iPhone14 సిరీస్‌ విడుద‌ల సెప్టెంబ‌ర్ 6వ తేదీనేనా! సేల్ ఎప్పుడంటే!

|

Apple కంపెనీ నుంచి iPhone 14 సిరీస్‌ విడుద‌ల కోసం టెక్ ప్రియులు ఎంతో ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు. అయితే, iPhone 14 విడుద‌ల కాస్త ఆల‌స్యం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఇప్ప‌టికే ప‌లు నివేదిక‌లు చెబుతుండ‌గా.. తాజాగా మ్యాక్స్ విన్‌బ్యాక్ అనే మ‌రో నివేదిక ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించింది. రాబోయే యాపిల్ ఉత్ప‌త్తులు అంచ‌నా గ‌డువు కంటే ముందే విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌ని ఆ నివేదిక‌ పేర్కొంది. Apple వాచ్ సిరీస్ 8 మరియు 10వ జెన‌రేష‌న్‌ ఐప్యాడ్‌తో పాటు iPhone14 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను సెప్టెంబర్ 6వ తేదీన ఆపిల్ విడుదల చేయనున్న‌ట్లు పేర్కొంది.

iphone 14

చైనా-తైవాన్-యుఎస్ మధ్య ఉద్రిక్తత కారణంగా iPhone 14 సిరీస్ మొబైల్స్ లాంచ్ ఆలస్యం కావచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. మ‌రోవైపు, భార‌త్‌లో iPhone 14, iPhone 14 మాక్స్ వంటి వివిధ ఆపిల్ iPhone 14 మోడల్‌ల స్థిరమైన లభ్యతను నిర్ధారించడానికి ఆ కంపెనీ దేశీయంగా ఉత్పత్తిని పెంచాలని యోచిస్తోందని కూడా నివేదిక‌లో చెప్పబడింది.

iPhone 14 సెప్టెంబర్ 16న అమ్మకానికి రానుంది!
Apple ఒక‌వేళ అధికారికంగా iPhone 14 సిరీస్‌ను సెప్టెంబర్ 6వ తేదీన లాంచ్ చేస్తే, అధికారికంగా ప్రారంభించిన 10 రోజుల తర్వాత స్మార్ట్‌ఫోన్‌లు సెప్టెంబర్ 16 నుండి భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా విక్రయించబడతాయని తెలుస్తోంది. iPhone 14 సిరీస్‌తో పాటు, Apple Watch Series 8 మరియు 10th Gen Apple iPad వంటి పరికరాలు కూడా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.

iphone 14

ధ‌ర‌లు ఎలా ఉండ‌బోతున్నాయి!
ఇటీవలి ఊహాగానాల ప్రకారం, iPhone 14 ధర iPhone 13 మాదిరిగానే ఉంటుందని అంచనా వేయబడింది. కంపెనీ ఇప్పుడు iPhone 14ని భారతదేశంలో తయారు చేస్తున్నందున, ఐఫోన్ 13 లాంచ్ ధరతో పోల్చినప్పుడు.. iPhone 14 ను కొంచెం తక్కువ ధరకు లాంచ్ చేయవచ్చు అని అంతా భావిస్తున్నారు.

iPhone 14 మరియు iPhone 14 Max మోడ‌ల్స్‌ A15 బయోనిక్ ద్వారా శక్తిని పొందుతాయని స‌మాచారం, అయితే ఖరీదైన iPhone 14 Pro మరియు iPhone 14 Pro Max మరింత శక్తివంతమైన A16 బయోనిక్ చిప్‌తో LPDDR5 ర్యామ్‌తో వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, Apple స‌ప్లై చైన్‌ స్వల్పంగా దెబ్బతింది. అయినప్పటికీ, 2022 పండుగ సీజన్‌ల కోసం కొత్త ఐఫోన్‌ల స్థిరమైన సరఫరాను నిర్ధారించడానికి యాపిల్ కంపెనీ పుష్కలమైన‌ బ్యాకప్ ప్లాన్‌లను రూపొందించిన‌ట్లు తెలుస్తోంది.

iphone 14

మ‌రోవైపు భార‌త్‌లో భారీగా పెరిగిన ఐఫోన్ల అమ్మ‌కాలు!

