ఫ్లాష్..ఫ్లాష్ ‘ఆపిల్ ఐఫోన్ రూ.9,999కే’

Posted By: Prashanth

ఫ్లాష్..ఫ్లాష్ ‘ఆపిల్ ఐఫోన్ రూ.9,999కే’

 

ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం, ఆపిల్ ఐఫోన్ 3జీఎస్‌ను రూ.9,999కి సొంతం చేసుకునే అవకాశాన్ని ప్రముఖ టెలికామ్ ఆపరేటర్ ఎయిర్‌సెల్ కల్పిస్తోంది. అయితే, ఈ సదవకాశం పోస్ట్ పెయిడ్ కనెక్షన్‌లకు మాత్రమే. ఎయిర్‌టెల్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.20,908కి ఆఫర్ చేస్తోంది.

ఎయిర్‌సెల్ వినియోగదారులు ఫోన్ కొనుగోలుతో పాటు రూ.3,000 ఆడ్వాన్స్ రెంటల్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ చెల్లింపు ద్వారా యూజర్ సంవత్సరం పొడుగూతా అన్ లిమిటెడ్ 3జీడేటాను యాక్సిస్ చేసుకోవచ్చు. 2జీ నెట్‌వర్క్ మాత్రమే అందుబాటులో ఉన్న ప్రాంతాలలో యూజర్ 6 నెలల పాటు అన్‌లిమిటెడ్ 2జీ డేటాను యాక్సిస్ చేసుకోవటంతో పాటు అన్‌లిమిటెడ్ లోకల్, నేషనల్ ఎస్ఎమ్ఎస్‌లను పంపుకోవచ్చు. అంతేకాకుండా 100 నిమిషాల లోకల్, ఎస్‌టీడీ కాల్స్‌ను నిర్విహించుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot