Home
News

ఈ లేటెస్ట్ ఐఫోన్ పై రూ.12000 డిస్కౌంట్! మళ్ళీ, బ్యాంకు ఆఫర్లు కూడా ..! 

By Maheswara

మీరు కొత్త ఐఫోన్ ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే, మీరు ఐఫోన్ 14 ప్లస్‌ని కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపించవచ్చు. ఎందుకంటే, ఇదే ఫోన్‌ను కొనుగోలు చేయడానికి సమయం అవుతుంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌ ఫోన్ పై రూ.12000 ఫ్లాట్ తగ్గింపును అందిస్తోంది.

ఫ్లిప్కార్ట్ లో ఈ ఆఫర్లకు అదనంగా, మీరు బ్యాంక్ ఆఫర్‌లను కూడా ప్రత్యేకంగా పొందవచ్చు. దీని ద్వారా ఐఫోన్ 14 ప్లస్‌ ధర మరింత తగ్గించవచ్చు. ఐఫోన్ 14 ప్లస్ బేస్ 128GB వేరియంట్‌అసలు ధర రూ.89,999 నుంచి మొదలవుతుంది. ఐఫోన్ 14 సిరీస్‌కి ప్లస్ వేరియంట్ సరికొత్త అదనపు ఆకర్షణగా ఉంది. మునుపటి ఐఫోన్ సిరీస్‌లో, ఆపిల్ ఐఫోన్ 13 మినీ ని కూడా లాంచ్ చేసింది.

iPhone 14 Plus Now Available At Discount of Rs.12000 On Flipkart Sale. Check Offer Price Details Here.

కానీ, ఆపిల్ ఐఫోన్ 13 మినీ కొనుగోలుదారులను ఆకర్షించడంలో విఫలమైంది. దీని కారణంగా కొత్తగా వచ్చిన ఐఫోన్ 14 సిరీస్‌లో, మినీ వెర్షన్ బదులు ఆపిల్ ప్లస్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఐఫోన్ 14కి సమానంగా ఉంటుంది కానీ పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ లో ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ పై ఉన్న ఆఫర్ వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.

ఐఫోన్ 14 ప్లస్‌ ఆఫర్ డీల్ ఎలా పనిచేస్తుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ఐఫోన్ 14 ప్లస్ యొక్క 128GB వేరియంట్ అసలు ధర రూ.89,999 గా ఉంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లో భాగంగా రూ.12,000 ఫ్లాట్ తగ్గింపును అందిస్తోంది. కాబట్టి ఈ ఫోన్ 128GB వేరియంట్ ప్రస్తుతం రూ.77,999 ధరకు సేల్ చేయబడుతోంది.

ఇంకా ఈ ధర పై అదనంగా, మీరు HDFC డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ కలిగి ఉంటే, మీరు రూ. 4000 తగ్గింపు ఆఫర్ ను కూడా పొందవచ్చు. ఈ ధరను ఇంకా తగ్గించాలంటే, మీరు మీ పాత ఫోన్‌ లను ఎక్స్చేంజి కూడా చేయవచ్చు.

ఐఫోన్ 14 ప్లస్ స్పెసిఫికేషన్ల వివరాలు,
ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 మాదిరిగానే అదే స్పెసిఫికేషన్లను కలిగి ఉంటుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లకు డిస్‌ప్లే పరిమాణంలో మాత్రమే ప్రధానంగా తేడా ఉంటుంది. ఇంకా, ఐఫోన్ 14 ప్లస్ మోడల్ 6.7 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేను కలిగి ఉంది. ఐఫోన్ 14 ప్లస్ పరిమాణం ఐఫోన్ 14 ప్రో మాక్స్ మాదిరిగానే ఉంటుంది. అయితే, ప్రో విస్తృత నాచ్‌ను కలిగి ఉంది మరియు డైనమిక్ ఐలాండ్ స్టైల్ నాచ్ కాదు. మీకు పెద్ద డిస్‌ప్లేతో ఐఫోన్ కొనాలనుకుంటే, ఐఫోన్ 14 ప్లస్ మీకు మంచి ఎంపిక ఆవుతుంది.

ఇక ఈ ఐఫోన్ 14 ప్లస్ యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే, ఇది A15 బయోనిక్ చిప్ సెట్ యొక్క మెరుగైన వెర్షన్ ని కలిగి ఉంటుంది. ఇక కెమెరా ఆప్టిక్స్ పరంగా వివరాలు గమనిస్తే, ఐఫోన్ 14 ప్లస్ 12 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమెరాతో పాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. కెమెరా పనితీరు మునుపటి వెర్షన్ లతో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది.

Best Mobiles in India

English summary
iPhone 14 Plus Now Available At Discount of Rs.12000 On Flipkart Sale. Check Offer Price Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X