iPhone 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల విడుదల తేదీ ఖరారు.. దీంతోపాటు మరిన్ని ఉత్పత్తుల లాంచ్..!
ఆపిల్ నుంచి కీలక ప్రకటన విడుదల అయింది. iphone 15 లాంచ్‌పై ఎప్పటి నుంచో అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. తాజాగా దీనిపై సంస్థ ప్రకటన చేసింది. తన నెక్ట్స్ జనరేషన్ ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్లను సెప్టెంబర్ 12 10:30PM గంటలకు విడుదల చేస్తామని అధికారికంగా ఆపిల్ సంస్థ వెల్లడించింది.
ఐఫోన్‌లో భారీగా మార్పులు చోటుచేసుకుంటాయని అనేక వార్తలు వచ్చాయి. అయితే డిజైన్‌లో పెద్దగా మార్పులు లేవని తెలుస్తోంది. అయితే ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మోడళ్ల ధరలు భారీగా పెరుగుతాయని మరో వార్త వినిపిస్తోంది. అయితే స్డాండర్డ, ప్లస్ వెర్షన్‌లు పాత ధరలకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిపై స్పష్టత కోసం మరిన్ని రోజులు వేచిచూడాల్సి ఉంది. లీక్‌ల ఆధారంగా కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది.

త్వరలో విడుదల కానున్న ఐఫోన్ సిరీస్‌లో కొన్ని ఆసక్తికర మార్పులు ఉండే అవకాశం ఉంది. ఐఫోన్ 15 స్మా్ర్ట్‌ఫోన్లు USB-C పోర్టును కలిగి ఉంటాయి. ఐఫోన్ 15 స్డాండర్డ్ మోడళ్లు A16 బయోనిక్ చిప్‌ను కలిగి ఉంటాయి. అదే ప్రో మోడళ్లు శక్తివంతమైన A17 బయోనిక్ చిప్‌తో రానున్నాయి.
కొత్తగా లాంచ్ కానున్న ఐఫోన్లు సన్నని బెజెల్స్‌తో పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడళ్లు డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌తో రానున్నాయని తెలుస్తోంది. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఆకర్షణీయమైన టైటానియం ఫినిష్‌తో రానుందని సమాచారం.

ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడల్ నాణ్యమైన ఫోటోగ్రఫీ కోసం పెరిస్కోప్ లెన్స్‌ను కలిగి ఉంటుంది. దీంతో మరింత మెరుగైన జూమ్‌ను పొందవచ్చు. ప్రో మోడళ్లలో మ్యూట్ బటన్‌కు బదులుగా యాక్షన్ బటన్‌ను ఉంటుంది. అయితే మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
సెప్టెంబర్ 12న జరగనున్న ఐఫోన్ 15 విడుదల కార్యక్రమంలో స్మార్ట్‌ఫోన్లతోపాటు మరిన్ని ఉత్పత్తులను లాంచ్ చేసే అవకాశం ఉంది. ఆపిల్ వాచ్ సిరీస్ 9ను విడుదల చేసే అవకాశం ఉంది. దీంతోపాటు అప్‌డేటెడ్ ఆపిల్ వాచ్ ఆల్ట్రాను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇందులో S9 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.
వీటితోపాటు M3 ప్రాసెసర్‌తో మరో కొత్త డివైస్‌ను లాంచ్ చేయనుంది. iMAC గురించి గత కొన్ని రోజుల నుంచి కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే డిజైన్‌లో ఎటువంటి మార్పులు ఉండవని తెలుస్తోంది. వీటితోపాటు ఈ విడుదల కార్యక్రమంలో ఆపిల్ ఎయిర్‌పాడ్స్ కోసం USB-C ఛార్జింగ్ కేస్‌ను ఆవిష్కరించనుందని తెలుస్తోంది. ఇదే కార్యక్రమంలో iOS 17 మరియు ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌ల విడుదల కోసం షెడ్యూల్ వెల్లడించే అవకాశం ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








