బ్రేకింగ్ న్యూస్: భారత్‌లో ఐఫోన్ 5 విడుదల ఖరారు!

By Prashanth
|
iPhone 5 India Release


ఆపిల్ ఐఫోన్5 కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు గుడ్ న్యూస్. ఇండియన్ మార్కెట్లో ‘ఐఫోన్ 5’ను అక్టోబర్ 26 (శుక్రవారం) నాడు విడుదల చేసేందుకు ఆపిల్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు బీజీఆర్ ఇండియా తన రిపోర్టులో పేర్కొంది. ఐఫోన్5 కోసం కలలకంటున్న అభిమానులు ఇంకో పదిహేను రోజులు ఓపికపడితే చాలన్నమాట. పలు దేశాల్లో ఇప్పటికే విడుదలైన ఐఫోన్ 5 అమ్మకాల పై దిమ్మతిరిగే అంచనాలు చెక్కర్లు కొడుతున్నాయి. ఐఫోన్ 5 మొదటి నెలలో కోటి యూనిట్లు అమ్ముడుపోవడం ఖాయమని ప్రముఖ రిసెర్చ్ సంస్థ ఆర్‌బీసీ క్యాపిటల్ మార్కెట్స్ ఓ నివేదికలో పేర్కొంది.

 

ఆఫిల్ ఐఫోన్ 5 ఫీచర్లు:

 

4 అంగుళాల స్ర్కీన్, సరికొత్త ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, శక్తివంతమైన ఏ6 చిప్, 1జీబి ర్యామ్,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో స్టెబిలైజేషన్), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరా, 4జీ ఎల్‌టీఈ వైర్‌లెస్ నెట్‍‌వర్క్, నెట్‌వర్క్ సపోర్ట్ (జీఎస్ఎమ్ 850 / 900 / 1800 / 1900), (సీడీఎమ్ఏ 800 / 1900- Verizon), (3జీ నెట్‌వర్క్ – హెచ్‌ఎస్‌డిపిఏ 850 / 900 / 1900 / 2100), బ్యాటరీ బ్యాకప్ (8 గంటలు 3జీ టాక్‌టైమ్, 10 గంటలు వై-ఫై బ్రౌజింగ్ ఇంకా వీడియో వీక్షణ సమయం, 40 గంటల పాటు మ్యూజిక్ వినొచ్చు, 225 గంటల స్టాండ్‌బై సదుపాయం).

ఇతర ఫీచర్లు:

నానో సిమ్‌కార్డ్ సపోర్ట్,

యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్,

సిరీ లాంగ్వేజ్ కమాండ్స్,

ఐక్లౌడ్ క్లౌడ్ సర్వీస్,

ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అనుసంధానం,

టీవీ అవుట్,

ఐమ్యాప్స్,

ఐబుక్స్ పీడీఎఫ్ రీడర్,

ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,

ఇమేజ్ ఎడిటర్,

వాయిస్ మెమో.

Read In English

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X