Just In
- 8 hrs ago
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- 10 hrs ago
వివో X90 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయింది! ధర ,స్పెసిఫికేషన్లు!
- 14 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు
- 1 day ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
Don't Miss
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- News
అగ్నివీరుల కోసం ఇకపై కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్: పాన్ ఇండియా రిక్రూట్మెంట్స్: ఆర్మీ ప్రకటన
- Movies
Writer Padmabhushan Day 2 collections రెండో రోజు పెరిగిన కలెక్షన్లు.. సుహాస్ మూవీకి భారీ రెస్పాన్స్
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఆగస్టులో భారీగా iPhone 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తి ప్రారంభం!
iPhone 14 సిరీస్‌కు సంబంధించి యాపిల్ కంపెనీ ట్రయల్ ఉత్పత్తి ప్రారంభించింది. ఆగస్టు నెలలో భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించడానికి కూడా సిద్ధమైంది. ఈ మేరకు పలు వార్తా నివేదికలు వెల్లడించాయి. రాబోయే iPhone 14 సిరీస్ లోని iPhone 14, iPhone 14 మాక్స్, iPhone 14 ప్రో మరియు iPhone 14 ప్రో మాక్స్ మొబైల్స్, గతంలో విడుదలైన iPhone 13తో పోలిస్తే మెరుగైన ప్రారంభ అమ్మకాలను కలిగి ఉండనున్నట్లు కూడా నివేదిక పేర్కొంది.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ ఫోన్‌లు అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది. iPhone 14 మరియు iPhone 14 ప్రో ఒకే స్క్రీన్ పరిమాణాన్ని కలిగి ఉన్నాయని నివేదికల లీక్‌లు చెబుతున్నాయి. అంతేకాకుండా iPhone 14 ప్లస్ మరియు iPhone 14 ప్రో మాక్స్ కూడా ఒకే డిస్ప్లే పరిమాణాన్ని కలిగి ఉన్నాయని పేర్కొన్నాయి.
ఇందుకు సంబంధించి ITHome నివేదిక వెల్లడించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. iPhone 14 సిరీస్‌కు సంబంధించి యాపిల్ కంపెనీ ట్రయల్ ఉత్పత్తి ప్రారంభించింది. ఆగస్టు నెలలో భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించడానికి కూడా సిద్ధమైందని వెల్లడించింది. ఐఫోన్ 14 యొక్క ప్రారంభ అమ్మకాలు ఒక సంవత్సరం క్రితం ఐఫోన్ 13 కంటే ఎక్కువగా ఉంటాయని సరఫరాదారులు తెలిపారు. ఇంకా, Apple హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. గ్లోబల్‌గా పలు వ్యతిరేక పరిణామాల కారణంగా మొత్తం స్మార్ట్‌ఫోన్ డిమాండ్ తగ్గినప్పటికీ, జూలైలో ఐఫోన్ అమ్మకాలు బలంగా ఉన్నాయని ITHome నివేదిక తెలిపింది. అంతేకాకుండా, చాలా మంది వినియోగదారులు సెప్టెంబర్‌లో కొత్త మోడల్ iPhone విడుదల కొరకు వినియోగదారులు వేచి ఉన్నట్లు పేర్కొంది.

టిప్‌స్టర్ లీక్ చేసిన వివరాల ప్రకారం.. iPhone 14 సిరీస్ సెప్టెంబర్ 13న లాంచ్ అవుతుందని సమాచారం. iPhone 14 మరియు iPhone 14 Pro మొబైల్స్ 6.1-అంగుళాల డిస్‌ప్లేలను కలిగి ఉంటాయని.. iPhone 14 Max మరియు iPhone Pro Max - 6.7-అంగుళాలతో వస్తాయని లీకులిచ్చింది. ప్యానెల్లు. ప్రో మోడల్స్ అప్‌గ్రేడ్ చేసిన 48-మెగాపిక్సెల్ సెన్సార్ తో పెద్ద కెమెరా బంప్‌ను కలిగి ఉన్నాయని పేర్కొంది.
ఇక రాబోయే సిరీస్‌లో చిప్‌ల మార్పులపై టెక్ విశ్లేషకుడు మింగ్ కువో కూడా ఇదువరకే ఆసక్తి కర విషయాలు వెల్లడించారు. రాబోయే iPhone 14, iPhone 14 మాక్స్ రెండు మోడల్స్ కూడా iPhone 13 మాదిరి A15 బయోనిక్ చిప్‌తో రానున్నట్లు తెలుస్తోంది. యాపిల్ భవిష్యత్తులో కూడా ఇదే పద్దతి అవలంభించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో iPhone 15, iPhone 15 మాక్స్ లకు పాత A16 బయోనిక్ చిప్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఇక iPhone 15 ప్రో మోడల్స్ కు మళ్లీ కొత్త బయోనిక్ చిప్ A17 ను అందుబాటులోకి తేనుంది. ఈ పద్దతిని యాపిల్ ఎందుకు పాటిస్తోందంటే.. ఐఫోన్ ప్రియులు లేటెస్ట్ చిప్ సెట్ కలిగిన యాపిల్ మొబైల్ ను వినియోగించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ధర ఎక్కువ కలిగిన ప్రో మోడల్స్ కొనుగోలు చేయాల్సి వస్తుంది. చిప్‌సెట్ ధరలు తీవ్రంగా పెరిగిన క్రమంలోనే యాపిల్ సంస్థ ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

iPhone14 మ్యాక్స్ లీక్ స్పెసిఫికేషన్‌ల వివరాలు
iPhone14 మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ కి సంబందించిన స్పెసిఫికేషన్స్ వివరాలు లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ లీక్ సమాచారం ప్రకారం ఆపిల్ సంస్థ నుంచి రాబోయే ఐఫోన్ 14 మ్యాక్స్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.68-అంగుళాల ఫ్లెక్సిబుల్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 2,778×1,284 పరిమాణంలో 458 పిక్సెల్‌ల(PPI) సాంద్రతను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుత జెనరేషన్ A15 బయోనిక్ SoCతో రన్ అవుతూ 6GB LPDDR4X RAMతో జతచేయబడి వస్తుంది. ప్రస్తుతం అదే చిప్ తో ఐఫోన్13 సిరీస్ ఫోన్లు మరియు కొత్త ఐఫోన్ SE (2022) కూడా శక్తిని పొందుతున్నాయి. గత లీక్‌ల ప్రకారం ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్14 ప్రో మాక్స్ ఫోన్లు రెండు కూడా A16 బయోనిక్ SoCలతో శక్తిని పొందే అవకాశం ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470