రూ.44 వేల‌కే iPhone 12.. Amazonలో అందుబాటులో ఆఫ‌ర్ త్వ‌ర‌ప‌డండి!

|

భార‌త్‌లో ఫెస్టివ‌ల్ సీజ‌న్ సంద‌ర్భంగా ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ ప్లాట్‌ఫాం Amazonలో గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ సేల్ 2022 ప్రారంభ‌మైంది. ఇందులో భాగంగా వివిధ కంపెనీల‌కు చెందిన అనేక ఉత్ప‌త్తుల‌పై మంచి డీల్స్ ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్నాయి. Apple కంపెనీకి చెందిన iPhone 12పై అద్భుత‌మైన ఆఫ‌ర్ ప్ర‌స్తుతం అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో iPhone 12 మోడ‌ల్ 64జీబీ వేరియంట్ రూ.44,499 ధ‌ర‌కు ప్రారంభ‌మ‌వుతోంది.

iPhone

iPhone 12 పాత మోడ‌లే అయిన‌ప్ప‌టికీ.. ఇది చాలా గొప్ప ఫీచ‌ర్లు క‌లిగి ఉంది. ఎవ‌రైనా ఐఫోన్ మారాల‌నుకునే వారికి ఇది మంచి ఆఫ‌ర్‌గా చెప్ప‌వ‌చ్చు. ప్ర‌స్తుతం, ఈ iPhone 12 మోడ‌ల్ 64GB నిల్వతో అమెజాన్‌లో రూ. 44,499కి అందుబాటులో ఉంది. వినియోగదారు SBI క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,250 తక్షణ తగ్గింపు కూడా ఉంది. నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ కూడా రూ.25,000 వ‌ర‌కు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. ఇక‌పోతే, iPhone 12 యొక్క 128GB వేరియంట్ రూ.49,999కి అందుబాటులో ఉంది. ఇది కూడా చాలా గొప్ప విలువైన ఆఫర్ అని చెప్పొచ్చు.

iPhone 12 ప్ర‌త్యేక‌త‌ల గురించి తెలుసుకుందాం:
iPhone 12 మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్ A14 బయోనిక్ చిప్‌తో పనిచేస్తుంది. దీనికి బ్యాక్‌సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇది 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు IP68 వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌తో వస్తుంది. భార‌త్‌లో ఇటీవ‌ల ఐఫోన్ 14 సిరీస్ అధికారికంగా విడుద‌లైన త‌ర్వాత కంపెనీ దాని ధ‌ర త‌గ్గింపుతో విక్ర‌యిస్తోంది. ఐఫోన్ 12 ప్రస్తుతం పాత మోడ‌ల్ అయినప్పటికీ, గొప్ప ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంది. 64GB, 128GB మరియు 256GB స్టోరేజీ ఎంపికలలో అందించబడుతుంది.

iPhone

ఆప్టిక్స్ విష‌యానికొస్తే, ఐఫోన్ 12 కు సెల్ఫీల కోసం ముందు భాగంలో 12MP TrueDepth కెమెరాను కలిగి ఉంది. వెనుకవైపు, ఇది డ్యూయల్ 12MP కెమెరా సెటప్‌తో అమర్చబడింది. ఫోన్ IP68 రేట్ చేయబడింది మరియు MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

మీరు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, iPhone 12 కు బ్యాటరీ విష‌యంలో అంత బెస్ట్ కాద‌నే చెప్ప‌వ‌చ్చు. ఇది iPhone 13 సిరీస్ మరియు తర్వాతి పరికరాలలో అందుబాటులో ఉండే సినిమాటిక్ వీడియో మోడ్ షూటింగ్‌కి కూడా ఇది మద్దతు ఇవ్వదు. మీరు ఎవ‌రికైనా ఇంట్లో వాళ్ల‌కి ఐఫోన్ బ‌హుమ‌తిగా ఇవ్వాల‌ని భావిస్తే ఇది మంచి అవ‌కాశం. గేమ‌ర్ల‌కు ఇది అంత ప‌ర్ఫెక్ట్ మ్యాచ్ కాద‌నేది నిపుణుల అభిప్రాయం.

