Home
News

iPhone 15 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను పవర్‌ బ్యాంక్‌తో ఛార్జింగ్‌ చేయలేమా?

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఆపిల్‌ నుంచి సెప్టెంబర్‌ 12న నిర్వహించిన వండల్‌ లస్ట్ కార్యక్రమంలో iPhone 15 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌, ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మాక్స్‌ మోడల్‌ ఫోన్లు ఉన్నాయి. సెప్టెంబర్‌ 15 నుంచి ఈ ఫోన్ల ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం అయ్యాయి.

ఐఫోన్‌ 15 స్మార్ట్‌ఫోన్లు USB-C ఛార్జింగ్ పోర్టుతో విడుదల అయ్యాయి. సుమారు 11 సంవత్సరాలుగా ఉన్న లైట్‌నింగ్‌ పోర్టులు కలిగి ఉన్న ఐఫోన్లు... యూరోపియన్‌ యూనియన్‌ నిర్ణయంతో USB-C పోర్టుతో స్మార్ట్‌ఫోన్లను విడుదల అయ్యాయి. ఎలక్ట్రానిక్‌ పరికరాల ఛార్జింగ్‌కు ఒకేరకమైన పోర్టు ఉపయోగించాలని యూరోపియన్‌ యూనియన్‌ ప్రతిపాదించింది. ఇందుకు ఆ దేశ పార్లమెంట్‌ కూడా ఆమోదం తెలిపింది. డిసెంబర్‌ 28, 2024 నాటికి వరకు గడువు విధించింది.

iPhone 15 series

ఐఫోన్‌ 15 USB-C ఛార్జింగ్‌ పోర్టు అన్ని రకాల USB-C టైప్‌ పవర్‌ అడాప్టర్లను సపోర్టు చేయకపోవచ్చని ఓ నివేదిక అంచనా వేస్తోంది. ఇదే సమస్యను కొంత మంది వినియోగదారులు సోషల్‌ మీడియా వేదికల ద్వారా వెల్లడిస్తున్నారు. అనేక సందర్భాల్లో పవర్‌ బ్యాంక్‌ ద్వారా ఐఫోన్‌ 15 ఫోన్లను ఛార్జింగ్‌ చేసేందుకు వీలుకావడం లేదని, అందుకు బదులుగా పవర్‌ బ్యాంక్‌లు ఛార్జింగ్‌ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇందుకు ఐఫోన్‌ 15లో ఉన్న రివర్స్‌ ఛార్జింగ్‌ ఫీచర్‌ కారణమని భావిస్తున్నారు. ఇతర ఆపిల్ పరికరాలైన వాచ్‌, ఎయిర్‌పాడ్స్‌లోను ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. చాలా పవర్‌ బ్యాంక్‌లతో ఛార్జింగ్‌ చేస్తున్నప్పుడు ఇదే సమస్య ఉత్పన్నం అవుతోందని ఓ వినియోగదారుడు తెలిపాడు.

iPhone 15 series

ఐఫోన్‌ 15 స్మార్ట్‌ఫోన్లు బ్యాటరీ లైఫ్‌ ఎక్కువ కాలం వచ్చే విధంగా ఈ ఫోన్లలో అద్భుతమైన ఫీచర్‌ ఉంది. ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్లు 80 శాతానికి మించి ఛార్జింగ్‌ కాకుండా నిరోధించే వ్యవస్థ కలిగి ఉంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసినప్పుడు 80 శాతం వద్ద ఛార్జింగ్‌ నిలిచిపోతుంది. ఇప్పటికే ఆపిల్‌... ఆప్టిమైజ్‌ బ్యాటరీ ఛార్జింగ్‌ అనే సెట్టింగ్స్‌ను కలిగి ఉంటుంది.

ఇది బ్యాటరీని 80 శాతం వరకే ఛార్జింగ్‌ అయ్యేలా చూస్తుంది. అయితే ఐఫోన్‌ 15లో ఈ ఫీచర్‌ కొంచెం భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఐఫోన్‌ 15 సిరీస్‌లోని సెట్టింగ్‌ల కింద బ్యాటరీ, బ్యాటరీ ఆరోగ్యం, ఛార్జింగ్‌, ఛార్జింగ్‌ ఆప్టిమైజేషన్‌ అనే మరో ఆప్షన్లు ఉంటాయి. ఐఫోన్‌ 15 ఫోన్ 3,349mAh, ఐఫోన్‌ 15 ప్లస్‌ 4,383mAh, ఐఫోన్‌ 15 ప్రో 3,274mAh, ఐఫోన్‌ 15 ప్రో మాక్స్‌ 4422mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటాయి.

భారత్‌ మార్కెట్‌లో ఐఫోన్‌ 15 బేస్‌ మోడల్‌ రూ.79,900, అలాగే ఐఫోన్ 15 ప్లస్‌ ప్రారంభ ధర రూ.89,900గా ఉంది. ఈ రెండు ఫోన్లు 128GB, 256GB, 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ రెండు ఫోన్లు నలుపు, నీలం, ఆకుపచ్చ, పింక్‌, పసుపు రంగుల్లో లభిస్తుంది.

అదే ఐఫోన్ 15 ప్రో బేసి వేరియంట్‌ ధర రూ. 1,39,900గా ఉంది. అదే ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ రూ.1,59,900గా ఉంది. బ్లాక్‌ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్‌ టైటానియం, వైట్‌ టైటానియం రంగుల్లో గరిష్ఠంగా 1TB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్‌ 15, 15 ప్లస్‌ ఫోన్లు OLED సూపర్‌ రెటినా డిస్‌ప్లేతో వస్తాయి. గరిష్ఠ బ్రైట్‌నెస్‌ 2000 నిట్స్‌ వరకు ఉంటుంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లు వేర్వేరు డిస్‌ప్లే సైజులను కలిగి ఉంటుంది. ఐఫోన్ 15.. 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అదే 15 ప్లస్‌ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ రెండు దృఢమైన గాజు, నీరు, దుమ్ము నిరోధకతను కలిగి ఉంటాయి.

ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ ఫ్లాట్‌ ఎడ్జ్‌ డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లు ప్రోమోషన్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తాయి. అయితే ఐఫోన్ 15 ప్రో 6.1 అంగుళాల డిస్‌ప్లే, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్లు A17 ప్రో బయోనిక్‌ చిప్‌ ఆధారంగా పనిచేస్తాయి.

Best Mobiles in India

English summary
iPhone 15 series users facing issues with USB C power bank during Charging
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X