ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఎలా ఉంటాయంటే.. కీలక మార్పులను కలిగి ఉండనుందా?
ఆపిల్ నుంచి కొత్త ఐఫోన్ 16 ఈ సంవత్సరం చివర్లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ iPhone 16 పై ఇప్పటికే అనేక లీక్‌లు వస్తున్నాయి. అయితే ఈ ఫోన్ లాంచ్ అయ్యేందుకు ఇంకా కొన్ని నెలల సమయం ఉండగా.. ఈ ఫోన్ డిజైన్, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు గురించి అనేక వార్తలు వస్తున్నాయి.
అయితే MacRumors ప్రకారం ఈ ఐఫోన్ 16.. గత మోడల్ ఫోన్ల కంటే అనేక విధంగా మెరుగ్గా ఉంటుందని సమాచారం. ఐఫోన్ 16 ప్రో 6.27 అంగుళాల డిస్‌ప్లే, ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ 6.86 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇవి గతం కంటే మెరుగైన పనితీరును కనబరుస్తుంది.

దీంతోపాటు గణనీయమైన డిజైన్ మార్పులను కూడా కలిగి ఉంది. ఫలితంగా ఐఫోన్ 16 సిరీస్ బేస్ మోడల్‌లో వర్టికల్ కెమెరా లేఅవుట్‌ను కలిగి ఉంది. ఐఫోన్ 15 తో పోలిస్తే ఇది స్థిరమైన మార్పులుగా కనిపిస్తోంది. ఫలితంగా స్పేషియల్ వీడియో రికార్డింగ్ కు అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది.
దీంతోపాటు గత మోడళ్లతోపాటు మెరుగైన బ్యాటరీ సామర్థ్యాలను కలిగి ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడళ్లు ప్రత్యేకంగా పెద్ద బ్యాటరీలను కలిగి ఉండే అవకాశం ఉంది. కొన్ని లీక్‌ల ఆధారంగా ఐఫోన్ 16 ప్లస్ అయితే తక్కువ బ్యాటరీ సైజ్‌ను కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మరియు అధునాతన బ్యాటరీ టెక్నాలజీని కలిగి ఉంటుంది.
ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు ఆపిల్ తర్వాత తరం A18 ప్రో చిప్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. చిప్ స్మార్ట్‌ఫోన్ పనితీరును మెరుగుపరుస్తుందని సంస్థ భావిస్తోంది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ మోడళ్లు కూడా మెరుగైన ప్రాసెసర్లను కలిగి ఉంటుందని సమాచారం.
దీంతోపాటు iOS 18లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సామర్థ్యాలను ఇంటిగ్రేట్ చేస్తుంది. ఫలితంగా ఇవి మెరుగైన ఫీచర్లను కలిగి ఉంటాయని సమాచారం. ఈ AI ఆధారిత ఫీచర్లు ఐఫోన్ 16 మోడళ్లు మెరుగైనవిగా ఉండనున్నాయి. అప్‌గ్రేడెడ్ సిరీస్ మరియు AI అసిస్టెడ్ కంటెంట్ క్రియేషన్ టూల్స్‌ను కలిగి ఉంటాయి.
* దీంతోపాటు ఆపిల్ సంస్థ ఫోల్డబుల్ ఐఫోన్‌ను తయారు చేయనుందనే వార్తలు వస్తున్నాయి. కనీసం రెండు ప్రోటోటైప్ ఫోన్లను అభివృద్ధి చేస్తు్న్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోల్డబుల్ ఐఫోన్లు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే వివరాలు వెల్లడి కాలేదు. ప్రోటోటైప్ డిజైన్ పై సంస్థ సంతృప్తి చెందే వరకు ఉత్పత్తి ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది.
కొన్ని నివేదికల ఆధారంగా ఆపిల్ సంస్థ రెండు క్లామ్‌షెల్ మోడల్ ఫోల్డబుల్ ఐఫోన్ మోడల్ ప్రోటోటైప్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ Z Flip తరహా డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. సమాంతరంగా మడతపెట్టే విధంగా ఉంటుంది. ఈ ఫోన్లు ప్రస్తుతానికి ప్రోటోటైప్ మోడళ్లుగానే ఉంటాయని తెలుస్తోంది.
ఐఫోన్ ఫోల్డబుల్ డివైస్‌లకు అవుటర్ డిస్‌ప్లే కలిగి ఉండాలని, ఫోల్డింగ్ చేసినప్పుడు కనిపించేలా ఉండాలని ఆపిల్ తన ఇంజినీర్లకు నిర్దేశించినట్లు తెలుస్తోంది. అయితే ఈ డిజైన్ త్వరగా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పినట్లు తెలిసింది. అయితే ప్రస్తుత ఐఫోన్ల మాదిరిగా సన్నగా ఉండేలా డిజైన్‌ను రూపొందించాలని భావిస్తున్నట్లు సమాచారం.
అయితే ప్రోటోటైప్ ఫోల్డబుల్ ఐఫోన్.. బ్యాటరీ, డిస్‌ప్లే విడిభాగాల కారణంగా కొంచెం మందంగా ఉండే అవకాశం ఉంది. ఆపిల్ సంస్థ ఈ రెండు ప్రోటో టైప్ ఫోల్డబుల్ ఐఫోన్ల విడిభాగాల కోసం ఆసియాలోని విడి భాగాల సరఫరాదారుడిని సంప్రదించినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








