయల్ కెమెరాలను కలిగి ఉండనుంది. ముందువైపు 12MP కెమెరాను కలిగి ఉండనుంది. 4k డాల్బీ విజన్‌తో HDRలో రికార్డింగ్ చేయవచ్చు. 2,227mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది. 64GB, 128GB, 256GB అంతర్గత స్టోరేజీలతో అందుబాటులో ఉన్నాయి. నలుపు, నీలం, పచ్చ, పర్పల్, ఎరుపు, తెలుపు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 12 మిని IP68 వాటర్ రెసిస్టెన్స్ కలిసి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








