Home
News

iPhone 13 కన్నా iPhone 14 కు భారీగా డిమాండ్ ఉండ‌బోతోందా!

యూఎస్‌కు చెందిన ప్ర‌ముఖ మొబైల్ తయారీ సంస్థ యాపిల్ త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌బోయే ఐఫోన్ 14 కు చైనాలో భారీగా డిమాండ్ ఉండ‌బోతోంద‌ట‌. ఐఫోన్ 13 తో పోలిస్తే ఐఫోన్ 14కు చైనా మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంద‌ని టెక్ విశ్లేష‌కుడు మింగ్ చి కువో తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. డిమాండ్‌ను ముందుగా గుర్తించిన ప‌లువురు చైనీస్ డిస్ట్రిబ్యూటర్‌లు, రిటైలర్లు ముంద‌స్తుగా త‌గినంత స‌ప్లై కోసం అధిక డిపాజిట్లు చేస్తున్న‌ట్లు కువో త‌న స‌ర్వే ద్వారా తెలిసిన‌ట్లు పేర్కొన్నారు.

కొత్త iPhone 14 స్మార్ట్‌ఫోన్ 3,279mAh బ్యాటరీతో వస్తుందని, మరియు iPhone 14 Pro 3,200mAh బ్యాటరీతో రావ‌చ్చ‌ని ఇటీవలి నివేదిక లీకులిచ్చింది. అంతేకాకుండా ఇది ఐఓఎస్ 16 ఆధారంగా ప‌ని చేస్తుంద‌ని స‌మాచారం. కాబ‌ట్టి, ఐఫోన్ 14కు దాని ముందున్న iPhone 13 కంటే చైనా మార్కెట్లో బలమైన డిమాండ్ ఉండ‌నున్న‌ట్లు కువో స‌ర్వే తెలిపింది. ఈ క్ర‌మంలోనే ప‌లువురు చైనీస్ డిస్ట్రిబ్యూటర్‌లు, రిటైలర్లు త‌గినంత స‌ప్లై కోసం ముంద‌స్తుగా అధిక డిపాజిట్లు చేస్తున్న‌ట్లు కువో త‌న స‌ర్వే ద్వారా తెలిసిన‌ట్లు పేర్కొన్నారు.

అత్య‌ధికంగా ప్రీపెయిడ్ డిపాజిట్లు:

అత్య‌ధికంగా ప్రీపెయిడ్ డిపాజిట్లు:

ఇప్ప‌టికే, ప్రస్తుతం iPhone 14 కు ప్రీపెయిడ్ డిపాజిట్, iPhone 13 కంటే చాలా ఎక్కువగా ఉందని, ఇది చైనాలోని కొన్ని ప్రాంతాలలో సాధారణ ప్రీపెయిడ్ మొత్తం కంటే రెండింతలు ఎక్కువగా ఉంటుందని కువో తెలిపారు. కాంపోనెంట్ సరఫరాదారుల ఐఫోన్ 14 షిప్‌మెంట్ అంచనా సుమారు 100 మిలియన్ యూనిట్లు ఉన్న‌ట్లు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంతేకాకుండా EMS 90 మిలియన్ యూనిట్లు ఉంటుంద‌ని విశ్లేషకుడు చెప్పారు.

బ్యాట‌రీనే కీల‌కం:

బ్యాట‌రీనే కీల‌కం:

ఈ ఫోన్ గురించి గ‌తంలో విడుద‌లైన నివేదిక ప్రకారం, iPhone 14 సిరీస్ iPhone 13 సిరీస్ కంటే మ‌రింత సామ‌ర్థ్యం ఉన్న బ్యాట‌రీల‌తో వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. iPhone 14 కు 3,279mAh బ్యాటరీతో లాంచ్ చేయబడుతుందని మరియు iPhone 14 Pro మొబైల్‌కు 3,200mAh బ్యాటరీ ఉంటుంద‌ని నివేదిక పేర్కొంది. iPhone 14 Max హ్యాండ్‌సెట్‌కు 4,325mAh బ్యాటరీని పొందుతుందని మరియు మరోవైపు, iPhone 14 Pro Max స్మార్ట్‌ఫోన్‌కు 4,323mAh బ్యాటరీని కలిగి ఉంటుందని నివేదిక లీకుల ద్వారా తెలుస్తోంది.