ఇటీవ‌లె ఐఓఎస్ 16 ఆవిష్క‌రించిన యాపిల్‌:
మ‌రోవైపు, యాపిల్ కంపెనీ ఇటీవ‌ల iPhone 14 సిరీస్‌ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. దాంతో పాటుగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఐఫోన్ యూజ‌ర్ల కోసం ఐఓఎస్ 16 ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్ప‌టికే చాలా ఫోన్ల‌కు ఐఓఎస్ 16 అందుబాటులోకి వ‌చ్చింది. ఇప్పుడు కొత్త అప్‌డేటెడ్ ఓఎస్‌లో వ‌చ్చే ఫీచ‌ర్ల గురించి తెలుసుకుందాం.

iPhone

iOS 16: ఏమి అప్‌డేట్ అవుతుంది:
* లాక్ స్క్రీన్‌ను ఎక్కువసేపు నొక్కడం ద్వారా వినియోగదారులు వాల్‌పేపర్‌ను మార్చగ‌ల ఫీచ‌ర్‌ను పొందుతారు.
* అంతేకాకుండా, యూజ‌ర్లు స్క్రీన్‌పై విడ్జెట్లు యాడ్ చేయడానికి అవ‌కాశం ఉంటుంది.
* నోటిఫికేష‌న్లు నేరుగా లాక్ స్క్రీన్‌పైనే క‌నిపిస్తాయి. దిగువ నుండి పైకి స్వైప్ చేయడం ద్వారా వినియోగదారులు యాక్సెస్‌ను పొందగలరు.
* Apple యూజ‌ర్లు అప్‌గ్రేడెడ్ కెమెరా యాప్‌ను పొంద‌గ‌ల‌రు.
* కొత్త UI వినియోగదారులను ఫిల్టర్‌లు మరియు మోడ్‌ల మధ్య మారడానికి అనుమతిస్తుంది.
* కొంద‌రు ఐఫోన్ యూజ‌ర్లు మెరుగైన, అద్భుత‌మైన సినిమాటిక్ మోడ్‌ను పొంద‌వ‌చ్చు.
* అంతేకాకుండా, లాక్‌డౌన్ మోడ్ గా పిలిచే లాక్‌డౌన్ మోడ్‌ను పొందుతారు. ఇది పెగాసస్ వంటి స్పైవేర్ నుండి డివైజ్‌ల‌ను రక్షించడానికి రూపొందించబడింది.
* బ్యాట‌రీ ప‌ర్సెంటేజీ చూపించే ఐకాన్‌ను పొందుతారు.

ఈ ఐఫోన్‌లు బ్యాటరీ పర్సంటేజ్ ఐకాన్‌ను ఇండికేట్ చేస్తాయి:
కొత్త బ్యాటరీ ప‌ర్సంటేజీ ఐకాన్ ఇండికేట‌ర్ ఫీచ‌ర్‌కు స‌పోర్ట్ చేసే ఐఫోన్ మోడల్‌లు ఇక్కడ ఉన్నాయి. వీటిలో iPhone X, iPhone XS, iPhone XS Max, iPhone 11 Pro, iPhone 11 Pro Max, iPhone 12, iPhone 12 Pro, iPhone 12 Pro Max, iPhone 13, iPhone 13 Pro, iPhone 13 Pro Max మరియు కొత్తగా ప్రారంభించబడిన iPhone 14 సిరీస్ లోని iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro మరియు iPhone 14 Pro Max మోడ‌ల్స్‌ ఉన్నాయి.

Best Mobiles in India

English summary
iPhone 12 selling at low price of Rs.44,499 in amazon. check the details here

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X