తైవాన్‌లో డిసెంబర్ మద్యలో మొబైల్ సంబరాలు..

Posted By: Super

తైవాన్‌లో డిసెంబర్ మద్యలో మొబైల్ సంబరాలు..

టెక్నాలజీ దిగ్గజం యాపిల్ 'ఐఫోన్ 4ఎస్'ని డిసెంబర్ మద్యలో తైవాన్‌లో విడుదల చేయనున్నట్లు అధికారకంగా ప్రకటించింది. ఐతే డిసెంబర్‌లో ఏ తేదీన తైవాన్ మొబైల్ మార్కెట్లోకి విడుదల చేయనుందని సమాచారం మాత్రం వెల్లడించ లేదు. ఐతే తైవాన్ మార్కెట్లో ఉన్న రూమర్‌ని బట్టి 'ఐపోన్ 4ఎస్'ని డిసెంబర్ 14-16 తారీఖులలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.

తైవాన్‌లో మొదటగా యాపిల్ కంపెనీ 30,000 ఐపోన్ 4ఎస్ డివైజ్‌లను ప్రవేశపెట్టనుంది. యాపిల్ ప్రవేశపెట్టనున్నఈ 30,000 డివైజ్‌లలో ఎక్కవ శాతం 16జిబి, 32జిబి మొబైల్స్ కావడం విశేషం. ఈ 30,000 డివైజ్‌లలో 15, 000 డివైజ్‌లు చుంగ్‌వా టెలికామ్ ద్వారా విడుదలవుతుండగా, మిగిలిన 15, 000 డివైజ్‌లు తైవాన్ మొబైల్, ఫెట్‌లు సంయుక్తంగా విడుదల చేయనున్నాయి.

ఈ మూడు సంస్దలు కూడా గతంలో ఐపోన్‌ని ఎంత ధరకు ఐతే విక్రయించారో అదే ధరకు ఇప్పడు ఐఫోన్ 4ఎస్‌ని కూడా విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్‌లో ఐఫోన్ 4ఎస్‌ని హాంగ్ కాంగ్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్బంలో కొంత మంది కస్టమర్స్ తక్కువ ధరకే ఐపోన్ 4ఎస్‌ని కొనుగొలు చేసిన విషయం తెలిసిందే.

ఇక ఇండియాలో ఐఫోన్ 4ఎస్ బుకింగ్స్ ఎయిర్ సెల్ ద్వారా నవంబర్ 18 నుండి ప్రారంభమయిన విషయం తెలిసిందే. మొదటగా ఎవరైతే ముందు బుకింగ్స్ చేసుకున్నారో వారికి నవంబర్ 25న ఐఫోన్ 4ఎస్ మొబైల్స్‌ని అందజేయనున్నారు. ఇండియాలో ఐఫోన్ 4ఎస్ ధర సుమారు 35, 000 నుండి 55, 000 వరకు మెమరీని బట్టి విక్రయిస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot