నానో - సిమ్ కార్డ్స్ వచ్చేస్తున్నాయ్!

భారత్‌లో ఐఫోన్5 విడుదల సమయం సమీపిస్తున్న నేపధ్యంలో టెలికం నెట్‌వర్క్ ప్రొవైడర్లు నానో సిమ్ కార్డ్స్ టెస్టింగ్‌లో నిమగ్నమయ్యాయి. ప్రముఖ సర్వీస్ ప్రొవైడర్లు వొడాఫోన్, ఎంటీఎన్ఎల్ ముంబయ్, భారతి ఎయిర్‌టెల్‌లు తమ కస్టమర్‌లకు నానో సిమ్ కార్డ్‌లను ఆఫర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. టెలికామ్ టాక్ రిపోర్డుల మేరకు వొడాఫోన్ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొంటూ ‘తమ అన్ని సర్కిళ్లలో నానో సిమ్ కార్డులు లభ్యమవుతాయని సైమెక్స్ (సిమ్ ఎక్స్‌చేంజ్) విధానం ద్వారా తమ చందాదారులు పాత సిమ్ కార్డులను వాపసు ఇచ్చి నానో సిమ్ కార్డులను పొందవచ్చని తెలిపారు.
ఇందుకు గాను అదనపు చార్జీలను చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇదే సమయంలో ఎయిర్‌టెల్ కూడా తమ అన్ని సర్కిళ్లలో నానో సిమ్ కార్డులను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు టెలికామ్ టాక్ రిపోర్డులు స్పష్టం చేస్తున్నాయి. మరో వైపు ఎంటీఎన్ఎల్ 3,4 నాలుగు రోజుల్లో తమ కస్టమర్‌లకు నానో సిమ్ కార్డులను అందుబాటులోకి తేనుంది. మైక్రోసిమ్ కార్డ్‌లతో పోలిస్తే నానో సిమ్‌లు 30శాతం చిన్నవిగా, 15శాతం పలుచగా ఉంటాయి.
నానో సిమ్‌లను సపోర్ట్ చేసే ఐఫోన్ 5 ఫీచర్లు:
4 అంగుళాల స్ర్కీన్, సరికొత్త ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, శక్తివంతమైన ఏ6 చిప్, 1జీబి ర్యామ్,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో స్టెబిలైజేషన్), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరా, 4జీ ఎల్‌టీఈ వైర్‌లెస్ నెట్‍వర్క్, నెట్‌వర్క్ సపోర్ట్ (జీఎస్ఎమ్ 850 / 900 / 1800 / 1900), (సీడీఎమ్ఏ 800 / 1900- Verizon), (3జీ నెట్‌వర్క్ – హెచ్‌ఎస్‌డిపిఏ 850 / 900 / 1900 / 2100), బ్యాటరీ బ్యాకప్ (8 గంటలు 3జీ టాక్‌టైమ్, 10 గంటలు వై-ఫై బ్రౌజింగ్ ఇంకా వీడియో వీక్షణ సమయం, 40 గంటల పాటు మ్యూజిక్ వినొచ్చు, 225 గంటల స్టాండ్‌బై సదుపాయం).
ఇతర ఫీచర్లు:
నానో సిమ్‌కార్డ్ సపోర్ట్,
యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్,
సిరీ లాంగ్వేజ్ కమాండ్స్,
ఐక్లౌడ్ క్లౌడ్ సర్వీస్,
ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అనుసంధానం,
టీవీ అవుట్,
ఐమ్యాప్స్,
ఐబుక్స్ పీడీఎఫ్ రీడర్,
ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,
ఇమేజ్ ఎడిటర్,
వాయిస్ మెమో.


Click it and Unblock the Notifications








