తక్కువ ధరకే ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్..!
ఐఫోన్ 15ను ప్రముఖ ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. విడుదల సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.79,900 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంకు ఆఫర్లు, ఎక్స్చేంజీ ఆఫర్లలో సంబంధం లేకుండా ఈ ఫోన్ ధర రూ.72,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ డేస్ సేల్‌లో భాగంగా ఐఫోన్ 15 (iPhone 15)తగ్గింపు ధరను పొందింది.
బ్యాంకు, ఎక్స్చేంజీ ఆఫర్‌లో భాగంగా ఈ ఐఫోన్‌ను కేవలం రూ.39,949 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్‌లో భాగంగా HDFC కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.4000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. మంచి కండిషన్‌లో ఉన్న ఐఫోన్ 14ను ఎక్స్చేంజీ చేయడం ద్వారా అదనంగా రూ.33,505 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా యాపిల్ ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.39,949 ధరకే సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్ 15 స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 15 డైనమిక్ ఐలాండ్ టెక్నాలజీ ను కలిగి ఉంటుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గత మోడళ్లు కంటే నాణ్యమైన విజువల్ అనుభూతిని అందిస్తోంది. సిరామిక్ గాజుతో రక్షణ పొందుతుంది. మెరుగైన కెమెరా సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది.
ఈ ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్ క్వాడ్ పిక్సల్ సెన్సార్ మరియు 100 శాతం లైటినింగ్ ఫాస్ట్ ఆటోఫోకస్‌తో 48MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ వీడియో కాల్స్ కోసం 12MP కెమెరాను అమర్చారు. ఐఫోన్ 15 A16 బయోనిక్ చిప్‌తో వచ్చింది. మరియు ఐఫోన్ iOS 16 OSను సపోర్టు చేస్తుంది. 128GB, 256GB, 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్ 3367mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్లు బ్యాటరీ లైఫ్ ఎక్కువ కాలం వచ్చే విధంగా ఈ ఫోన్లలో అద్భుతమైన ఫీచర్ ఉంది. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు 80 శాతానికి మించి ఛార్జింగ్ కాకుండా నిరోధించే వ్యవస్థ కలిగి ఉంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసినప్పుడు 80 శాతం వద్ద ఛార్జింగ్ నిలిచిపోతుంది. ఫలితంగా బ్యాటరీ జీవిత కాలం మెరుగుపడుతుంది.
ఇప్పటికే ఆపిల్... ఆప్టిమైజ్ బ్యాటరీ ఛార్జింగ్ అనే సెట్టింగ్స్‌ను కలిగి ఉంటుంది. ఇది బ్యాటరీని 80 శాతం వరకే ఛార్జింగ్ అయ్యేలా చూస్తుంది. అయితే ఐఫోన్ 15లో ఈ ఫీచర్ కొంచెం భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఐఫోన్ 15 సిరీస్‌లోని సెట్టింగ్‌ల కింద బ్యాటరీ, బ్యాటరీ ఆరోగ్యం, ఛార్జింగ్, ఛార్జింగ్ ఆప్టిమైజేషన్ అనే మరో ఆప్షన్లు ఉంటాయి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications