ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్.. ఐఫోన్ 14 ప్లస్ ఫోన్‌ను రూ.50,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు..!!
ఐఫోన్ ను కొనుగోలు చేయాలనుకొనే వారికి ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఆకట్టుకొనే ఆఫర్‌ను ప్రకటన చేసింది. ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus) హ్యాండ్‌సెట్‌ను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. భారీ డిస్‌ప్లే కలిగిన కొత్త ఐఫోన్లు కొనుగోలు చేయాలని భావించే వారు ఈ ఐఫోన్ 14 ప్లస్‌ను కొనుగోలు చేయవచ్చు. 6.7 అంగుళాల భారీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
ఐఫోన్ 14 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.79,000 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఈ హ్యాండ్‌సెట్‌పై 16 శాతం డిస్కౌంట్‌ను (iPhone 14 Plus Discount Price 2024) ప్రకటన చేసింది. ఫలితంగా ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ.66,999 గా ఉంది. దీంతోపాటు ఎక్స్చేంజీ ఆఫర్ ద్వారా మరింత తగ్గింపును పొందే అవకాశం కల్పించింది.

ఐఫోన్ 14 ప్లస్ ధర రూ.44,297..! :
ఐఫోన్ 13 లేదా మిని ఐఫోన్ 13 ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.23,000 వరకు తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఐఫోన్ 14 ప్లస్ ధర రూ.44,297 కే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజీ ఆఫర్ ద్వారా ఈ ప్లస్ మోడల్ కొనుగోలుపై రూ.35,603 ఆదా చేయవచ్చు.
ఐఫోన్ 14 ప్లస్ స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 14 ప్లస్ 6.7 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 1284*2778 పిక్సల్ రిజల్యూషన్‌తో వచ్చింది. 1200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ సిరామిక్ షీల్డ్ గ్లాస్ రక్షణను కలిగి ఉంది.

ఈ ఐఫోన్ 14 ప్లస్ మోడల్ 5nm A15 బయోనిక్ చిప్‌సెట్‌పైన పనిచేస్తోంది. హెక్సా కోర్ CPU మరియు ఆపిల్ GPU కోర్ గ్రాఫిక్స్ తో జతచేయబడుతుంది. ఈ ఫోన్ 6GB ర్యామ్‌తో 128GB, 256GB, 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
ఈ ప్లస్ మోడల్ వెనుకవైపు డ్యూయల్ 12MP కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ కెమెరాలు OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఫీచర్ మరియు ఆల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. దీంతోపాటు డ్యూయల్ LED ఫ్లాష్ లైట్లను కలిగి ఉంది. ముందువైపు 12MP సెల్ఫీ కెమెరాతో వచ్చింది. కెమెరాల ద్వారా 4K వీడియోలను రికార్డు చేయవచ్చు.
ఐఫోన్ 14 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 15W ఛార్జింగ్ సపోర్టుతో 4,352mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ IP68 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌తో వచ్చింది. సింగిల్ ఛార్జింగ్‌తో 26 గంటల వరకు బ్యాటరీ టైం వస్తుందని ఆపిల్ చెబుతోంది. మరియు స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది.
కనెక్టివిటీ పరంగా వైఫై 802, బ్లూటూత్ 5.3 సపోర్టుతో వస్తుంది. మరియు ఫేసే ఐడీ, యాక్సిలిరో మీటర్, గైరో, ప్రాక్సిమిటీ, కంపాస్, బారోమీటర్ సెన్సార్లను కలిగి ఉంది. మరియు లైటినింగ్ USB 2.0 పోర్టును కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్టార్ లైట్, మిడ్‌నైట్, బ్లూ, పర్పల్ మరియు రెడ్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








