Home
News

iPhone 15 ఫోన్లలో 80 శాతం వద్ద బ్యాటరీ ఛార్జింగ్‌ నిలిచిపోతుంది.. ఎందుకో తెలుసా?

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఆపిల్ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న iPhone 15 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను సెప్టెంబర్‌ 12న నిర్వహించిన వండర్‌ లస్ట్‌ కార్యక్రమంలో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌, ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మాక్స్‌ మోడల్‌ ఫోన్లు ఉన్నాయి. సెప్టెంబర్‌ 15 నుంచి ఈ ఫోన్ల ముందస్తు బుకింగ్‌లను కూడా ప్రారంభించింది.

ఈ ఐఫోన్‌ 15 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉన్నాయి. దీంతోపాటు ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌, ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మాక్స్‌ ఫోన్లు అద్భుతమైన ఫీచర్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ల బ్యాటరీని పనితీరును మెరుగుపరిచేందుకు ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు.

iPhone 15 smartphones battery settings

ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్లు 80 శాతానికి మించి ఛార్జింగ్‌ కాకుండా నిరోధించే వ్యవస్థను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసినప్పుడు 80 శాతం వద్ద ఛార్జింగ్‌ నిలిచిపోతుంది. ఫలితంగా బ్యాటరీ జీవిత కాలం మెరుగుపడుతుంది. ఇప్పటికే ఆపిల్‌... ఆప్టిమైజ్‌ బ్యాటరీ ఛార్జింగ్‌ అనే సెట్టింగ్స్‌ను కలిగి ఉంటుంది.

ఇది బ్యాటరీని 80 శాతం వరకే ఛార్జింగ్‌ అయ్యేలా చూస్తుంది. అయితే ఐఫోన్‌ 15లో ఈ ఫీచర్‌ కొంచెం భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఐఫోన్‌ 15 సిరీస్‌లోని సెట్టింగ్‌ల కింద బ్యాటరీ, బ్యాటరీ ఆరోగ్యం, ఛార్జింగ్‌, ఛార్జింగ్‌ ఆప్టిమైజేషన్‌ అనే ఆప్షన్లు ఉంటాయి.

iPhone 15 smartphones battery settings

చైనీస్‌ రెగ్యూలేటరీ డేటాబేస్ ఐఫోన్‌ 15 ఫోన్ల బ్యాటరీ ప్యాక్‌ల గురించి కీలక వివరాలను వెల్లడించింది. ఐఫోన్‌ 15 3,349mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉందని తెలిపింది. అదే ఐఫోన్‌ 15 ప్లస్‌ 4,383mAh, ఐఫోన్‌ 15 ప్రో 3,274mAh, ఐఫోన్‌ 15 ప్రో మాక్స్‌ 4,422mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉందని వెల్లడించింది.

భారత్‌ మార్కెట్‌లో ఐఫోన్‌ 15 బేస్‌ మోడల్‌ రూ.79,900, అలాగే ఐఫోన్ 15 ప్లస్‌ ప్రారంభ ధర రూ.89,900గా ఉంది. ఈ రెండు ఫోన్లు 128GB, 256GB, 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ రెండు ఫోన్లు నలుపు, నీలం, ఆకుపచ్చ, పింక్‌, పసుపు రంగుల్లో లభిస్తుంది.

అదే ఐఫోన్ 15 ప్రో బేసి వేరియంట్‌ ధర రూ. 1,39,900గా ఉంది. అదే ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ రూ.1,59,900గా ఉంది. బ్లాక్‌ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్‌ టైటానియం, వైట్‌ టైటానియం రంగుల్లో గరిష్ఠంగా 1TB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్‌ 15, 15 ప్లస్‌ ఫోన్లు OLED సూపర్‌ రెటినా డిస్‌ప్లేతో వస్తాయి. గరిష్ఠ బ్రైట్‌నెస్‌ 2000 నిట్స్‌ వరకు ఉంటుంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లు వేర్వేరు డిస్‌ప్లే సైజులను కలిగి ఉంటుంది. ఐఫోన్ 15.. 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అదే 15 ప్లస్‌ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ రెండు దృఢమైన గాజు, నీరు, దుమ్ము నిరోధకతను కలిగి ఉంటాయి.

ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ ఫ్లాట్‌ ఎడ్జ్‌ డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లు ప్రోమోషన్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తాయి. అయితే ఐఫోన్ 15 ప్రో 6.1 అంగుళాల డిస్‌ప్లే, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్లు A17 ప్రో బయోనిక్‌ చిప్‌ ఆధారంగా పనిచేస్తాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
iPhone 15 series smartphones having key feature to restrict 100 percent charging
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X