ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్‌పైన మరోసారి డిస్కౌంట్ ఆఫర్లు.. ధర, సేల్ వివరాలు..!
ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్‌పై (iPhone 15) ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా విజయ్ సేల్స్, క్రోమా వంటి సంస్థలు మరోసారి డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటన చేశాయి. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఈ ఐఫోన్ 15 ఫోన్‌పై తగ్గింపు ఆఫర్లను పొందింది. ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్లు, ఆఫర్ల పూర్తి వివరాలు మీకోసం.
విడుదల సమయంలో ఐఫోన్ 15 రూ.79,900 ధరను కలిగి ఉంది. అయితే తాజా సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌లో (iPhone 15 discounts in Flipkart) ఈ ఫోన్ 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.65,999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే సుమారుగా రూ.13,901 తగ్గింపును పొందవచ్చు.

అమెజాన్‌లో ఐఫోన్ 256GB స్టోరేజీ మోడల్‌ను రూ.89,900కి విడుదల చేయగా.. ప్రస్తుతం రూ.8,910 డిస్కౌంట్‌తో రూ.80,900 కే కొనుగోలు చేయవచ్చు. అదే విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 15 ఫోన్ 128GB మోడల్ ధర రూ.71,155 గా ఉంది. HDFC కార్డు ద్వారా రూ.6000 తగ్గింపునకే సొంతం చేసుకోవచ్చు. ఫలితంగా ఈ ఫోన్ రూ.65,155 గా ఉంటుంది.
అదే క్రోమాలో ఐఫోన్ 15.. 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.71490 కు అందుబాటులో ఉంది. ఈ క్రోమా ప్లాట్‌ఫాంలో HDFC కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.6000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్ ధర రూ.65,490 గా ఉంటుంది.
ఐఫోన్ 15 స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 15 డైనమిక్ ఐలాండ్ టెక్నాలజీ ను కలిగి ఉంటుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గత మోడళ్లు కంటే నాణ్యమైన విజువల్ అనుభూతిని అందిస్తోంది. మెరుగైన కెమెరా సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. సిరామిక్ గాజుతో రక్షణ పొందుతుంది.
ఈ ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్ క్వాడ్ పిక్సల్ సెన్సార్ మరియు 100 శాతం లైటినింగ్ ఫాస్ట్ ఆటోఫోకస్‌తో 48MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ వీడియో కాల్స్ కోసం 12MP కెమెరాను అమర్చారు. ఐఫోన్ 15 A16 బయోనిక్ చిప్‌తో వచ్చింది. మరియు ఐఫోన్ iOS 16 OSను సపోర్టు చేస్తుంది. 128GB, 256GB, 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్ 3367mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్లు బ్యాటరీ లైఫ్ ఎక్కువ కాలం వచ్చే విధంగా ఈ ఫోన్లలో అద్భుతమైన ఫీచర్ ఉంది. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు 80 శాతానికి మించి ఛార్జింగ్ కాకుండా నిరోధించే వ్యవస్థ కలిగి ఉంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసినప్పుడు 80 శాతం వద్ద ఛార్జింగ్ నిలిచిపోతుంది. ఫలితంగా బ్యాటరీ జీవిత కాలం మెరుగుపడుతుంది.
ఇప్పటికే ఆపిల్... ఆప్టిమైజ్ బ్యాటరీ ఛార్జింగ్ అనే సెట్టింగ్స్‌ను కలిగి ఉంటుంది. ఇది బ్యాటరీని 80 శాతం వరకే ఛార్జింగ్ అయ్యేలా చూస్తుంది. అయితే ఐఫోన్ 15లో ఈ ఫీచర్ కొంచెం భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఐఫోన్ 15 సిరీస్‌లోని సెట్టింగ్‌ల కింద బ్యాటరీ, బ్యాటరీ ఆరోగ్యం, ఛార్జింగ్, ఛార్జింగ్ ఆప్టిమైజేషన్ అనే మరో ఆప్షన్లు ఉంటాయి.


Click it and Unblock the Notifications








