ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ ఫెస్టివల్ డేస్ సేల్.. ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్ పై భారీ డిస్కౌంట్.. పూర్తి వివరాలు..!
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్‌లో ప్రస్తుతం మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ మరియు సమ్మర్ ఫెస్టివల్ డేస్ (Flipkart Summer Festival days sale 2024) పేరుతో సేల్ జరుగుతోంది. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ 15 (iPhone 15 Smartphone) పై భారీ తగ్గింపు ధరను ప్రకటన చేసింది.
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా ఐఫోన్ 15.. 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.66,999 గా ఉంది. అదే 256GB వేరియంట్ ధర రూ.79,999 మరియు 512GB ధర రూ.96,999 గా ఉంది. దీంతోపాటు సిటీ క్రెడిట్ కార్డు EMI లావాదేవీలపై అదనంగా రూ.2000 తగ్గింపును పొందవచ్చు.

ఇతర బ్యాంకు కార్డులపైనా తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి. దీంతోపాటు ఎక్స్చేంజీ ద్వారా రూ.47,500 వరకు ప్రయోజనం పొందవచ్చు. ఈ ఐఫోన్ 15 బ్లాక్, బ్లూ, గ్రీన్, యెల్లో మరియు పింక్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో భాగంగా బ్యాంకు ఆఫర్లు ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు.
ఐఫోన్ 15 స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 15 హ్యాండ్‌సెట్ 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఐఫోన్ 15 ఫోన్ డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సిరామిక్ గాజుతో రక్షణ పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ A16 బయోనిక్ చిప్‌తో వచ్చింది. iOS 17 పైన పనిచేస్తుంది. మరియు iOS 18 అప్‌డేట్‌ను పొందవచ్చు.
ఈ ఐఫోన్ 15 క్వాడ్ పిక్సల్ సెన్సార్ మరియు 100 శాతం లైటినింగ్ ఫాస్ట్ ఆటోఫోకస్‌తో 48MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ వీడియో కాల్స్ కోసం 12MP కెమెరాను అమర్చారు. ఈ ఐఫోన్ 15 బేస్ మోడల్ 128GB, 256GB, 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్ వైరడ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 3,349mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. 15W వైర్ లెస్ ఛార్జింగ్‌తో సపోర్టు చేస్తుంది. 20W ఛార్జర్‌తో కేవలం 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ పూర్తిచేయవచ్చు. IP68 రేటింగ్‌తో వచ్చింది. USB-C ఛార్జింగ్ పోర్ట్‌ను కలిగి ఉంటుంది.
ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్లు బ్యాటరీ లైఫ్ ఎక్కువ కాలం వచ్చే విధంగా ఈ ఫోన్లలో అద్భుతమైన ఫీచర్ ఉంది. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు 80 శాతానికి మించి ఛార్జింగ్ కాకుండా నిరోధించే వ్యవస్థ కలిగి ఉంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసినప్పుడు 80 శాతం వద్ద ఛార్జింగ్ నిలిచిపోతుంది. ఫలితంగా బ్యాటరీ జీవిత కాలం మెరుగుపడుతుంది.
ఇప్పటికే ఆపిల్... ఆప్టిమైజ్ బ్యాటరీ ఛార్జింగ్ అనే సెట్టింగ్స్‌ను కలిగి ఉంటుంది. ఇది బ్యాటరీని 80 శాతం వరకే ఛార్జింగ్ అయ్యేలా చూస్తుంది. అయితే ఐఫోన్ 15లో ఈ ఫీచర్ కొంచెం భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఐఫోన్ 15 సిరీస్‌లోని సెట్టింగ్‌ల కింద బ్యాటరీ, బ్యాటరీ ఆరోగ్యం, ఛార్జింగ్, ఛార్జింగ్ ఆప్టిమైజేషన్ అనే మరో ఆప్షన్లు ఉంటాయి.


Click it and Unblock the Notifications








