Home
News

iphone 14 Pro Max స్మార్ట్‌ఫోన్‌ రికార్డు.. ఈ సంవత్సరం ఎక్కువ మంది కోరుకున్న ఫోన్‌ ఇదే..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఆపిల్‌ కీలక ఘనతను చోటుచేసుకుంది. 2023 సంవత్సరంలో ఇప్పటి వరకు ఆపిల్‌ ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ స్మార్ట్‌ఫోన్‌.. అత్యధిక షిప్‌మెంట్‌లు (డెలివరీ) కలిగి ఉందని ఓమ్డియా, టెక్నాలజీ రీసెర్చ్‌ గ్రూప్‌ నివేదిక తాజాగా వెల్లడించింది.

ఈ సంవత్సరంలో ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ 26.5 మిలియన్ల యూనిట్లకు పైగా షిప్పింగ్‌ చేసిందని ఈ నివేదిక పేర్కొంది. 2023 సంవత్సరంలో అత్యధిక విక్రయాలు నమోదు చేసింది. దీని తర్వాత ఐఫోన్‌ 14 ప్రో ఫోన్‌ 21 మిలియన్లతో రెండో స్థానంలో ఉంది. మూడు నాలుగు స్థానాల్లోనూ ఆపిల్‌ సంస్థకు చెందిన ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 13 ఉన్నాయి.

iPhone 14 Pro Max

ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 16.5 మిలియన్ల ఐఫోన్‌ 14 స్మార్ట్‌ఫోన్లు, 15.5 మిలియన్ల ఐఫోన్‌ 13 ఫోన్లను షిప్‌మెంట్‌ అయినట్లు తెలిపింది. ఆసక్తి కరంగా అత్యధికంగా షిప్‌మెంట్‌ అయిన టాప్‌ 10 ఫోన్లలో ఐఫోన్‌ 11 కూడా ఉంది. ఈ ఫోన్‌ 2019లో విడుదల అయింది. ఇప్పటి వరకు 6.9 మిలియన్ల ఐఫోన్‌ 11 ఫోన్లను విక్రయించింది.

ఈ జాబితాలో ఐఫోన్ల తర్వాత ఐదో స్థానంలో శాంసంగ్‌ గెలాక్సీ A14, గెలాక్సీ S23 ఆల్ట్రా, గెలాక్సీ A14 5G, గెలాక్సీ A54 5G, గెలాక్సీ A34 5G స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. శాంసంగ్‌ తన తాజా ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ గెలాక్సీ S23 ఆల్ట్రా ఫోన్లు 9.6 మిలియన్‌ యూనిట్లు అమ్ముడయ్యాయి. అదే విధంగా 12.4 మిలియన్లు గెలాక్సీ A14 స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించింది.

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌కు కొంచెం డిమాండ్‌ తగ్గిందని కొన్ని నివేదికలు పేర్కొంటున్నా.. హై ఎండ్‌ ఫ్లాగ్‌షిప్‌ మోడళ్లకు అధిక డిమాండ్‌ కొనసాగుతోంది. త్వరలో లాంచ్‌ కానున్న ఐఫోన్‌ 15 సీరిస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరల పెంపు కూడా ఇందుకు ఓ కారణమని తెలిస్తోంది.

ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ 2022 సెప్టెంబర్‌ 16న విడుదల అయింది. ఈ ఫోన్ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1290*2796 పిక్సల్‌ రిజల్యూషన్‌తో వస్తుంది. సిరామిక్‌ షీల్డ్‌ గ్లాస్‌ ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఆపిల్‌ A16 బయోనిక్‌పై పనిచేస్తుంది. 240 గ్రాముల బరువు ఉంటుంది.

ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ 6GB ర్యామ్‌+ 128GB అంతర్గత స్టోరేజీ, 6GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ, 6GB ర్యామ్‌ +512GB అంతర్గత స్టోరేజీ, 6GB ర్యామ్‌+1TB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ వెనుకవైపు f/1.8 అపేచర్‌తో 48MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. 12MP+12MP మరో రెండు కెమెరాలను కూడా కలిగి ఉంటుంది. ముందువైపు 12MP కెమెరా ఉంటుంది.

ఈ ఫోన్ iOS 16 ఆధారంగా పనిచేస్తుంది. స్పేస్‌ బ్లాక్‌, సిల్వర్‌, గోల్డ్‌, డీప్‌ పర్పల్‌ రంగుల్లో లభిస్తుంది. IP68 డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌తో వస్తుంది. దీంతోపాటు Wi-Fi, లైటినింగ్‌ సెన్సార్లు, యాక్సిలిరోమీటర్‌, యాంబియంట్‌ లైట్‌ సెన్సార్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌, మాగ్నిటో మీటర్‌ సెన్సార్‌లను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.127,999గా ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
iphone 14 Pro Max is the most shipped smartphone in 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X