గ్లోబల్ మార్కెట్‌లో సత్తా చాటిన ఐఫోన్ 15 సిరీస్, శాంసంగ్ A సిరీస్ హ్యాండ్‌సెట్‌లు..!
గ్లోబల్ మార్కెట్‌లో ఈ సంవత్సరం వివిధ బ్రాండ్‌లకు చెందిన అనేక స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. ఎంట్రీ లెవల్ నుంచి ఫ్లాగ్‌షిప్ ధర సెగ్మెంట్ వరకు హ్యాండ్‌సెట్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే అందులో కొన్ని మోడళ్లు రికార్డు స్థాయిలో విక్రయాలను నమోదు చేశాయి. ఇటీవల వచ్చిన వివిధ స్మార్ట్‌ఫోన్‌లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. 2024 సంవత్సరం మూడో త్రైమాసికం గ్లోబల్ మార్కెట్ సేల్ వివరాలను కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వెల్లడంచింది.
ఈ జాబితాలోని టాప్ 10 ఫోన్‌లలో ఐఫోన్ 15 (iPhone 15) తొలి స్థానంలో నిలిచింది. శాంసంగ్, రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌లకు కూడా ఈ లిస్ట్‌లో చోటు దక్కింది. ఐఫోన్ 15 సిరీస్ సహా శాంసంగ్ A సిరీస్ హ్యాండ్‌సెట్‌లు విక్రయాల్లో రాణించినట్లు కౌంటర్ పాయింట్ సెర్చ్ రీసెర్చ్‌లో వెల్లడయింది. గత సంవత్సరం మూడో త్రైమాసికంలోనూ ఆపిల్ ఐఫోన్ టాప్ 1 గా నిలిచింది.

ఈ టాప్ 10 జాబితాలో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్‌లు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. అనంతరం నాలుగు స్థానంలో శాంంగ్ A సిరీస్ హ్యాండ్‌సెట్‌లు ఉన్నాయి. చివరి మూడు స్థానాల్లో ఆపిల్, రెడ్‌మి, శాంసంగ్ హ్యాండ్‌లు ఉన్నాయి. ఆ రీసెర్చ్ నివేదిక ఆధారంగా ప్లా్గ్‌షిప్, మిడ్‌రేంజ్ హ్యాండ్‌సెట్‌లపై యూజర్‌లు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ జాబితాలో ఐఫోన్ 15 తొలి స్థానంలో ఉంది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 15 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అనంతరం శాంసంగ్ గెలాక్సీ A15 4G, శాంసంగ్ గెలాక్సీ A15 5G, శాంసంగ్ గెలాక్సీ A35 5G, శాంసంగ్ A05 స్మార్ట్‌ఫోన్‌లు వరుసగా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 8 వ స్థానంలో ఐఫోన్ 14 ఉంది. రెడ్‌మి 13c 4G, శాంసంగ్ గెలాక్సీ S24 స్మార్ట్‌ఫోన్ 9, 10 స్థానాల్లో ఉన్నాయి.
ఈ జాబితా ఆధారంగా ఆపిల్, శాంసంగ్ వంటి ప్రముఖ సంస్థల నుంచి ప్రీమియం, మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం మూడో త్రైమాసికంలోనూ ఆపిల్, శాంసంగ్ సంస్థలు అధిక స్థాయిలో విక్రయాలను నమోదు చేశాయి.
ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ.58,999 గా ఉంది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర రూ.1,23,999, ఐఫోన్ 15 ప్రో స్మార్ట్‌ఫోన్ రూ.1,03,999 గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ A15 5G సుమారు రూ.14397 గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ A35 5G హ్యాండ్‌సెట్ ధర రూ.30999, శాంసంగ్ A05 సుమారు రూ.8000 గా ఉంది.
అదే ఐఫోన్ 14 ధర రూ. 54900 గా ఉంది. అదే రెడ్‌మి 13C 4G స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ.7000 గా ఉంది. అదే శాంసంగ్ గెలాక్సీ S24 హ్యాండ్‌సెట్ ధర సుమారు రూ.58000 గా ఉంది. అయితే ఈ ధరలు వేర్వేరు ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలు సహా సంస్థ వెబ్‌సైట్ వేర్వేరుగా ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








