రాబోయే iPhone 14 సిరీస్ గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా!

|

Apple కంపెనీ నుంచి iPhone 14 సిరీస్‌ విడుద‌ల కోసం టెక్ ప్రియులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా, ఇప్పుడు ఆ iPhone 14 గురించి ప‌లు ఆస‌క్తిక‌ర వివ‌రాలు వెల్ల‌డ‌య్యాయి. iPhone 14, iPhone 14 Max స్మార్ట్‌ఫోన్ల‌లో పాత A15 చిప్‌సెట్‌నే ఉప‌యోగిస్తున్న‌ప్ప‌టికీ.. పర్ఫార్మెన్స్ ప‌రంగా ఈ మొబైల్స్ అద్భుతమైన ప‌నితీరు క‌న‌బ‌రుస్తాయట‌. కొత్త సెల్యులార్ మోడెమ్ మరియు కొత్త అంతర్గత డిజైన్ కారణంగానే ఇది సాధ్యమవుతుందని టిప్‌స్ట‌ర్ నివేదిక ద్వారా వెల్ల‌డైంది.

 
రాబోయే iPhone 14 సిరీస్ గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా!

రాబోయే నాన్ ప్రో మోడ‌ల్స్ లో మెరుగైన ప‌నితీరు:
ఐఫోన్ 13 సిరీస్ మాదిరిగానే.. రాబోయే ఐఫోన్ 14 మరియు ఐఫోన్ 14 మాక్స్ మొబైల్స్‌ A15 బ‌యోనిక్ చిప్‌ని కలిగి ఉన్నప్పటికీ.. ప‌నితీరులో మాత్రం మెరుగుద‌ల క‌న‌బ‌రుస్తాయ‌ని టిప్‌స్ట‌ర్ నివేదిక పేర్కొంది. కొత్త సెల్యులార్ మోడెమ్ మరియు కొత్త అంతర్గత డిజైన్ కారణంగానే ఇది సాధ్యమవుతుందని నివేదిక వెల్ల‌డించింది. అంతేకాకుండా, రాబోయే ఐఫోన్ 14 సిరీస్‌లోని నాన్‌-ప్రో మోడ‌ల్స్ 6GB RAM తో వ‌స్తాయ‌ని భావిస్తున్న‌ట్లు నివేదిక వెల్ల‌డించింది.

ప్రో మోడ‌ల్స్‌లోనే కొత్త చిప్‌సెట్‌:
యాపిల్ కంపెనీ, నాన్-ప్రో మోడల్‌లలో A15 బయోనిక్ చిప్‌సెట్‌ను, iPhone 14 Pro మరియు iPhone 14 Pro Maxల‌లో A16 బయోనిక్ చిప్‌లను ఉపయోగిస్తుందని ఇప్ప‌టికే ప‌లు నివేదికలు లీకులిచ్చిన విష‌యం తెలిసిందే. ప్రో మోడల్‌లు వేగవంతమైన మరియు మరింత శక్తి సామర్థ్యం క‌లిగిన‌ LPDDR5 ర్యామ్‌తో వస్తాయని మరియు నాన్-ప్రో వేరియంట్‌లు 6GB LPDDR4X RAMతో వస్తాయని కూడా వెల్ల‌డించింది.

రాబోయే iPhone 14 సిరీస్ గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా!

భార‌త్‌లో ఐఫోన్ 14 సిరీస్ ధ‌ర‌లు ఎంత ఉండ‌నున్నాయి:
తాజా లీకుల ప్ర‌కారం.. ఐఫోన్ 14 బేస్ మోడ‌ల్‌కు సంబంధించి ధ‌ర ఐఫోన్ 13 మాదిరిగానే ఉండ‌నుంది. 128GB అంతర్గత నిల్వతో iPhone 14 యొక్క బేస్ మోడల్ ధర సుమారు రూ. 79,900 ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అదేవిధంగా, iPhone 14 Pro మరియు iPhone 14 Pro Max ధర భారతదేశంలో రూ.1,10,000 ఉండొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. ప్రో మోడల్‌లు హై-రిజల్యూషన్ ఉన్న ప్రైమరీ కెమెరా మరియు మెరుగైన టెలిఫోటో/జూమ్ లెన్స్‌తో వెనుకవైపు మెరుగైన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయని కూడా భావిస్తున్నారు.

Apple iPhone 14 విడుద‌ల ఎప్పుడంటే:
యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ మొబైల్స్ ను కంపెనీ సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌నుంది. కంపెనీ కనీసం నాలుగు కొత్త ఐఫోన్‌లను విడుదల చేస్తుందని భావిస్తున్నారు. వాటిలో iPhone 14, iPhone 14 Max, iPhone 14 Pro మరియు iPhone 14 Pro Max ఉండ‌నున్నాయి.

రాబోయే iPhone 14 సిరీస్ గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా!

మ‌రోవైపు భార‌త్‌లో భారీగా పెరిగిన ఐఫోన్ల అమ్మ‌కాలు!
భార‌త మార్కెట్లో Apple కంపెనీ ఉత్ప‌త్తుల‌కు డిమాండు క్ర‌మ‌క్ర‌మంగా భారీగా పెరుగుతోంది. అందుకు ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఆ కంపెనీ iPhones అమ్మ‌కాలే ఉదాహ‌ర‌ణ‌. భార‌త మార్కెట్లో Apple ఈ ఏడాది సెకండ్ క్వార్ట‌ర్‌లో 1.2 మిలియ‌న్ ఐఫోన్ల‌ను అమ్మ‌డం విశేషం. దీంతో ఆ కంపెనీ సేల్స్ దాదాపు 94శాతం వృద్ధిని సాధించిన‌ట్లు తాజా గ‌ణాంకాలు తెలియ‌జేస్తున్నాయి. ఈ మేర‌కు ప్ర‌ముఖ మార్కెట్ ఇంటెలిజెన్స్ కంపెనీ సైబ‌ర్ మీడియా రీసెర్చ్ విడుద‌ల చేసిన నివేదిక‌ గ‌ణాంకాలు పేర్కొన్నాయి. iPhone 12, iPhone 13 స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలే ఈ స్థాయిలో వృద్ధికి కార‌ణ‌మైన‌ట్లు నివేదిక వెల్ల‌డించింది.

 

"ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో Apple అద్భుతమైన వృద్ధితో కొనసాగుతోంది. ఇందుకు ఆ కంపెనీ స్థానికంగా ఐఫోన్ తయారీని పెంచడం కూడా కార‌ణ‌మే అని చెప్పొచ్చు. iPhone 13 సిరీస్‌తో పాటు iPhone 12 సిరీస్ భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అత్యధికంగా స‌ర‌ఫ‌రా(షిప్‌మెంట్‌) అయ్యాయి." అని సిఎంఆర్ హెడ్-ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ (ఐఐజి) ప్రభు రామ్ చెప్పారు. మొత్తం స‌ర‌ఫ‌రా చేయబడిన ఐఫోన్లలో దాదాపు 1 మిలియన్ మొబైల్స్ 'మేక్ ఇన్ ఇండియా" డివైజులుగా నివేదిక పేర్కొంది.

రాబోయే iPhone 14 సిరీస్ గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా!

Apple కు చెందిన iPad డివైజ్‌లు కూడా భారతదేశంలో మంచి అమ్మ‌కాల‌ను న‌మోదు చేశాయి. వీటి అమ్మ‌కాల్లో దాదాపు 34 శాతం వృద్ధి (సంవత్సరానికి) నమోదైంది. కంపెనీ దేశంలో 0.2 మిలియన్ పరికరాలను విక్రయించింది. "Q2 డేటా ప్రకారం, Apple iPad (Gen 9), iPad Air 2022 లు షిప్‌మెంట్‌లలో సింహభాగం వాటాను కలిగి ఉన్నాయి" అని నివేదిక పేర్కొంది.

భారతదేశంలోస్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో ఐఫోన్లు 4శాతం వాటాను క‌లిగి ఉన్న‌ట్లు సీఎంఆర్ అంచ‌నా వేసింది. అదే స‌మ‌యంలో, ఐప్యాడ్‌లు సంబంధిత విభాగంలో 20 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్న‌ట్లు అంచనా వేసింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, రూపాయి బలహీనపడటం మరియు వినియోగదారుల డిమాండ్ మెల్లగా ఉండటం వల్ల భారతదేశంలోని ప్ర‌స్తుతం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లకు పర్యావరణం కాస్త కఠినంగానే కొనసాగుతోందని పేర్కొంది. భారతదేశంలో Apple యొక్క మెరుగైన‌ మరియు వైవిధ్యమైన iPhone ఉత్పత్తి సామర్థ్యాలు దాని పటిష్టతకు దోహదం చేస్తూనే ఉన్నాయని.. అందుకే భారతదేశంలో ఐఫోన్ అమ్మ‌కాల్లో వృద్ధి ఊపందుకుందని సీఎంఆర్ పేర్కొంది.

Best Mobiles in India

English summary
iPhone 14, iPhone 14 Max Tipped to Get Performance Boost Over iPhone 13 Owing to New Internal Design

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X