Home
News

ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌.. ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్‌పై బెస్ట్‌ డిస్కౌంట్‌.. ఆఫర్‌ ఎప్పటి వరకు ఉందంటే?

ఆపిల్‌ ఐఫోన్‌ 14 ను (iPhone 14) ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బచత్‌ ధమాల్‌ సేల్‌ లో భాగంగా ఐఫోన్‌ 14 తగ్గింపు ధరను పొందింది. ఐఫోన్‌ 15 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ఐఫోన్ 14 మోడల్‌ ఆకర్షణీయ తగ్గింపును పొందింది. తాజా సేల్‌లో మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్‌ 14లో లాంచ్‌ అయింది. విడుదల సమయంలో ఈ హ్యాండ్‌సెట్‌ ప్రారంభ ధర రూ.79900గా ఉంది. అయితే ఐఫోన్‌ 15 విడుదల తర్వాత ఐఫోన్ 14 ధర రూ.10000 తగ్గింది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌లో భాగంగా ఈ ఐఫోన్‌ 14 ధర ప్రస్తుతం రూ.59900గా ఉంది. బ్యాంగ్ ఆఫ్‌ బరోడా క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1500 తగ్గింపు పొందవచ్చు. ఫలితంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.58499కు సొంతం చేసుకోవచ్చు.

flipkart 2024

రూ.38,199 ధరకే కొనుగోలు చేయవచ్చు..! : ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బచత్‌ ధమాల్‌ సేల్‌లో (Flipkart Big Bachat Dhamaal Sale 2024) భాగంగా ఆకట్టుకొనే ఎక్స్చేంజీ ఆఫర్‌ను ప్రకటించింది. పాత ఫోన్లను ఎక్చ్సేంజీ చేయడం ద్వారా రూ.20,300 వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్ల అన్నింటితో కలిపి ఐఫోన్‌ 14 స్మార్ట్‌ఫోన్‌ను రూ.38,199కే కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌ ఇవాళ ప్రారంభం కాగా జనవరి 7 వరకు అందుబాటులో ఉంటుంది.

ఐఫోన్ 14 హ్యాండ్‌సెట్ 6.1 అంగుళాల సూపర్‌ రెటీనా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఐఫోన్ 14.. 1200 nits గరిష్ఠ బ్రైట్‌నెస్‌ సహా డాల్బీ విజన్‌ సపోర్టుతో వస్తుంది. ఆపిల్‌ A15 బయోనిక్ SoC చిప్‌ పైన పనిచేస్తుంది. ప్రారంభంలో ఈ ఫోన్‌ అమ్మకాలు ఆశాజనకంగా లేకున్నా.. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ సేల్‌ ద్వారా అమ్మకాలను గణనీయంగా పెంచారు.

flipkart 2024

డ్యూయల్‌ కెమెరా : ఈ హ్యాండ్‌ సెట్ 12MP వైడ్‌ యాంగిల్‌ కెమెరా మరియు 12MP.. 120 డిగ్రీల అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ను కలిగి ఉంటుంది. ముందువైపు 12MP ట్రూడెప్త్‌ సెన్సార్‌తో వస్తుంది. ఈ ఫోన్ ముందువైపు ప్లాట్ ఎడ్జ్‌ ఏరోస్పేస్‌ గ్రేడ్‌ అల్యూమినియం ప్రేమ్‌ సహా సిరామిక్ మెటీరియల్‌ను కలిగి ఉంటుంది. మరియు IP68 డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌ రేటింగ్‌తో రానుంది.

బ్యాటరీ సామర్థ్యం సహా లభ్యత : ఐఫోన్‌ 14 స్మార్ట్‌ఫోన్‌ 3279mAh బ్యాటరీ ప్యాక్‌తో ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో రానుంది. మరియు 128GB, 256GB, 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. మిడ్‌నైట్‌, పర్పల్‌, స్టార్‌లైట్‌, బ్లూ, రెడ్‌, పసుపు రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
iPhone 14 discount on flipkart big bachat dhamaal sale 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X