గ‌త ఏప్రిల్ లో గ్లోబ‌ల్ టాప్ సెల్లింగ్ మొబైల్‌గా iPhone 13 :

గ‌త ఏప్రిల్ లో గ్లోబ‌ల్ టాప్ సెల్లింగ్ మొబైల్‌గా iPhone 13 :

గ్లోబ‌ల్ మార్కెట్లో గ‌త ఏప్రిల్‌లో ఎక్కువ‌గా అమ్ముడైన స్మార్ట్ ఫోన్ల‌లో యాపిల్ కంపెనీ తొలి స్థానం సాధించ‌డం విశేషం. యాపిల్ సంస్థ‌కు చెందిన iPhone 13 గ‌త ఏప్రిల్‌లో గ్లోబ‌ల్‌గా అత్య‌ధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ల జాబితాలో తొలి స్థానం పొందింది. ఈ మేర‌కు కౌంట‌ర్‌పార్ట్ అనే సంస్థ ఓ నివేదిక‌లో వెల్ల‌డించింది. ఇత‌ర టెక్ దిగ్గ‌జాల‌తో పోలిస్తే ఏప్రిల్ నెల‌లో యాపిల్ సంస్థ అత్య‌ధిక ఫోన్లు అమ్ముడైన‌ట్లు ఆ నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో షావోమీ, శాంసంగ్ మొబైల్ కంపెనీల పేర్లు కూడా ఉన్నాయి. కాక‌పోతే, యాపిల్ గ‌తేడాది మాదిరిగానే తొలి స్థానం సాధించ‌డం విశేషం. ఈ ఏడాది మార్చిలో అన‌గా 2022 మొదటి త్రైమాసికంలో కూడా ఐఫోన్ 13 మ్యాక్స్ మరియు ఐఫోన్ 13 అత్యధికంగా అమ్ముడైన డివైజ్‌లుగా ఉన్నాయని వెల్లడించింది.

యాపిల్‌కు చెందిన మొత్తం ఐదు మోడ‌ల్స్ టాప్ సెల్లింగ్ జాబితాలో ఉన్నాయి. ఐఫోన్ 13 గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 5.5 శాతం వాటాతో జాబితాలో అగ్రస్థానంలో ఉంది. భారతదేశంలో iPhone 13 Pro Max ప్రారంభ ధర రూ. 1,27,900 వద్ద విక్రయిస్తోంది. అదేవిధంగా దేశంలో స్టాండ‌ర్ట్‌ iPhone 13 రూ.72,990కి అందుబాటులో ఉంది. జాబితాలోని మిగిలిన డివైజ్‌లు iPhone 13 Pro, iPhone 12 మరియు iPhone SE 2022 లు ఉన్నాయి. Apple iPhone SE 2022 మోడల్‌కి సంబంధించి సమీక్షకుల నుండి మంచి స్పంద‌న రాలేదని తెలుస్తోంది. iPhone SE 2022 టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ ఫోన్‌ల లిస్ట్‌లో 7వ స్థానంలో ఉంది.

ఏప్రిల్ నెల మొత్తం అమ్మకాలలో యాపిల్ సంస్థ‌ 89 శాతం వాటాను కలిగి ఉంది, ఈక్ర‌మంలో శాంసంగ్ సంస్థ‌ టాప్ మోడల్స్ మొత్తం అమ్మకాలలో కేవలం 22 శాతం మాత్రమే ఉండ‌టం గ‌మ‌నార్హం.

iPhone 13 స్పెసిఫికేషన్స్:

iPhone 13 స్పెసిఫికేషన్స్:

ఆపిల్ ఐఫోన్13 మోడల్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ మొబైల్ కు 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR పానెల్ డిస్‌ప్లేను క‌లిగి ఉంది. ఇది A15 బ‌యోనిక్ చిప్‌ను క‌లిగి ఉంది. ఇది 4జీబీ ర్యామ్, 512జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఐఓఎస్‌ 15 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 3240mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Best Mobiles in India

English summary
iPhone 14 Demand Likely to Be Higher Than iPhone 13 in China: Ming-Chi Kuo
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X