Home
News

మీ ఐఫోన్‌లో అలారం ఫీచర్‌ పనిచేయడం లేదా.. ఈ సమస్యపై ఆపిల్‌ ఏం చెప్పిందంటే ?

ఐఫోన్‌ 15 ప్రో మోడల్‌ లో (iPhone 15 Pro) అలారం ఫీచర్‌ పనిచేయడం లేదని అనేక మంది యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వినియోగదారులు ఈ కారణంగా ఇబ్బంది పడుతున్నారు. X ( గతంలో ట్విట్టర్‌ ) సహా ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ల ద్వారా దీనిపై చర్చించుకుంటున్నారు.

సమస్యపై స్పందించిన ఆపిల్‌ :
ఈ సమస్య తమ దృష్టికి వచ్చినట్లు ఆపిల్‌ సంస్థ ధ్రువీకరించింది. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది. అయితే మీరు కూడా ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే.. ఫిర్యాదు చేసే ముందు సెట్టింగ్స్‌ ను ఒకసారి తనిఖీ చేసుకోండి. సౌండ్ సెట్టింగ్‌ లను సరిచూసుకొని, అప్పటికీ సమస్య ఉంటే ఫిర్యాదు చేయడం ఉత్తమం.

Iphone 15 pro users facing alarm issue

ఐఫోన్‌ 15 ప్రో స్పెసిఫికేషన్లు :
అయితే త్వరలోనే ఇందుకు సంబంధించిన అప్‌ డేట్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఐఫోన్‌ 6.1 అంగుళాల సూపర్‌ రెటీనా XDR డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1179*2556 పిక్సల్‌ రిజల్యూషన్‌, సిరామిక్ షీల్డ్ గ్లాస్‌ రక్షణను పొందుతుంది. ఆల్‌ వేజ్‌ ఆన్‌ డిస్‌ప్లే ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ ఐఫోన్‌ 15 ప్రో ఆపిల్‌ A17 ప్రో చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది.

ట్రిపుల్‌ కెమెరా, టైటానియం బాడీ :
ఈ హ్యాండ్‌సెట్‌ 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 12MP మరో కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ ఐఫోన్‌ 15 ప్రో 12MP కెమెరాను కలిగి ఉంది. IP68 డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా విడుదల అయింది. గ్రేడ్‌ 5 టైటానియం బాడీని కలిగి ఉంటుంది.

కనెక్టివిటీ ఫీచర్లు :
ఐఫోన్‌ 15 ప్రో హ్యాండ్‌ సెట్‌ వైపై 802, GPS, బ్లూటూత్‌ 5.3, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. యాక్సిలిరోమీటర్‌, యాంబియంట్ లైట్‌ సెన్సార్‌, గైరోస్కోప్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌, మాగ్నిటో మీటర్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. బ్లాట్‌ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్‌ టైటానియం మరియు వైట్‌ టైటానియం రంగుల్లో లభిస్తుంది.

ఐఫోన్ 15 ప్రో ధర వివరాలు :
అమెజాన్‌లో ప్రస్తుతం ఐఫోన్‌ 15 ప్రో స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ.1,27,990 గా ఉంది. అమెజాన్‌ పే ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.6,399 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఈ హ్యాండ్‌ సెట్‌ను రూ.1,21,591 గా ఉంది. దీంతోపాటు ఐసీఐసీఐ, బ్యాంకు ఆఫ్‌ బరోడా కార్డుల ద్వారా కూడా తగ్గింపును పొందవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Iphone 15 pro users facing alarm issue and apple responds details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X