Home
News

రికార్డు క్రియేట్‌ చేసిన ఆపిల్‌ ఐఫోన్‌ 16 స్మార్ట్‌ఫోన్‌.. కీలక నివేదిక విడుదల..!

స్మార్ట్‌ఫోన్‌ తయారీదారులకు భారత్‌ అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉంది. అయితే కొన్ని సంవత్సరాల నుంచి వినియోగదారుల అభిరుచి, కొనుగోలు శక్తిలోనూ మార్పులు వస్తున్నాయి. గతంలో బడ్జెట్‌, మిడ్‌రేంజ్‌ మోడల్స్ వైపు మొగ్గుచూపిన అనేక మంది ప్రస్తుతం ప్రీమియం మోడల్స్‌ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి.

కౌంటర్‌ పాయింట్‌ డేటా రీసెర్చ్‌ :
తాజాగా విడుదల అయిన కౌంటర్‌ పాయింట్‌ డేటా రీసెర్చ్‌ (Counter Point Research Report) ఆధారంగా అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ సంవత్సరానికి సంబంధించిన రిపోర్టును విడుదల చేసింది. భారత్‌ మార్కెట్‌లో ఆపిల్‌ ఐఫోన్‌ 16 మోడల్ (iPhone 16 Smartphone) భారీగా అమ్ముడయిన హ్యాండ్‌సెట్‌గా నిలిచింది. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లను వెనక్కి నెట్టి ఈ రికార్డును సాధించింది.

iphone 16 smartphone became best smartphon

రికార్డు స్థాయిలో ఐఫోన్ విక్రయాలు :
కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ డేటా ఆధారంగా 2025 సంవత్సరం తొలి 11 నెలల్లో ఆపిల్ ఐఫోన్ 16 మోడల్‌ ఏకంగా 6.5 మిలియన్‌ల (65 లక్షలు) విక్రయాలతో రికార్డు సృష్టించింది. అనంతరం 4.7 మిలియన్‌ల (47 లక్షలు) విక్రయాలతో వివో Y29 5G ఫోన్‌ రెండో స్థానంలో ఉంది.

టాప్‌ 5 స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా.. :
దీంతోపాటు ఇదే సమయంలో మరో ఆపిల్ మోడల్ ఐఫోన్‌ 15 కూడా గణనీయమైన విక్రయాలను నమోదు చేసింది. అధిక విక్రయాలు నమోదు చేసిన టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలిచింది. ఎంట్రీ లెవల్‌, బడ్జెట్‌, మిడ్‌రేంజ్‌ మోడల్స్ ఎక్కువగా అమ్ముడయ్యే భారత్‌లో ఆపిల్‌ తన ప్రత్యేకతను చాటుకున్నట్లయింది.

ఇదే కారణమా :
ఈ వివరాలు కొనుగోలుదారుల్లో స్పష్టమైన మార్పులను సూచిస్తున్నాయి. నోకాస్ట్ EMI ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు, బ్యాంక్‌ ఫైనాన్సింగ్‌ ఆఫర్లు.. ప్రీమియం మోడల్స్‌ను అనేక మందికి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు భావించవచ్చు. భారత్‌లో ఆపిల్‌ విక్రయాల వృద్ధిని వ్యూహాత్మక పురోగమనాన్ని ప్రతిబింబిస్తుంది.

5 ఆపిల్‌ స్టోర్‌లు :
గతం కంటే భిన్నంగా ఈ సంవత్సరంలో ఆపిల్‌ భారత్‌లో తయారీని గణనీయంగా ప్రోత్సహించింది. అదే సమయంలో భారత్‌ను కేవలం ఉత్పత్తి కోసమే కాకుండా కీలకమైన మార్కెట్‌గానూ ఆపిల్‌ భావించింది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం బెంగళూరు, పూణే, నోయిడాలో కొత్త ఆపిల్‌ స్టో్ర్‌లను ప్రారంభించింది. ప్రస్తుతం మొత్తంగా దేశంలో 5 ఆపిల్‌ స్టోర్‌లు ఉన్నాయి.

ఐఫోన్‌ 16 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
ఐఫోన్‌ 16 స్మార్ట్‌ఫోన్‌ 6.1 అంగుళాల సూపర్‌ రెటీనా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ సిరామిక్‌ షీల్డ్‌ రక్షణను పొందుతోంది. డైనమిక్‌ ఐలాంట్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 48MP ప్రైమరీ కెమెరా, 2x జూమింగ్‌తో 12MP అల్ట్రామిడ్‌ కెమెరాను కలిగి ఉంది. ముందువైపు 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ ఫోన్ ఆపిల్ A18 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ 128GB, 256GB, 512GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. కెమెరా, యాక్షన్‌ బటన్‌లు ఉన్నాయి. ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. IP68 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iphone 16 smartphone became best smartphone with 6.5 million unit sales in india in 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X