భార‌త మార్కెట్లో Apple కంపెనీ ఉత్ప‌త్తుల‌కు డిమాండు క్ర‌మ‌క్ర‌మంగా భారీగా పెరుగుతోంది. అందుకు ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఆ కంపెనీ iPhones అమ్మ‌కాలే ఉదాహ‌ర‌ణ‌. భార‌త మార్కెట్లో Apple ఈ ఏడాది సెకండ్ క్వార్ట‌ర్‌లో 1.2 మిలియ‌న్ ఐఫోన్ల‌ను అమ్మ‌డం విశేషం. దీంతో ఆ కంపెనీ సేల్స్ దాదాపు 94శాతం వృద్ధిని సాధించిన‌ట్లు తాజా గ‌ణాంకాలు తెలియ‌జేస్తున్నాయి. ఈ మేర‌కు ప్ర‌ముఖ మార్కెట్ ఇంటెలిజెన్స్ కంపెనీ సైబ‌ర్ మీడియా రీసెర్చ్ విడుద‌ల చేసిన నివేదిక‌ గ‌ణాంకాలు పేర్కొన్నాయి. iPhone 12, iPhone 13 స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలే ఈ స్థాయిలో వృద్ధికి కార‌ణ‌మైన‌ట్లు నివేదిక వెల్ల‌డించింది.

"ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో Apple అద్భుతమైన వృద్ధితో కొనసాగుతోంది. ఇందుకు ఆ కంపెనీ స్థానికంగా ఐఫోన్ తయారీని పెంచడం కూడా కార‌ణ‌మే అని చెప్పొచ్చు. iPhone 13 సిరీస్‌తో పాటు iPhone 12 సిరీస్ భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అత్యధికంగా స‌ర‌ఫ‌రా(షిప్‌మెంట్‌) అయ్యాయి." అని సిఎంఆర్ హెడ్-ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ (ఐఐజి) ప్రభు రామ్ చెప్పారు. మొత్తం స‌ర‌ఫ‌రా చేయబడిన ఐఫోన్లలో దాదాపు 1 మిలియన్ మొబైల్స్ 'మేక్ ఇన్ ఇండియా" డివైజులుగా నివేదిక పేర్కొంది.

iphone 14

Apple కు చెందిన iPad డివైజ్‌లు కూడా భారతదేశంలో మంచి అమ్మ‌కాల‌ను న‌మోదు చేశాయి. వీటి అమ్మ‌కాల్లో దాదాపు 34 శాతం వృద్ధి (సంవత్సరానికి) నమోదైంది. కంపెనీ దేశంలో 0.2 మిలియన్ పరికరాలను విక్రయించింది. "Q2 డేటా ప్రకారం, Apple iPad (Gen 9), iPad Air 2022 లు షిప్‌మెంట్‌లలో సింహభాగం వాటాను కలిగి ఉన్నాయి" అని నివేదిక పేర్కొంది.

భారతదేశంలోస్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో ఐఫోన్లు 4శాతం వాటాను క‌లిగి ఉన్న‌ట్లు సీఎంఆర్ అంచ‌నా వేసింది. అదే స‌మ‌యంలో, ఐప్యాడ్‌లు సంబంధిత విభాగంలో 20 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్న‌ట్లు అంచనా వేసింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, రూపాయి బలహీనపడటం మరియు వినియోగదారుల డిమాండ్ మెల్లగా ఉండటం వల్ల భారతదేశంలోని ప్ర‌స్తుతం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లకు పర్యావరణం కాస్త కఠినంగానే కొనసాగుతోందని పేర్కొంది. భారతదేశంలో Apple యొక్క మెరుగైన‌ మరియు వైవిధ్యమైన iPhone ఉత్పత్తి సామర్థ్యాలు దాని పటిష్టతకు దోహదం చేస్తూనే ఉన్నాయని.. అందుకే భారతదేశంలో ఐఫోన్ అమ్మ‌కాల్లో వృద్ధి ఊపందుకుందని సీఎంఆర్ పేర్కొంది.

Best Mobiles in India

English summary
iPhone 14 Could Launch On September 6th Along With Apple Watch Series 8

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X