Home
News

Filpkart Diwali Sale 2023.. ఐఫోన్‌ 14పై భారీ తగ్గింపు!

ప్రముఖ ఈ కామర్స్ ఫ్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart Diwali Sale 2023) రేపటి నుంచి ప్రారంభం కానున్న ఫెస్టివల్‌ సీజన్‌ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. దీపావళి సేల్‌లో భాగంగా ఐఫోన్‌ మోడళ్లను తక్కువ ధరకే అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది.

ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి సేల్‌లో భాగంగా ఐఫోన్‌ 14 (iPhone 14) బేస్‌ వేరియంట్ను రూ.49999కే కొనుగోలు చేయవచ్చని తెలిపింది. బ్యాంక్‌ ఆఫర్లు, ఇతర డిస్కౌంట్లతోనే ఈ ధరకు సొంతం చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్‌ను గత సంవత్సరం ఆపిల్‌ సంస్థ విడుదల చేసింది. విడుదల సమయంలో ఐఫోన్‌ 14 స్మార్ట్‌ఫోన్‌ 128GB స్టోరేజీ ధర రూ.79,900 ఉండేది.

iPhone 14

iPhone 14 @ రూ.49999కే..! : ఫ్లిప్‌కార్ట్‌ టీజర్ పేజీ ఆధారంగా ఐఫోన్‌ 14 బేస్‌ మోడల్‌.. రూ.54999కు అందుబాటులో ఉంది. SBI క్రెడిట్‌ కార్డు, ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ.4000 తగ్గింపును పొందుతారు. పాత ఫోన్‌ ఎక్స్చేంజ్‌పై అదనంగా రూ.1000 తగ్గింపును పొందుతారు. ఫలితంగా ఈ ఫోన్‌ ధర రూ.49999కే కొనుగోలు చేయవచ్చు.

దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ మరో ఆఫర్‌ను ఇచ్చింది. డౌన్‌ పేమెంట్ కింద రూ.19,999 చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన రూ.35 వేల మొత్తాన్ని నో కాస్ట్ EMI రూపంలో చెల్లించవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ దివాళీ సేల్ రేపు (నవంబర్‌ 2) నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్‌ నవంబర్‌ 11 వరకు కొనసాగనుంది.

ఐఫోన్‌ 14 స్పెసిఫికేషన్లు : ఆపిల్‌ సంస్థ గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఐఫోన్ 14 సిరీస్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ 6.1 అంగుళాల సూపర్‌ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 1200 nits గరిష్ఠ బ్రైట్‌నెస్‌ సహా డాల్బీ విజన్‌ సపోర్టుతో వస్తుంది. ఐఫోన్ 14 బేస్‌ మోడల్ ఆపిల్‌ A15 బయోనిక్ SoC చిప్‌ పైన పనిచేస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్ 12MP వైడ్‌ యాంగిల్‌ కెమెరా మరియు 12MP 120 డిగ్రీల అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ను కలిగి ఉంటుంది. ముందువైపు 12MP ట్రూడెప్త్‌ సెన్సార్‌తో వస్తుంది. ఈ ఫోన్ ముందువైపు ప్లాట్ ఎడ్జ్‌ ఏరోస్పేస్‌ గ్రేడ్‌ అల్యూమినియం ప్రేమ్‌ సహా సిరామిక్ మెటీరియల్‌ను కలిగి ఉంటుంది. మరియు IP68 డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌ రేటింగ్‌తో రానుంది.

iPhone 14

ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి సేల్‌ నవంబర్‌ 2 నుంచి 11 వరకు జరగనుంది. ఈ సేల్‌ రూ.99 నుంచి ప్రారంభం అవుతుంది. SBI కార్డుతో చెల్లింపులు చేయడం ద్వారా 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను పొందుతారు. ఈ సేల్‌లో భాగంగా కంప్యూటర్‌ ఉపకరణాలతోపాటు Sony, Nikon, Canon వంటి బ్రాండ్‌ల డిజిటల్‌ కెమెరాలపై డిస్కౌంట్లను అందించనుంది. దీంతోపాటు రిఫ్రిజిరేటర్లు, ఒవెన్, ఎయిర్‌ కండీషనర్లు, వాటర్‌ ఫ్యూరిఫైయర్‌ వంటి గృహ ఉపకరణాలపై డిస్కౌంట్లను అందించనుంది.

దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై ఆఫర్లను ప్రకటించింది. మరియు నో కాస్ట్ ఈఎంఐ సహా ఇతర డిస్కౌంట్లను అందించనుంది. దీంతోపాటు ఎక్స్చేంజీ ఆఫర్లతో మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అయితే సేల్‌ ప్రారంభం అయిన తర్వాత సరైన ధరలు వెల్లడించే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
iPhone 14 will be available at RS49999 in flipkart diwali sale 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X