Home
News

iPhone 16 కీలక వివరాలు లీక్‌.. ఈ మోడల్‌ను పోలి ఉంటుందా?

ఐఫోన్‌ 15 కొన్ని నెలల ముందు అందుబాటులోకి వచ్చింది. వచ్చే సంవత్సరం ఐఫోన్ 16 (iPhone 16) స్మార్ట్‌ఫోన్ రానుంది. అయితే ఇప్పటికే కొత్త ఐఫోన్‌ గురించి చర్చ ప్రారంభం అయింది. డిజైన్‌ సహా ఇతర ఫీచర్లపై పలు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే డిజైన్‌లో కీలక మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మ్యాక్‌ రూమర్స్‌ నివేదిక ప్రకారం... కెమెరా లేఅవుట్‌ సహా బటన్లలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఐఫోన్‌ 16 కోసం ఆపిల్‌ అనేక ప్రోటోటైప్స్‌పైన పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రోటోటైప్‌ల డిజైన్ మధ్య చిన్న చిన్న మార్పులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.

iphone 16 camera module

ఐఫోన్ 16 ప్రోటోటైప్‌లు వేర్వేరు రంగుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. పసుపు, పింక్‌, మిడ్‌నైట్, బ్లాక్ రంగుల్లో ఉంది. పసుపు రంగు ప్రోటోటైప్‌లో యాక్షన్‌ బటన్‌, యూనిఫైడ్‌ వాల్యూమ్‌ బటన్‌, X-స్టైల్‌ కెమెరా బంప్‌ కూడా ఉంటుందని తెలుస్తోంది. పింక్‌ రంగు ప్రోటోటైప్‌లో యాక్షన్ బటన్‌ సహా ప్రత్యేక మెకానికల్ వాల్యూమ్‌ బటన్లు, మిడ్‌ నైట్‌ రంగులోని ప్రోటోటైప్‌ వేరియంట్‌లో పొడవైన యాక్షన్‌ బటన్‌ మరియు కొత్త క్యాప్చర్‌ బటన్‌ ఉంటుంది.

ఐఫోన్‌ 15 మరియు ఐఫోన్‌ 16 మధ్య కెమెరా మాడ్యుల్‌ మార్పు ఉంటుందని తెలుస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం వెర్టికల్‌ మాడ్యుల్‌ను కలిగి ఉంటుంది. అయితే ఐఫోన్‌ 16 కోసం రెండు కెమెరా బంప్‌ డిజైన్‌లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి ఐఫోన్‌ 12 డిజైన్‌ను పోలి ఉంటుందని తెలుస్తోంది. రెండవది x-టైప్‌ డిజైన్‌తో సింగిలర్‌ పిల్‌ ఎక్లోజర్‌ను కలిగి ఉంది. అయితే ప్రోటోటైప్‌లో ఐఫోన్ 12 డిజైన్‌ను వినియోగించింది.

iphone 16 camera module

ఐఫోన్‌ 16 ప్రోటోటైప్‌ వేరియంట్‌లో తొలుత ఒకే వాల్యూమ్ బటన్‌ను కలిగి ఉంది. అయితే కొన్ని టెక్నికల్‌ సమస్యల కారణంగా యూనిఫైడ్‌ వాల్యూమ్‌ బటన్‌ బదులుగా మెకానికల్ బటన్‌లను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్‌ 15 ప్రో మోడల్‌లో యాక్షన్‌ బటన్‌ను మ్యూట్ స్విచ్‌తో భర్తీ చేసింది. దాంతోపాటు యాక్షన్‌ బటన్‌ సైజ్‌ వేర్వేరు ప్రోటోటైప్‌లలో వేర్వేరుగా ఉంటుందని తెలుస్తోంది.

కొన్ని ఐఫోన్‌ 16 ప్రోటోటైప్ వేరియంట్లలో కుడివైపున క్యాప్చర్‌ బటన్‌ను ఆపిల్‌ టెస్టింగ్‌ చేస్తోంది. ఈ క్యాప్చర్‌ బటన్ ఫోర్స్ సెన్సార్‌, టాక్ట్‌ స్విచింగ్‌తో అమర్చబడి ఉంటుంది. దీని అభివృద్ధి సమయంలో సమస్యలు ఎదురైతే క్యాప్చర్ బటన్‌ను మినహాయించి బ్యాకప్ హార్డ్‌వేర్‌ కాన్ఫిగరేషన్‌ను అభివృద్ధి చేసింది.

iphone 16 camera module

ఐఫోన్‌ 16 డైనమిక్‌ ఐలాండ్‌ ఫీచర్‌తో వస్తుందని తెలుస్తోంది. ఈ డిజైన్‌ ఐఫోన్‌ 15 మాదిరిగా ఉంటుంది. ఇందులో పెద్దగా మార్పులు చేయలేదు. అయితే ఐఫోన్‌ 15 మాదిరిగానే ఐఫోన్‌ 16 స్మార్ట్‌ఫోన్‌ ప్రోటోటైప్‌ కిందివైపున USB-C టైప్‌ పోర్ట్‌ను కలిగి ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
iphone 16 camera module may have similar design as iphone 12
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X